గుప్పెడంతమనసు జూన్ 14 మంగళవారం ఎపిసోడ్
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వర్క్ రిషికి మెయిల్ చేసిన విషయంపై ఆలోచిస్తుంది వసుధార...
వసుధార: సార్ ఏంటో పొగడటంలో కూడా పొదుపు పాటిస్తున్నారు.ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించాను కదా. బాగుందని మెసెజ్ చేయొచ్చు కదా? అయినా సర్ ఏ మూడ్‌లో ఉన్నారో అనుకుంటుంది.
సాక్షి: సరుకులు కొనుక్కున్నావా వసుధారా...ఇదీ నీ రేంజ్..నీ అవతారం నీ పరిస్థితి అన్నీ చూస్తుంటే అర్థమవుతోంది. సింగిల్ రూమ్ లోంచి బంగ్లాళోకి మారేందుకే కదా నీ ప్లాన్
వసుధార: మర్యాదగా మాట్లాడండి
సాక్షి: నిజమే కదా మాట్లాడుతున్నా
వసుధార: మర్యాదగా మాట్లాడుతున్నా..లేదంటే నా సమాధానాలు వేరేలా ఉంటాయ్
సాక్షి:నీ గురించి అంతా తెలుసుకున్నాను..ఎక్కడి నుంచి వచ్చావ్.. ఎలా వచ్చావ్.. ఏం చేయబోతోన్నావ్.. నీ పట్టుదల, మొండితనం అన్నీ తెలుసుకున్నాను.. నేను చెప్పినట్టు బుద్దిగా విన్నావ్.. నడుచుకున్నావ్. ఈ ఒక్క పనీ చేసి పెట్టు. రిషి ఐ లవ్యూ చెబితే నో అన్నావ్.. అలానే రిషికి, నాకు పెళ్లయ్యే వరకు ఎక్కడికైనా వెళ్లవా.. మా మంచి వసుధార కదా? నువ్వూ మంచిదానివి నేనూ మంచిదానిని. మన మధ్య ఎలాంటి గొడవా లేదు. ఇద్దరి మధ్యా రిషి ఉన్నాడంతే. నీకు రిషి అవసరం లేదు, నాకు రిషి అవసరం. నువ్ దూరంగా వెళ్లిపో.. నేను రిషిని పెళ్లి చేసుకుంటాను.. కావాలంటే పెళ్లయ్యాక రా.. మా పెళ్లి వీడియో పంపిస్తాను చూసుకో. ఏంటి అలా చూస్తున్నావ్ నువ్ ఇక్కడే ఉంటే రిషి మనసు మారుతుందేమో వెళ్లమ్మా..వెళ్లు
వసుధార: చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావ్
సాక్షి: పరిహారం కూడా ఎక్కువే ఇస్తానులే..ఎంత కావాలో అంత రాసుకో. మేం బాగా రిచ్.. మేం, రిషి ఒకటే రేంజ్.
వసుధార: ఏంటి ఇంత డబ్బు ఒకే సారి చూసి ఉక్కిరిబిక్కిరి అవుతానని అనుకుంటున్నావా?
సాక్షి: నేను అంతే..అందర్నీ ఇలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తాను. నేను వెళ్లిపోతే కాలేజ్, మిషన్ ఎడ్యుకేషన్, సర్‌కు అసిస్టెంట్ ఎలా అని అనుకుంటున్నావా? అవన్నీ నేను చూసుకుంటానులే.. నా ప్లాన్లేవో నాకు ఉంటాయ్ కదా? మిషన్ ఎడ్యుకేషన్, కాలేజ్‌ను నేను నడిపిస్తాను. డీబీఎస్టీ ఎండీని నేనే అవుతాను
వసుధార: నేను అందరిలా డబ్బు వెనకాల పరిగెత్తేదాన్ని కాదు..అయినా అంకెల విలువలు, మనుషుల విలువలు నీకు తెలీదులే
సాక్షి: నువ్ ఎటూ రిషిని కాదన్నావ్ కదా?
