గుప్పెడంత మనసు డిసెంబరు 21 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 21st Update Today Episode 639)


తన ఇంటికి బయలుదేరిన వసుధార..జగతి-మహేంద్ర చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది..
జగతి:వసు మేము ఎవరు మీ ఇంటికి రావడం లేదు నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు 
వసు:  అదేంటి మేడం అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా 
జగతి: వసుధార నేను చెప్పేది పూర్తిగా విను అని అంటుంది. రాత్రి దేవయాని అక్కయ్య ఫోన్ మాట్లాడుతుంటే మహేంద్ర విన్నాడు 
( శాశ్వతంగా విడిపోవాలి..ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అన్నమాటలు వింటాడు మహేంద్ర)
వసుధార: దేవయాని మేడం అక్కడికి వచ్చి ఏం చేయలేరు మా వాళ్ళు ఎవరు తెలియదు కదా
జగతి: మీ నాన్న గురించి నాకు తెలుసు ఆరోజు కాలేజీలో టీసీ విషయంలోనే అంత పెద్ద గొడవ చేశారు. చాలాసార్లు గొడవపడ్డాను నా మీద తనకు చాలా కోపం ఉంటుంది. ఇక రిషి నా కొడుకు అని తెలిస్తే రిషి మీద కోపం చూపిస్తాడు. మొత్తానికి సంబంధం వద్దు అనుకునే అవకాశం ఉంటుంది. ఇక దేవయాని అక్కయ్యకు కూడా నువ్వు రిషి కలిసి ఉండటం మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. మాకంటే ముందు నువ్వు వెళ్ళు అందర్నీ అక్కడ ప్రశాంతంగా ఉంటూ అందరి మనసు మార్చి ఆ తర్వాత అసలు విషయం చెప్పు..అప్పుడు అందరం వస్తాం..
ఈ మాటలన్నీ తలుచుకున్న వసుధార.. నా కారణంగా రిషి సార్ అవమానపడకూడదు.. రిషి సార్ గురించి నాన్నకు చెప్పిన 
తర్వాతే రమ్మని చెబుతాను అనుకుంటుంది..


Also Read: దీప-కార్తీక్ ను శాశ్వతంగా విడగొట్టేందుకే రిపోర్ట్ మార్చాను, ద్యావుడా! చారుశీల మోనిత మనిషి!


మరోవైపు రిషి వసుధార అన్నమాట తలచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే విషయంపై జగతి మహేంద్ర మాట్లాడుకుంటారు. ఆడపిల్లకు పుట్టింటివారు నా అనే వాళ్లు తోడుంటే ఆ ధైర్యం వేరు..కానీ..దురదృష్ట వశాత్తూ వసుధారకి పుట్టింట్లో సరైన స్థానం లేదు..కారణం వాళ్ల నాన్న మూర్ఖుడు, కోపిష్టి..తను ఏమనుకుంటే అదే జరగాలని పట్టుబట్టే మూర్ఖుడు. వసుధార సాధించిన విజయాలపట్ల సంతోషించడు...ఓ అమ్మాయి అంటే ఎంతోకొంత చదువుకుని తలొంచుకుని పెళ్లిపీటలపై కూర్చువాలని అని ఆలోచించే వ్యక్తి ..అందరం వెళితే వసుధార వాళ్ల నాన్న ఎలా రియాక్టవుతాడో అర్థంకాదు..అందుకే ముందు వసుధార వెళ్లి పరిస్థితులు చక్కబడిన తర్వాత అందరం వెళ్లడం మంచిది. ఆడపిల్లకు పెళ్లిచేస్తే బాధ్యత తీరిపోతుందని భావించిన తండ్రిని ఎదిరించి..ఇక్కడకు వచ్చి చాలా కష్టాలుపడింది..తాను అనుకున్నది సాధించింది... వసు సాధించిన విజయాలకు పొంగిపోయేంత గొప్ప మనసు చక్రపాణికి ఉంటుందని నేను అనుకోను మహేంద్ర...కచ్చితంగా వాళ్ల నాన్న ఒప్పుకోడు కానీ వసుధార ఒప్పిస్తందనే నమ్మకం నాకుంది..వసుధార సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటుంది...ఇప్పుడు వసు చేస్తోంది అదే...


