పోటీ చివరిలో నాన్ వెజ్ ఐటెమ్‌ ప్రిపేర్‌ చేయమంటారు. రామచంద్ర మాత్రం తనకు నాన్‌వెజ్‌ వండటం రాదని.. వేరేది ఇవ్వాలని రిక్వస్ట్ చేస్తాడు. నిర్వాహుకులు మాత్రం తాము ఏది ఇస్తే అది చేయమంటారు. అంతేకానీ మీకు నచ్చింది చేయడానికి కాదని తేల్చి చెప్పేస్తారు. జానకి వెళ్లి నిర్వాహకులతో మాట్లాడుతుంది. తన భర్త చిన్నప్పటి నుంచి నాన్‌వెజ్‌కు దూరమని చెప్తుంది. తమ ఆచారం ప్రకారం అలాంటివి చేయకూడదని వివరిస్తుంది. అలాంటి ఆచార సంప్రదాయాలు దెబ్బతినకుండా చూడాలని పోటీ గైడ్‌లైన్స్‌లో కూడా ఉందని గుర్తు చేస్తుంది జానకి. ఒక్కసారి వెరిఫై చేసుకోమంటుంది. దయచేసి తన భర్త మనోభావాలను అర్థం చేసుకొని వేరే టాస్క్‌ ఇవ్వమంటుంది. 


దీనిపై నిర్వాహకులు, జడ్జెస్‌ మాట్లాడుకొని... ఓ నిర్ణయానికి వస్తారు. జానకిని తన సీట్లోకి  పంపించేసి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఏ టాస్క్‌ ఇచ్చిన చేస్తారా అని ప్రశ్నిస్తారు. ఏ టాస్క్‌ ఇచ్చినా గౌరవించి చేయాలే కానీ... ఒక వేళ కాదూ కూడదని చెప్తే పోటీల నుంచి ఎలిమినేట్‌ అవ్వాల్సి ఉంటుందని రూల్ పెడతారు. ఓకే అని చెప్తాడు రామచంద్ర. 


Also Read: ఇది కాదా L-O-V-E, వసు తనని ప్రేమిస్తోందని రిషికి క్లారిటీ వచ్చినట్టేనా!


కళ్లకు గంతలు కట్టుకొని ఇష్టమైన వంట చేయాలని రామచంద్రకు చెప్తారు నిర్వాహకులు. ఇది విన్న అందరూ ఆశ్చర్యపోతారు. ఇలా ఎలా సాధ్యమని అనుకుంటారు. రామచంద్ర మాత్రం తాను రెడీ అంటూ ముందుకొస్తాడు. 


ఇంట్లో టీవీ చూస్తున్న మల్లి... భర్త విష్ణు ముందు తెగ నటించేస్తుంది. తన బావను గెలిపించాలని.. అలా గెలిపిస్తే మోకాళ్లపై ప్రదక్షిణాలు చేస్తానంటూ మొక్కుకుంటుంది. దీంతో ఆమె ఆట కట్టించేందుకు భర్త మల్లికను తీసుకెళ్లి గుడిలో ప్రదక్షిణలు చేయిస్తాడు. ఆమె వద్దంటున్నా లాక్కెళ్లి మరీ మొక్కు తీర్చాలని పట్టుబడతాడు. 


కళ్లకు గంతలు కట్టి రామచంద్ర వంట చేస్తుంటాడు. ఇక్కడ తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. రామ ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడేమో అని కంగారు పడుతుంది. అయితే గోవిందరాజు మాత్రం తన కుమారుడు సాధిస్తాడని అంటాడు. తనది అర్జునుడిలా పనిపైనే దృష్టి పెట్టి గెలుస్తాడని జ్ఞానాంభకు ధైర్యం చెప్తాడు. 


రామచంద్ర పక్కనే వంట చేస్తున్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి పందెంలో ఓడిపోయాలా చేయమని ప్లాన్ చేస్తుంది సునంద. ఆ ప్లాన్ ప్రకారమే  తాను చేస్తున్న వంటకంలో వెనిగర్ కలిపేస్తుంది ఆ పోటీదారు. పక్కన ఉన్న రామచంద్ర వంటకాన్ని చెడగొట్టమంటే... తన వంటకాన్ని ఎందుకు చెడగొట్టుకుందో సునందకు అర్థం కాదు. 


Also Read: హిమ మెళ్లో తాళి కట్టేసిన నిరుపమ్, మొత్తం జ్వాల చూసేసింది!


ఆ దశ పోటీ ముగుస్తుంది. పోటీదారులు చేసిన వంటకాలను న్యాయనిర్ణేతలు రుచి చూస్తారు. రామచంద్ర చేసిన వంటకంపై ప్రశంసలు జల్లు కురిపిస్తారు. అదే టైంలో సునంద ప్లాన్‌లో భాగమైన వ్యక్తి వంటకం బాగాలేదని చెప్తారు. వెనిగర్ ఎక్కువైందంటారు. అసలు తాను వెనిగర్ వేయలేదని అంటుందామె. మరి ఎవరు వేశారని ప్రశ్నిస్తారు న్యాయనిర్ణేతలు. తనకు తెలియదని... పక్కనే ఉన్న రామచంద్రే ఈ పని చేసి ఉంటాడని చెబుతుందామె. రామచంద్రకు ఇచ్చిన బాటిల్ ఖాళీగా ఉందని కూడా చూపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని రామచంద్రను దోషిగా తేలుస్తారు న్యాయనిర్ణేతలు. మోసం చేసి గెలవాలనుకున్న రామచంద్రను పోటీల నుంచి ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటిస్తారు. 


ఇదంతా చూస్తూ బాధపడుతున్న ఫ్యామిలీ మెంబర్స్‌ ఒక్కసారిగా లేచి న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని తప్పుబడతారు. ఎలాంటి ఆధారాల్లేకుండా రామచంద్రను ఎలా ఎలిమినేట్ చేస్తారని ప్రశ్నిస్తారు. ఖాళీ బాటిల్ చూసి ఎలా తీర్పు ఇస్తారని నిలదీస్తారు. మరేం చేయమంటారని న్యాయనిర్ణేతలు ప్రశ్నిస్తారు. సీసీటీవీ ఫుటేజ్ చూడాలని సలహా ఇస్తుంది జానకి. దీంతో సునంద, సునంద ఏర్పాటు చేసిన మనిషి ఇద్దరూ షాక్ తింటారు.