విన్నీ పార్టీలో యష్ ని అభిమన్యు పలకరిస్తాడు. ఈ పార్టీకి తనే చీఫ్ గెస్ట్ అభిమన్యు చెప్పుకుంటాడు. ‘నీకు రావలసిన కాంట్రాక్ట్ నేను దక్కించుకున్నా, నాకు వచ్చేలా వివిన్ చేశాడు. మేమిద్దరం బిజినెస్ పార్టనర్ అయినందుకు ఈ పార్టీ ఇచ్చాడు. నేను గెలిచినందుకు వచ్చిన పార్టీకి నువ్వు వచ్చావ్ లూజర్’ అభిమన్యు యష్ ని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. నేను వదిలేసిన దాన్ని నీకు ఇచ్చాడు. ఈ పార్టీ నేను నీకు పెట్టిన భిక్ష. నాతో నువ్వు పోటీ పడలేవు. నా చేతుల్లో ఓడిపోవడం నీకు అలవాటైపోయింది. నేను కాదు నువ్వు లూజర్ అని గట్టిగా బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడు. యష్ వేద దగ్గరకి వచ్చి వెళ్లిపోదామని అంటాడు. విన్నీకి ఒక మాట చెప్పి వెళ్లిపోదామని వేద అంటుంటగా విన్నీ వస్తాడు.


మీరిద్దరూ నాకు స్పెషల్ గెస్ట్ మిమ్మల్ని ఎలా పంపిస్తాను, డిన్నర్ చేసి వెళ్ళండి ప్లీజ్ అని విన్నీ అడుగుతాడు. నువ్వు ఉండాలని అనుకుంటే ఉండు నేను ఉండనని యష్ కోపంగా వెళ్ళిపోతాడు. వేద పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళతాడు. అభిమన్యు వస్తున్నాడని తెలిస్తే అసలు అడుగు కూడా పెట్టేవాడిని కాదు, నేను వచ్చింది వేద కోసం కద తనని వదిలేసి వెళ్ళడం బాగోదని తన కోసం వెయిట్ చేస్తాడు. అభిమన్యుకి మాళవిక ఫోన్ చేస్తుంది. తనని తిట్టుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి బిస్కెట్స్ వేస్తాడు. ఆ మాటలన్నీ విన్నీ వింటాడు. అభికి నేనంటే పిచ్చి ప్రేమ మమ్మల్ని ఎవరూ విడదీయలేరని మాళవిక అనుకుంటుంది.


విన్నీ: మీ భార్యనా తనని మర్చిపోలేకపోతున్నావా


అభిమన్యు: భార్య ఛీ ఛీ నేను అలాంటి తప్పు అసలు చేయను. పెళ్లి చేసుకునేందుకు కాపురం చేయడానికి నేను ఆల్రెడీ కాపురం చేశాను. తనని నేను ఆరేళ్లుగా భరిస్తున్నా. ఈ పెళ్లి ఇవన్నీ నేను నమ్మను. లైఫ్ లో అన్నీ మార్చకునే ఫెసిలిటీ ఉన్నప్పుడు ఆడదాన్ని ఎందుకు మార్చకూడదు. వాడేసిన ఆడది చదివేసిన న్యూస్ పేపర్ లాంటిదని నోటికొచ్చినట్టు వాగుతాడు. ఈ మాటలన్నీ వేద విని షాక్ అవుతుంది. వీడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు పాపం మాళవిక వీడి కోసం అన్నీ వదిలేసి వచ్చింది. వీడు తనని నట్టేట ముంచేసేలా ఉన్నాడని అనుకుంటుంది.


 బయట యష్ వేద కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా రాలేదేంటని అనుకుంటాడు. అసలే లేట్ అయిపోయింది పాపం ఎలా వస్తుంది కాసేపు వెయిట్ చేద్దామని దోమలతో కుట్టించుకుంటూ ఎదురుచూస్తూ ఉంటాడు. వెళ్తూ విన్నీని పలకరిస్తుంది. యష్ వెళ్లిపోయాడని కవర్ చేస్తుంది. యష్ వెయిట్ చేస్తున్నాడని తెలియక విన్నీ తనని కారులో డ్రాప్ చేస్తానని అంటాడు. పార్కింగ్ లో యష్ ఉండటం వేద గమనించదు, తన వెనుకాలే విన్నీ వస్తాడు. కారు ఎక్కుతూ వేదని గమనిస్తుంది, తనని చూసి కనిపించకుండా చాటుగా నిలబడతాడు. యశోధర్ లాగా ఉన్నారే నాకోసం వెయిట్ చేస్తున్నారా ఇంటికి వెళ్ళినాక తేల్చుకుందామని అనుకుంటుంది. కొంపదీసి చూసి ఉంటుందా అడుగుతుందా అని యష్ తిట్టుకుంటాడు.