జగతి మాట్లాడిన మాటలు మొత్తం వింటాడు రిషి... అక్కడి నుంచి వెళ్లిపోతుండగా బయటఉన్న మొక్క కాలికి తగిలి కిందపడుతుంది...ఆ సౌండ్ విని బయటకు వచ్చిన మహేంద్ర..ఎక్కడికి వెళుతున్నావ్ అని అడుగుతాడు


రిషి: వెళ్లాల్సిన సమయం వచ్చింది డాడ్.. మేడం చెప్పిన మాటలు విన్నాను..వసుధార పరిస్థితి నాకు అర్థమైంది.. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించింది..వసుధార వాళ్లింటికి వెళతాను...
మహేంద్ర: రిషి నువ్వెళ్లడమేంటి..
రిషి: వసుధారకి ఎక్కడ కష్టం ఎదురవుతుందో అక్కడ నేనుండాలి..తను ఇంటికి పంపించానని నేను నిబ్బరంగా ఉన్నాను కానీ తను ఇంట్లో కష్టాలు ఎదుర్కొనేందుకు ఒంటరిగా వెళ్లిందని ఇప్పుడే తెలిసింది..
జగతి: రిషి... నేను వెళ్లొద్దు అనడం లేదు..ఒక్క నిముషం ఉండు ఇప్పుడే వస్తాను అంటూ లోపలకు వెళ్లి... నల్లపూసల గొలుసు తీసుకుని వచ్చి ఇస్తుంది....ఇది వసుకి ఇవ్వు అని చెబుతుంది...ఏంటిది అని రిషి అడిగితే నేనిచ్చానని చెప్పు అంటుంది... 
ఆ తర్వాత అది ఓపెన్ చేద్దాం అనుకుని ఆగిపోతాడు రిషి...వసుధార ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను.. తనకి కష్టం ఉందని తెలిస్తే తనని ఒంటరిగా వదిలి ఉండలేను.
జగతి: వసుధార వాళ్ల ఊరెళ్లు కానీ వాళ్లింటికి వెళ్లొద్దు..
మహేంద్ర: అదేంటి జగతి...
జగతి: ఆయన మాటల్లో మర్యాద వినిపించదు..నోటికెంత వస్తే అంత మాట్లాడతాడు.. వసు పిలిస్తే తప్ప నువ్వు ఆ ఇంట్లోకి వెళ్లొద్దు..
సరే మేడం అని వెళ్లిపోతాడు రిషి... బయటకు వెళుతుండగా..ద్వారం కాలికి తగిలి తూలిపడబోతాడు....
వాడు వెళుతుంటే దెబ్బ తగిలిందని మహేంద్ర టెన్షన్ పడతాడు... మహేంద్ర అపశకునం లాంటి మాటలు మాట్లాడకు రిషి మొదటిసారి వసుధార ఊరెళుతున్నాడు..అంతా మంచే జరగాలని కోరుకుందాం అని జగతి అంటే.. నా మనసు ఆందోళనగా ఉందంటాడు మహేంద్ర. రిషి గొప్ప ప్రేమికుడు..వసు కష్టం తెలిసిన వెంటనే వెళ్లాలనుకున్నాడు..ఇలాంటి కొడుకుని ఇచ్చినందుకు థ్యాంక్స్ మహేంద్ర....


Also Read: కన్నీళ్లతో పుట్టింటికి బయలుదేరిన వసు, నీ వెనుక రిషి ఉన్నాడని గుర్తుపెట్టుకో అంటూ భరోసా!


వసుధార-రిషి: వసుధార కారులో వెళ్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వెళుతున్నాను అన్న ఆనందం ఒకవైపు మీరు పక్కన లేరు అన్న బాధ మరోవైపు అనుకుంటుంది. రిషి సార్ నాతో పాటు రాలేదు రావాలనిపించడం లేదా అనుకుంటూ ఉండగా ఇంతలో రిషి వచ్చి కారు ఆగుతుంది. రిషిని చూసి వసుధార ఆశ్చర్యపోతుంది. అప్పుడు వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మీ ఊరు గురించి ఎన్నోసార్లు కథలు కథలుగా చెప్పావు అని రిషి అనగా అప్పుడు చెప్పాను ఇప్పుడు చూపిస్తాను సార్ అని అంటుంది. అప్పుడు రిషి వసుధార చెప్పిన మాటలు అన్నీ చెప్పడంతో వసుధార సంతోషపడుతూ ఉంటుంది. వారిద్దరూ వెళ్తూ ఉండగా దేవయానికి రిషికి ఫోన్ చేసి నువ్వు తొందరగా వెనక్కి వచ్చేసేయ్ అని అనడంతో సారీ పెద్దమ్మ వసుధారని ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదనడంతో దేవయాని షాక్ అవుతుంది.