అఖిల్ చరణ్ దగ్గరకి ఇంటర్వ్యూకి వెళతాడు. కాసేపటి తర్వాత అఖిల్ బయటకి వెళ్ళిపోతాడు. అఖిల్ దిగులుగా వెళ్ళడం చాటుగా రామా చూస్తాడు. ఉద్యోగం గురించి మాట్లాడాలని రామా చరణ్ దగ్గరకి వెళతాడు. అక్కడ రామాని ఆఫీసులో పని చేసే వ్యక్తి ఆపేస్తాడు. అది చూసి చరణ్ తను నా బెస్ట్ ఫ్రెండ్ అయినా మనిషి రూపం కాదు మనసు చూసి విలువ ఇవ్వాలని అంటాడు. ఆ మాటకి రామా పొంగిపోతాడు. ఇంత డబ్బు సంపాదించినా గొప్పగా ఆలోచిస్తున్నావ్ నువ్వు గొప్పోడివి అని రామా చరణ్ ని మెచ్చుకుంటాడు.


రామా: నా తమ్ముడు ఉద్యోగానికి వచ్చాడు పేరు అఖిల్


చరణ్: మీ తమ్ముడు చాలా తెలివిగలవాడు


రామా: ఉద్యోగం ఇస్తున్నవా


చరణ్: ఏం ఉద్యోగం ఇవ్వమంటావ్


రామా: వాడి చదువుకి తగ్గ ఉద్యోగం ఇస్తా అన్నావ్ కదా అదే ఇవ్వు


చరణ్: బీటెక్ చేసిన వాళ్ళు ఐదుగురు కావాలి వాళ్ళని ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఆ జాబ్ కి ఒక ప్రాబ్లం ఉంది. నేను స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ కి కోటి రూపాయలు ఇన్వెస్ట్ చెయ్యాలి. అందుకు నేను సెలెక్ట్ చేసిన ఐదుగురు తలా రూ.20 లక్షలు ఇవ్వాలి వాళ్ళు ఒప్పుకున్నారు. మూడు నెలల్లో వాళ్ళకి ఇచ్చేస్తాను.


Also Read: తులసి ముందర నందుకి ఘోర అవమానం- లాస్యకి ఎదురుతిరిగిన శ్రుతి


రామా: ఎలాగైనా నా తమ్ముడికి ఈ ఉద్యోగం కావలి


చరణ్: ఇవ్వడానికి నేను రెడీ కానీ మూడు నెలల కోసం ఇరవై లక్షలు పెట్టగలవా


రామా: ఇంకో మార్గం లేదా


చరణ్: నువ్వు ఇరవై లక్షలు పెడితే నీ తమ్ముడి లైఫ్ సెటిల్ అయిపోయినట్లే వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాదు. నువ్వే ఆలోచించుకో


రామా: నా తమ్ముడు జీవితంలో స్థిరపడతాడు అంటే ఇంకేం కావాలి. ఇరవై లక్షలు నేను చూస్తాను ఉద్యోగం మాత్రం నా తమ్ముడికే ఇవ్వు


చరణ్: రేపటి లోగా డబ్బులు కట్టాలి లేకపోతే ప్రాజెక్ట్ చేజారిపోతుందని నమ్మకంగా చెప్తాడు. అవి నిజం అనుకుని రామా డబ్బులు ఇస్తానని చెప్తాడు. జానకి వదిన ఊర్మిళ ఫోన్ చేస్తుంది. జానకి వాళ్ళ అమ్మానాన్న ఆప్దికం ఉంది వాళ్ళని పంపించమని ఊర్మిళ జ్ఞానంబని అడుగుతుంది. సరే పంపిస్తానని జ్ఞానంబ చెప్తుంది. ఈ విషయం ఫోన్ చేసి రామాకి చెప్పి బయల్దేరమని జ్ఞానంబ అంటుంది. రామా మాత్రం చరణ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. డబ్బులు ఎలా తీసుకు రావాలి అని ఆలోచిస్తూ ఉండగా జానకి ఫోన్ చేస్తుంది.


Also Read: మాళవికని చెప్పులతో పోల్చిన భ్రమరాంబిక- తల్లిదండ్రులని మిస్ అవుతున్న ఖుషి


ఆప్దికానికి రమ్మని వదిన ఫోన్ చేసిందని జానకి రామాతో చెప్తుంది. డబ్బులు తీసుకురావాలంటే జానకితో వెళ్ళడం కుదరదు అనుకుని తనని వెళ్ళమని చెప్తాడు. మల్లిక నీలావతిని పిలుస్తుంది. ఇంట్లో చిన్న కోడలు కడుపుతో ఉంది, రేపో మాపో జానకి కోడలు కూడా కడుపు తెచ్చుకుంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని నీలావతి ఎక్కిస్తుంది. అప్పుడు మల్లిక జెస్సీ రిపోర్ట్స్ గురించి చెప్తుంది. అందులో ఏముందో తెలుసుకోవాలని వాటిని కొట్టేశాను కానీ అవి కనిపించడం లేదని చెప్తుంది. జానకిని ఐపీఎస్ కాకుండా చేయడమే తన లక్ష్యం అని మల్లిక అంటుంది.


జ్ఞానంబ వాళ్ళు అఖిల్ ని చదువుకి తగిన మంచి ఉద్యోగం చూసుకోమని చెప్తారు. ఆ మాటలు అన్ని రామా వింటాడు. డబ్బులు ఎలా తీసుకురావాలి అని రామా ఆలోచిస్తూ ఉంటాడు.