అరుణ్ విజయ్ (Arun Vijay) కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఏనుగు' (Enugu Movie). తమిళ సినిమా 'యానై'కు అనువాదం ఇది. ఇందులో ప్రియా భవానీ శంకర్ కథానాయిక. హీరో సూర్య 'సింగం' సిరీస్, విక్రమ్ 'స్వామి', విశాల్ 'పూజ' వంటి యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ తీసిన హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


తొలుత 'ఏనుగు'ను జూన్ 17న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు విడుదల తేదీ మారింది. సినిమా రెండు వారాలు వెనక్కి వెళ్ళింది. జూలై 1న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.


లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన 'విక్రమ్' సినిమాకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తమిళంలో మంచి వసూళ్లు వస్తున్నాయి. 'ఏనుగు' విడుదల వాయిడ్తో పడటంతో 'విక్రమ్'కు తమిళనాడులో మరో రెండు వారాలు ఎదురు ఉండదని చెప్పవచ్చు.


ప్రభాస్ 'సాహో', రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమాల్లో అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటించారు. నటుడు విజయ్ కుమార్‌కు ఆయన తనయుడు. తెలుగులో 'ఏనుగు' సినిమాను విఘ్నేశ్వర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.హెచ్. సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు. గతంలో ఆయన ధనుష్ 'ధర్మయోగి', 'బూమరాంగ్', 'లోకల్ బాయ్స్' సినిమాలను తెలుగులో విడుదల చేశారు.


Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్


సముద్రఖని, 'కెజియఫ్' ఫేమ్ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి తదితర నటీనటులు 'ఏనుగు'లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


Also Read: తాప్సీతో అతడూ అక్కడికి వెళ్ళాడు కానీ...