Prema Entha Madhuram August 1st: నీరజ్ ప్రీతికి ఫోన్ చేసి తాము ప్లాన్ చేసిన అమ్మ చేతి వంట బాగుందని.. అంతేకాకుండా ఆర్యకు కూడా తమ ప్లాన్ నచ్చింది అని.. ఇక ఈ బిజినెస్ లో మీతో ఇన్వెస్ట్ చేయటానికి దాదా ఒప్పుకున్నాడు అని అంటాడు. అంతేకాకుండా లాభాల గురించి కూడా చెబుతాడు. వెంటనే ప్రీతి ఈ బిజినెస్ గురించి ప్లాన్ చేసింది అను అని.. తనను అడిగి మళ్లీ కాల్ చేస్తాను అంటుంది.
ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత ప్రీతి అనుతో విన్నావు కదా నువ్వేం చెబుతావో చెప్పు అనడంతో.. ఇటువంటి సహాయాలకు ఆర్య సార్ ముందుంటాడు అంటూ.. స్వయంగా ఆయనే వచ్చి ఇన్వెస్ట్ చేస్తాను నేను ఎందుకు ఒప్పుకోను అని అంటుంది. దాంతో అను ఒప్పుకోవటంతో నీరజ్ కి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెబుతుంది ప్రీతి. ఆ తర్వాత శారదమ్మ, అంజలి దంపతులు గుడికి అని బయలుదేరుతుండగా వారికి మాన్సీ ఎదురవుతుంది.
వెంటనే నీరజ్ తనపై కోప్పడతాడు. మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ అరుస్తాడు. దాంతో తను మళ్లీ బ్రతిమాలుతూ ఉంటుంది. క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటుంది. కానీ శారదమ్మ తనను అసలు క్షమించదు. అంతేకాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచి అక్కడి నుంచి గుడికి బయలుదేరుతారు. ఇక మాన్సీ అందితే జుట్టు లేదంటే కాళ్లు అని.. ఇక తను ఆ ఇంట్లోకి వచ్చేవరకు కాళ్లు పట్టుకోవాలి అని.. ఆ తర్వాత వాళ్ళ జుట్లు పట్టుకోవాలి అని అనుకుంటుంది.
ఇక రేష్మ బాబును ఆడిపిస్తూ ఉండగా మాన్సీ అక్కడికి వస్తుంది. అను ఎక్కడ అని అనటంతో.. వెంటనే రేష్మ తనను అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని అంటుంది. ఇక అను అక్కడికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావు తనపై బాగా కోపాన్ని చూపిస్తుంది. ఇక మాన్సీ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తుంది. జైల్లోకి వెళ్లాక జ్ఞానోదయం అయ్యిందని చెబుతుంది.
నేను మారిపోయాను అంటూ.. కానీ అక్కడికి వెళ్తే వాళ్లు కూడా బయటికి పంపించారు అని.. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళు నువ్వు నాతో పాటు వచ్చేయి అని అంటుంది. దాంతో అను తనపై మరింత ఫైర్ అవుతుంది తప్ప అసలు కూల్ అవ్వదు. అంతేకాకుండా ఏ విషయంలోనైనా క్షమిస్తాను కానీ ఆర్య సార్ ని చంపాలనుకున్న విషయంలో అసలు క్షమించను అంటూ కోప్పడి తనను అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తుంది.
ఆ తర్వాత అను పిల్లల దగ్గర కూర్చొని బాధపడుతూ ఉండగా అప్పుడే ఆవేశంగా వచ్చి అను అని గట్టిగా అరుస్తాడు. ఇక రేష్మ ఇక్కడ అను ఎందుకు ఉంటుంది సార్ అనటంతో తనపై కోపంగా చూస్తాడు. ఇక ఆర్య గొంతు విని అను షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు అను బయటికి రా అని అంటాడు ఆర్య. ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు.. అసలు ఏమనుకుంటున్నావు అనటంతో సార్ అనుకుంటూ బయటికి వస్తుంది అను.
వెంటనే ఆర్య అను దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి హగ్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి నీరజ దంపతులతో పాటు జిండే, మాన్సీ కూడా వచ్చి వాళ్ళని చూసి సంతోష పడతారు. ఇక్కడ గమనించినట్లయితే ఆర్యకు అను జాడ మాన్సీ చెప్పినట్లు అర్థమవుతుంది. అను జాడ చెప్పినందుకు తను మారిపోయింది అని ఇంట్లో వాళ్ళని నమ్మించడానికి తను అనుని అడ్డుపెట్టుకుని అని అర్థమవుతుంది. మొత్తానికి వర్ధన్ ఇంట్లోకి వెళ్లడానికి తెలివిగా స్కెచ్ వేసిందని అర్థమవుతుంది. ఇక అందరూ అనుని ఎందుకిలా దూరంగా ఉన్నావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు.
also read it : Trinayani July 31st: 'త్రినయని' సీరియల్: నోరు జారిన విక్రాంత్‌కు ప్రాణం భయం, తిలోత్తమా చేసిన ప్లాన్ కనిపెట్టిన నయని?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial