Janaki Kalaganaledhu August 2nd: జ్ఞానంబ  రామకు జరిగినా అవమానాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండటంతో గోవిందరాజులు వచ్చి ధైర్యం ఇస్తూ ఉంటాడు. భవిష్యత్ లో వారిద్దరి మధ్య ఏవైనా మనస్పర్దాలు వస్తే అవి ఎక్కడికి దారితీస్తాయో అని బాధపడుతూ ఉంటుంది. కానీ గోవిందరాజులు నువ్వు చాలా దూరంగా ఆలోచిస్తున్నావు జ్ఞానం అటువంటి విషయంలో నువ్వు ఎటువంటి బాధపడకు.. కావాలంటే రామకు నువ్వు నచ్చచెప్పు అని అంటుంది.


మరోవైపు మల్లిక తన భర్త పై బాగా చిరాకు పడుతూ ఉంటుంది. మీ అమ్మ కళ్ళకు ఆపరేషన్ చేయించు అంటూ వెటకారం చేస్తూ మాట్లాడుతుంది. దాంతో విష్ణు మా అమ్మకు కాదు నీ బుర్రకు చేయించుకో అంటూ తిరిగి కౌంటర్ వేస్తాడు. అక్కడ వేదికపై జానకిని పొగుడుతుంటే కింద మాత్రం నన్ను బాగా తిట్టింది. ఆ సమయంలో కనీసం నాకు సపోర్ట్ గా ఉండలేవు అంటూ అరుస్తుంది.


కనీసం తిట్టింది కానీ లేదంటే లాగి చింత పగలగొట్టేది అని విష్ణు అంటాడు. అలా వారిద్దరి మధ్య కాసేపు మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే జ్ఞానంబ జానకి రాత్రి సన్మానంలో అలసిపోయింది ఇంకా లేవ లేదేమో నిద్రలేపాలి అని అనుకుంటుంది. కానీ అప్పటికే జానకి లేచి ఇల్లంతా శుభ్రం చేసి బయట ముగ్గు వేస్తూ ఉంటుంది.


ఇక ఇదంతా ఎవరు చేశారు అని జ్ఞానంబ ఆశ్చర్యపోతుంది. జానకి ని చూసి అదంతా జానకి చేసింది అని మురిసిపోతుంది. గోవిందరాజులు వచ్చి జానకి ని పొగుడుతూ ఉంటాడు. జానకి వచ్చి కాఫీ తీసుకొస్తాను అని అక్కడినుంచి వెళ్లగా గోవిందరాజులు ఐఏఎస్ ఆఫీసర్ మనకు కాఫీ తీసుకొస్తుంది అంటే ఎంత గర్వంగా ఉంది అని అనటంతో అదే అనొద్దు అని జ్ఞానంబ అంటుంది.


ఆ తర్వాత రామ జానకిని సరదాగా ఆటపట్టించడానికి తన గదిలో బెడ్ పై తను పడుకున్నట్లు దిండులను పెట్టి పైన కప్పి తను ఒకచోట దాచుకొని జానకి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక జానకి కాఫీ తీసుకొచ్చి రామాను పిలుస్తుంది. కాని రామ మాత్రం బుగ్గ మీద ముద్దు పెడితేనే వస్తాను. దానికి జానకి అసలు ఒప్పుకోదు. ఇక రామ తనకు తెలియకుండానే ముద్దు పెడతాను అని తన దగ్గరకు వచ్చి కాసేపు రొమాంటిక్ గా తాకుతూ తల తుడుస్తూ ఉంటాడు.


ఇక ఈ పూటకు భార్య పోస్ట్ అయిపోయింది అని అంటుంది. మళ్ళీ ఇక నిద్ర లేచి మలయాళం ను కాఫీ అడగటంతో జ్ఞానంబ కాఫీ ఇస్తుంది. అది చూసి మల్లిక షాక్ అవుతుంది. ఇక మల్లికను బాగా తిడుతూ ఉంటుంది. జానకి పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసింది అని అంటుంది. గోవిందరాజులు కూడా మల్లికపై కాస్త వెటకారం చేసి మాట్లాడుతాడు.


ఆ తర్వాత జానకి డ్యూటీ కోసం రెడీ అయ్యి అత్తమామల ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఇక రామ వచ్చి దిగ పెడతాను అనటంతో అప్పుడే కారు కూడా వస్తుంది. ఇక ఇప్పటినుంచి మీకు శ్రమ అవసరం లేదు గవర్నమెంట్ వెహికల్ ఉందని అంటుంది. ఇక నేను ఎప్పుడు శ్రమగా ఫీల్ అవ్వలేదు అది నా బాధ్యత అని రామా అంటాడు. లేదా షాపు దగ్గర రామాను కారులో దిగి పెట్టు అని జ్ఞానంబ అంటుంది. పర్సనల్ వాటికి గవర్నమెంట్ వెహికల్ వాడనివ్వరు అని చెబుతుంది జానకి. ఇక రామకుడా అయిన వద్దులే ఆ కారులో నన్ను అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు ఉంటుంది అని సరదాగా కామెంట్ చేస్తాడు.


Also read: Prema Entha Madhuram August 1st: కలిసిపోయిన ఆర్య, అను.. తెలివిగా స్కెచ్ వేసిన మాన్సీ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial