గుప్పెడంతమనసు అక్టోబరు 31 ఎపిసోడ్
రిషి-వసుధారని కాపాడి తీసుకొస్తుంది అనుపమ. థ్యాంక్స్ చెప్పిన మహేంద్ర ఆమె ఎవరో తెలియనట్టు ఉండిపోతాడు. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిదని చెబుతుంది అనుపమ. సరే అంటారు ముగ్గురు.వెళ్లొస్తాం అని అనుపమకు చెప్పేసి ముగ్గురూ తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారు. 
రిషి: ఎందుకిలా జరుగుతోంది..వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి
వసు: ప్రమాదాలు తలపెట్టేవాళ్లు చుట్టూ ఉండే ఇలాగే జరుగుతుంది
రిషి: రెండుసార్లు అనుపమగారు కాపాడేవారు కాబట్టే సరిపోయింది..లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో
వసు: అసలు ఆమె ఎవరు 
రిషి: డాడ్ కి తనకి మధ్య ఏదైనా గతం ఉందేమో అనిపిస్తోంది
వసు: కచ్చితంగా ఉందనే అనుకుంటున్నాను. మనం అరకులో ఉన్నప్పుడు మావయ్యని వెతుకుతూ వెళ్లినప్పుడు ఓ రాయిపై మావయ్య, అత్తయ్య పేర్లతో పాటూ అనుపమ అనే పేరు కూడా ఉంది. ఆ తర్వాత అనుపమ గారు మావయ్యని రిసార్ట్ దగ్గర కారులో డ్రాప్ చేయడం చూశాను
రిషి: నిజం సార్
వసు: నాకు తెలిసి మావయ్యలో వచ్చిన మార్పులకు కాఱణం కూడా ఆవిడే అనుకుంటున్నా


Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్: శైలేంద్ర నియమించిన రౌడీ రిషిని చంపుతాడా? అనుపమ వసుధారను కాపాడుతుందా?


ఇంతలో మహేంద్రం అక్కడకు వస్తాడు...అరకులో అయినా ప్రశాంతంగా ఉండాలని వెళితే అక్కడ కూడా ప్రమాదాలు ఎదురయ్యాయి, కొత్త వ్యక్తులు పరిచయం ... అసలు వెళ్లకపోయినా బావుండేది అనిపించింది
రిషి: మరీ అంతలా నిరుత్సాహపడుతున్నారు..అయినా కొత్త వ్యక్తులు అంటున్నారు ఎవరు.. డాడ్ మీకు మనల్ని కాపాడిన ఆమె గురించి అని మాట్లాడుతుండగా..వసుదార రిషిని ఆపేస్తుంది
మహేంద్ర: మనల్ని అటాక్ చేసిందెవరో తెలుసుకోవాలి...
రిషి: దీనిగురించి నేను స్పెషల్ ఆఫీసర్ తో కలసి మాట్లాడుతాను..వాడు దొరికే వరకూ నేను విశ్రాంతి తీసుకోను
మహేంద్ర: వాడికి తగిన శిక్ష పడినప్పుడే జగతి ఆత్మ శాంతిస్తుంది అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా...
మీరు మారిపోయినట్టేనా...అని అడిగితే..మ్యాగ్జిమం డ్రింక్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పి వెళ్లిపోతాడు..
ఆ తర్వాత అనుపమ గురించి మాట్లాడుకుంటారు రిషిధార..


Also Read: అక్టోబర్ 28 ఎపిసోడ్: అరకు లోయల్లో రిషిధార రొమాంటిక్ జర్నీ, శైలేంద్రకి బిగ్ షాక్!


శైలేంద్ర ఇంట్లో టెన్షన్ గా తిరిగుతూ ఉంటే దేవయాని వస్తుంది...ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగితే..ఎండీసీటు దక్కించుకోవడమే లక్ష్యం అంటాడు శైలేంద్ర. అది సాధ్యం కాదేమో అనిపిస్తోంది, వాళ్లు ప్రశాంతంగా అరకు వెళ్లారు వచ్చారు..మళ్లీ పనుల్లో పడతారు.. ఇక నువ్వు ఏమీ చేయలేవు, తిరిగి ఫారిన్ వెళ్లిపోతావా అని అడుగుతుంది. అలా మాట్లాడతావేంటని ఫైర్ అవుతాడు శైలేంద్ర. జగతి ప్రాణం పోయిన తర్వాత కూడా మన కల నెరవేరలేదు, ఇంత చేసినా ఫలితం మన చేతికి రావడం లేదని దేవయాని అంటే...వచ్చే వరకూ ఓపిక పట్టాలని రివర్సవుతాడు. ఒక్క ప్రాణం పోయినా మనకు దక్కిందేమీ లేదు...మిగిలిన ప్రాణాలు కూడా పోతేకానీ అని దేవయాని మాట్లాడుతుండగా అక్కడకు వస్తాడు ఫణీంద్ర..
ఫణీంద్ర: అసలేం జరుగుతోంది..మీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది..మీ అమ్మ నోటి నుంచి ఆ మాట ఎందుకొచ్చింది.. ఎవరి గురించి మాట్లాడుతున్నారు..చెప్పండి అని రెట్టిస్తాడు...
ఇద్దరూ టెన్షన్ పడుతుంటారు...ఇంతలో నేను చెబుతాను మావయ్యగారూ అని ఎంటరవుతుంది ధరణి...
ధరణి: చిన్నత్తయ్య ప్రాణాలు పోయాయి కదా..ఆమెను ఎవరు చంపారో వాళ్లని దొరకబట్టి తగిన శిక్ష వేయాలని మాట్లాడుకుంటున్నారేమో
ఫణీంద్ర: ధరణి చెప్పేది నిజమేనా..నేను రాకముందు బాగానే మాట్లాడుకుంటున్నారు కదా ఇప్పుడేం మాట్లాడడం లేదు..
దేవయాని: జగతిని తలుచుకుని బాధపడుతున్నాం
ఫణీంద్ర: నటించకు..ఏ రోజు అయినా తనతో ఆప్యాయంగా మాట్లాడావా, తను ఉన్నప్పుడు దూరం పెట్టావు..ఇప్పుడెందుకు తలుచుకుంటావ్. నువ్వు జగతని తలుచుకోకు..తలుచుకుంటే జగతి ఆత్మ కూడా శాంతించదు... ధరణి నాకో సహాయం చేయి...ఈ తల్లీ కొడుకులు ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా చేయమ్మా ..నువ్వు ఏం చేస్తావో చేయి
ధరణి: సరే మావయ్యగారు..మీకోసం నా ప్రయత్నం నేను చేస్తానంటుంది...
మిమ్మల్ని చూస్తుంటేనే చిరాగ్గా ఉందని చెప్పి వెళ్లిపోతాడు... 
ధరణిపై కోపంగా చేయెత్తగానే...మావయ్యగారూ అని అరుస్తుంది ధరణి... ఇప్పుడు కొట్టండి చూద్దాం అనేసి మీలా ఖాళీగా లేను నాకు పని ఉందని చెప్పి వెళ్లిపోతుంది...
ఆ తర్వాత ఏదో ప్లాన్ చెబుతుంది దేవయాని... నీ ప్లాన్ ప్రకారం నువ్వు చేయి..నేను చేయాల్సింది నేను చేస్తానంటాడు శైలేంద్ర...
మనం అనుపమ గురించి ఎంక్వైరీ చేస్తున్న విషయం మహేంద్రకి తెలియకూడదని హెచ్చరిస్తుంది...


Also Read: అనుపతో మహేంద్ర కొత్త జర్నీ మొదలు, ఫుల్ జోష్ లో రిషిధార!


రిషి - వసు


ఏం చేస్తున్నావ్ వసుధార అని వస్తాడు రిషి.. వీటిని బట్టలు అంటారు, దీన్ని మడతపెట్టడం అంటారని సెటైర్ వేస్తుంది. నేను కూడా మడతపెడతానని అంటే వసుధార ఒప్పుకోదు. మీరు ఇలాంటి పనులు చేయకూడదని చెబుతుంది. నువ్వు ఎండీ సీట్లో కూర్చున్నావ్..నీ పనులు నేను చేస్తే తప్పేంటి అంటాడు. నేను మిమ్మల్ని ఎవరెస్ట్ గా చూస్తాను, సింహంలా చూస్తాను మిమ్మల్ని...సింహం ఎక్కడైనా చీరలు మడతపెడుతుందా అంటే.. ఓ భార్యకి భర్తలా సాయం చేస్తానంటూ వసు చేతిలో ఉన్న చీరలు లాక్కునేందుకు ప్రయత్నిస్తారు... కాసేపు సరదాగా పరిగెడుతూ ఉంటారు...మహేంద్ర చూసి మురిసిపోతాడు.