వసుధార: రిషి సర్ టాపిక్ ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు..అసలు ఎక్కువ మాట్లాడితే.. రిషి సర్ పేరు తీసే అర్హత నీకు లేదు.. డీబీఎస్టీ కాలేజ్ ఎండీ కావాలని, మిషన్ ఎడ్యుకేషన్‌ని రన్ చేయాలని కలలు కంటున్నావ్, అవి నిజం కావు, ఓ మనిషిని ప్రేమతోనే గెలవగలం ఈ విషయం నీకు తెలీదు.. నీకు ఏ అర్హత ఉందని రిషి సర్ వెంట పడ్డావో నాకు తెలియడం లేదు.. డబ్బులంటే సరిపోదు
దీంతో ఏయ్ అని సాక్షి ఫైర్ అవుతుంది. అవతలి నుంచి ఇంకా ఎక్కువ సౌండ్‌తో ఏయ్ అని వసు కూడా ఫైర్ అవుతుంది. నేను గట్టిగా అరిస్తే.. బస్తీ వాళ్లంతా నిన్నేం చేస్తారో తెలుసా?వద్దులే నా నోటితో నేను చెప్పలేను.. నువ్ ఎన్ని జన్మలు ఎత్తినా, ఏం చేసినా కూడా రిషి సర్ మనసుని గెలవలేవు. రిషి సర్‌ని చేరుకోవడం నీ వల్ల కాదు.. ఈ చెక్‌ని ఎందుకు తీసుకున్నానంటే నీ ఆటోగ్రాఫ్ కోసం.. డబ్బుపరంగా నీ రేంజ్ కాకపోవచ్చు.. కానీ నా మనసులో ధైర్యముంది.. నాకంటూ ఓ వ్యక్తిత్వముంది..అని చెప్పి వసు వెళ్లిపోతుంది.
Also Read: హిమ మెళ్లో తాళి కట్టేసిన నిరుపమ్, మొత్తం జ్వాల చూసేసింది!
సాక్షి అసలు ఏమనుకుంటుంది.. పది జన్మలు ఎత్తినా కూడా రిషి సర్‌ని చేరుకోలేదు.. ఈ విషయం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. జగతి మేడంకు చెబుదామా? వద్దా.. చెప్పి అనవసరంగా మేడంని బాధపెట్టడం ఎందుకు అనుకుంటూ వసు కాలేజీలో ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇంతలోనే కాలేజ్‌లో అందరూ పరుగులు తీస్తుంటారు. కాలేజ్ ల్యాబ్‌లో పొగలు రావడం, అందులో రిషి చిక్కుకుపోవడంతో బయట అంతా కంగారుగా ఉంటారు. అంతలో అక్కడకు వెళ్లిన వసుధార ఏం జరిగిందని అడుగుతుంది. మీరంతా ఏం చేస్తున్నారు రిషి సర్‌ని ఎందుకు పంపించారు అని ఫైర్ అయిన వసుధార..మహేంద్ర అడ్డుకుంటున్నా వినకుండా లోపలకు పరుగుతీస్తుంది.
Also Read: వంటల పోటీల్లో వెనిగర్ పంచాయితీ- జానకి మాటతో ఉలికిపడ్డ సునంద- ఇక రామచంద్ర గెలిచినట్టేనా?
రిషి సర్ రిషి సర్ అని ఏడుస్తూ వసుధార అంతా వెతుకుతుంది.
రిషి: నువ్వెందుకు వచ్చావ్.. నీ ప్రాణాలకు ప్రమాదం వెళ్లు వసుధార
వసు: మీ ప్రాణాలకు ఏమైనా అయితే నేను బతకను సర్
రిషి: స్టూడెంట్స్ అందరినీ బయటకు పంపించగలిగాను..వెళ్లు వసుధార.. వెళ్లిపో వసుధార
వసు: చున్నీని నీటితో తడిపి రిషి ఫేస్ కి కడుతుంది. నీ ప్రాణాలకు ప్రమాదం వెళ్లు వసు అని రిషి అంటున్నా మిమ్మల్ని కాపాడుకోలేని ప్రాణాలు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని వసు అంటుంది.
మొత్తానికి రిషిని క్షేమంగా బయటకు తీసుకొస్తుంది వసుధార. ఎపిసోడ్ ముగిసింది..