'జబర్దస్త్' షోలో కామెడీ కోసం మేల్ ఆర్టిస్టులు ఫిమేల్ గెటప్ వేస్తుంటారు. ఈ కామెడీ రియాలిటీ షోలో కనిపించే హరిత, శాంతి, కొమురం తదితరులు అబ్బాయిలే. జస్ట్ ఫన్ కోసం అలా లేడీ వేషం వేస్తున్నారు. షోలో ఇది కామన్. అయితే... మహిళలు మేల్ గెటప్స్ వేయడం లేటెస్ట్ ట్రెండ్.
'ఎఫ్ 3' సినిమాలో తమన్నా సెకండాఫ్‌లో మ్యాగ్జిమమ్ సన్నివేశాల్లో మేల్ గెటప్‌లో కనిపిస్తారు. అదంతా వినోదం కోసమే! ఇప్పుడు ఈ ట్రెండ్ ను 'జబర్దస్త్' వర్ష ఫాలో అవుతున్నారు. ఈ వారం ప్రసారం కాబోయే 'ఎక్స్ట్రా జబర్దస్త్' షోలో 'ఆటో' రామ్ ప్రసాద్ స్కిట్‌లో వర్ష మేల్ గెటప్‌లో కనిపించనున్నారు.
'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో వర్షను అందరూ 'నువ్వు మగాడివి కదా' అంటూ సెటైర్స్ వేస్తూ ఉంటారు. అదీ వినోదంలో భాగమే అనుకోండి. 'ఆటో' రామ్ ప్రసాద్ స్కిట్ కంటే ముందు వచ్చిన 'బుల్లెట్ భాస్కర్' స్కిట్‌లో సైతం ఆమెతో 'నిజం చెప్పు. నువ్వు మగాడివి కదూ' అంటూ ఇమ్మాన్యుయేల్ డైలాగ్ వేశాడు.
Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?
ఇక, 'ఆటో' రామ్ ప్రసాద్ స్కిట్‌లో అతడిని 'ఎవరు నువ్వు?' అని వర్ష ప్రశ్నిస్తుంది. 'నేను మగాడిని' అని సమాధానం ఇస్తారు. 'మీరు' అని రామ్ ప్రసాద్ అడిగితే... వర్ష కూడా 'మగాడిని' అని రిప్లై ఇస్తుంది. అంటే మేల్ గెటప్ వేసింది కదా! ''చెప్పానా? ఒరిజినల్ ఇదే క్యారెక్టర్'' అని రామ్ ప్రసాద్ అనడంతో అందరూ నవ్వేశారు. అదీ సంగతి!
Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్