వేద ముచ్చటగా రెడీ అయి గదిలోకి వస్తుంది. తనని చూసి యష్ మైమరచిపోతాడు. నిద్రపోవడానికి ముందు వేద తన చేతి గాజులు తీసేస్తుంది. అక్కడే బల్లి కనిపించడంతో వేద గట్టిగా అరిచి యష్ ని కౌగలించుకుంటుంది. ఆ అరుపు రాణికి వినిపించి నిద్రలేస్తుంది. వేద భయపడుతూ బల్లి ఉంది పోయిందా అని అడుగుతుంది. చాలసేపు అయ్యిందని యష్ నవ్వుతూ చెప్తాడు. ఇద్దరి చూపులు కాసేపు కలుస్తాయి. పడుకున్న తర్వాత కూడా యష్ వేదని చూస్తూ ఉంటాడు. ఇద్దరు మనసులోనే మాట్లాడుకుంటారు.


వేద: రోజు చూసే యశోధర్ గారెనా ఈరోజు ఇక్కడ కొత్తగా కనిపిస్తున్నారు, ఈ ఫీలింగ్ ఏదో కొత్తగా ఉంది


యష్: మేం కలిసే ఉన్నాం కానీ కలిసిపోలేకపోతున్నాం


వేద: కారణం మరెవరో కాదు కదా


యష్: మాకు మేముగా చేసుకున్న ఒప్పందం


వేద: ఇది మా మధ్య మేము గీసుకున్న లక్ష్మణ రేఖ


యష్: గతం చేసిన గాయం నుంచి బయట పడలేకపోతున్నాన


వేద: చేదు జ్ఞాపకాలు చెరిపేసుకోలేకపోతున్నా


Also Read: తులసి విలువ తెలుసుకుంటున్న నందు- బతికి అందరినీ బాధపెట్టడం ఎందుకంటున్న పరంధామయ్య


యష్: పాత ప్రయాణం ఆగిపోయేది ఎప్పుడు


వేద: కొత్త ప్రయాణం ఎప్పుడు మొదలుపెట్టాలి అని ఇద్దరు అనుకుంటారు.


తెల్లారి నిద్రలేవగానే వేద ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఉంటుంది. తనని చూసి రాజా, రాణి సంతోషిస్తారు. ముగ్గుకు  రంగు వేస్తున్న యష్ వేదని చూసి మురిసిపోతాడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రొమాన్స్ చేసుకున్నట్టు రాణి ఊహించుకుంటుంది. చుక్కలు, గీతలు, రంగులు మూడు కలిపి గీసినది ఆమె మనసు అని రాజా చెప్తాడు. వేదకి తన భర్త అంటే పిచ్చి ప్రేమ అని రాణి, రాజా మెచ్చుకుంటారు. మీరు వచ్చిన కాసేపటిలోనే మీ గురించి అర్థం అయ్యింది, మా వేదకి భర్త అంటే అమితమైన ప్రేమ అని అంటారు. వేద తన మనసులో మీరు చెప్పింది నిజమే తాతయ్య ఆయన మీద నాకు ఎటువంటి కోపం, చిరాకు ఏమి లేవు, ఉన్నది ఒక్కటే ప్రేమ, ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటారో అని అనుకుంటుంది. ఒప్పందంగా మిగిలిన మన ప్రయాణం ఎప్పటికీ ఒప్పందంగా మిగిలిపోతుందా అని యష్ అనుకుంటాడు.


భ్రమరాంబిక, అభిమన్యు టిఫిన్ కి కూర్చుంటారు. అప్పుడే మాళవిక వచ్చి ఇంత ఎర్లీ గా తింటున్నావ్ ఏంటి అని మాళవిక అడుగుతుంది. భ్రమరాంబిక పక్కన మాళవిక కూర్చోబోతుంటే తిడుతుంది. తను మన ఫ్యామిలీ మెంబర్ అని అభి అంటుంటే ఆ మాట భ్రమరాంబిక ఒప్పుకోదు. ఆమె మాటకి అభిమన్యు తల ఊపుతాడు. మాళవిక ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనని కూల్ చెయ్యడానికి అభి వెనుకాలే వెళతాడు. తన గురించి అంత చీప్ గా మాట్లాడుతుంది ఏంటి, చెప్పులతో పోలుస్తుందా అని సీరియస్ అవుతుంది.


Also Read: బాపు బొమ్మలా వేద, కన్నార్పకుండా చూస్తున్న యష్- మాలిని మీద కస్సుబుస్సులాడిన సులోచన


మాళవిక: మన రిలేషన్ గురించి చెప్పడానికి ఏంటి నీ ప్రాబ్లం, నాకు తాళి కట్టకపోయిన నేను నీకు భార్యని ఇది నువ్వు చెప్పిన మాటే మీ అక్కతో చెప్పడానికి ఏంటి నీ ప్రాబ్లం. పద రిజిస్టర్ ఆఫీసుకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం


అభి: నేను రెడీ బంగారం. మా అక్కని నేనే రప్పించాను, నీ గురించి చెప్పి ఒప్పించి నీ మెడలో తాళి కడదాం అని పిలిచాను. కోట్ల ఆస్తి ఉంది మా అక్కకి, తనకున్న వారాసుడిని నేను ఒక్కడినే తనని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అంటాడు.


ఖుషి తల్లిదండ్రులని చాలా మిస్ అవుతుంది. వేద శారీ, యష్ కోట్ తెచ్చి పక్కన వేసుకుని బాధగా పడుకుంటుంది. అది చూసి మాలిని, సులోచన కూడా బాధపడతారు.