సామ్రాట్ కి తులసి పార్టీ ఇవ్వడానికి తీసుకెళ్తుంది. అదృష్టం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని తులసి సామ్రాట్ కి చూపిస్తుంది. రూ.500 పర్సులో పెట్టి అది రోడ్డు మీద వదిలేస్తారు. అదేంటి అలా పర్స్ రోడ్డు మీద పడేశారు ఎవరైనా తీసుకెళ్లిపోతే అని సామ్రాట్ అంటాడు. ఎవరికి ఆ డబ్బు రాసి పెట్టి ఉంటే వాళ్ళకే దొరుకుంటుందని తులసి చెత్త లాజిక్ చెప్తుంది. అటుగా వెళ్తున్న ఇద్దరు ఆ పర్స్ చూసి తీసుకుందామని అనుకుంటారు. అందులో ఒకడు సీసీటీవీ ఉంది అది తీసుకుంటే అందులో కనిపిస్తుంది. పట్టుకుంటే దొరికిపోతామని అని పారిపోతారు. అప్పుడే కళ్ళు కనిపించని ఇద్దరు వచ్చి ఆ పర్స్ తీసుకుంటారు. ఆ ముసలోళ్ళు పర్స్ తీసుకోవాలని తులసి కోరుకుంటుంది.


ఆ డబ్బున్న పర్స్ అక్కడే పెట్టేయమని అతని భార్య చెప్తుంది. పెట్టబోతుంటే తులసి వచ్చి తీసుకోవచ్చు కదా అని అంటుంది. పరాయి సొమ్ముకి ఆశపడకూడదు అని చెప్తారు. ఆ పర్స్ తనదే అని తులసి అనేసరికి వాళ్ళు ఇచ్చేస్తారు. అందులోని డబ్బులు ఆ ముసలి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. నందు కారులో వెళ్తూ తల్లిదండ్రుల మాటలు తలుచుకుని బాధపడతాడు. సామ్రాట్ కళ్ళకి గంతలు కట్టి నడవమని దిక్కుమాలిన ఛాలెంజ్ వేస్తుంది. సరే అని కళ్ళకి గంతలు కట్టించుకుని రీడదు దాటాడానికి చూస్తాడు. ట్రాఫిక్ లో నడవలేనని భయపడి తులసిని పిలుస్తాడు. కళ్ళు లేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ గురించి కాసేపు క్లాస్ తీసుకుంటుంది.


Also Read: మాళవికని చెప్పులతో పోల్చిన భ్రమరాంబిక- తల్లిదండ్రులని మిస్ అవుతున్న ఖుషి


రాజీ పడి బతకటం చాలా కష్టం. మీలాంటి వాళ్ళని వదులుకున్నందుకు నందు నిజంగా చాలా దురదృష్టవంతుడు అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. నందు ఒక హోటల్ కి వచ్చి ఫుడ్ తింటాడు. అక్కడికే తులసి, సామ్రాట్ కూడా వస్తారు. తులసికి మొహం చూపించలేకపోతున్నా అని బాధపడుతూ ఉంటాడు. తులసి వాళ్ళకోసం కాఫీ ఆర్డర్ చేసి ఫుడ్ పార్సిల్ అడుగుతుంది. అది ఎందుకని సామ్రాట్ అడుగుతాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ సామ్రాట్ పెళ్లి దగ్గరకి వస్తుంది. మీరు పెళ్లి చేసుకోలేదని ఈర్ష్యగా ఉందని తులసి గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వు విని నందు అటుగా తిరిగేసరికి అక్కడ తులసి, సామ్రాట్ ని చూసి షాక్ అవుతాడు.


ఎవరి నుంచి అయితే దాక్కోవాలని ట్రై చేస్తున్నానో వాళ్ళే కళ్ళ ముందు ఉన్నారు, ఇక్కడ నుంచి వెంటనే బయట పడాలని నందు అనుకుని ఫుడ్ కి బిల్ తీసుకుని రమ్మంటాడు. నందు మొహం దాచుకుని బిల్ కట్టడానికి కౌంటర్ దగ్గరకి వెళతాడు. జేబులో పర్స్ చూసుకునేసరికి లేదని గుర్తిస్తాడు. దీంతో హోటల్ యజమాని నందు గురించి హేళనగా మాట్లాడతాడు. పర్స్ ఇంట్లో మర్చిపోయాను అని గుర్తు చేసుకుంటాడు.


Also Read: తులసి విలువ తెలుసుకుంటున్న నందు- బతికి అందరినీ బాధపెట్టడం ఎందుకంటున్న పరంధామయ్య


తరువాయి భాగంలో..


పరంధామయ్య కడుపులో మంటతో ఇబ్బంది పడుతుంటే అంకిత వచ్చి ఏమైందని అడుగుతుంది. విషయం చెప్పేసరికి అంకిత కిచెన్ లోకి వెళ్ళి ఫ్రిజ్ కి తాళం ఉండటం చూసి ఇది ఎప్పటి నుంచి జరుగుతుందని అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ లాస్యని నిలదీస్తారు. ఇది నా ఇల్లు, ఈ ఇంటి కోడలిగా బాధ్యతలు చూస్తున్నా అని లాస్య అనేసరికి శ్రుతి తన మీద సీరియస్ అవుతుంది. అప్పుడే శ్రుతికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కిందపడిపోతుంది.