గుప్పెడంతమనసు అక్టోబరు 27 ఎపిసోడ్
శైలేంద్ర కుట్ర నుంచి రిషిని కాపాడిన అనుపమ..తనని రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. రిషితో అనుపమను చూసి మహేంద్ర షాక్ అవుతాడు. రిషి లోపలకు రమ్మని పిలుస్తాడు కానీ పని ఉంది, ఓ ఫ్రెండ్ ని అర్జెంటుగా కలవాలి, మరోసారి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీతో కలసి డిన్నర్ కూడా చేస్తానని చెబుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అనుపమ వెళ్లిపోతుంది. రిషి లోపలకు రాగానే మహేంద్ర కంగారుగా ఎదురెళ్లి తను నీకెలా తెలుసు? తను ఎందుకొచ్చింది? అని అడుగుతాడు.  తను మీకు తెలుసా అని రిషి రివర్స్ క్వశ్చన్ చేయడంతో తనతో కలసి వచ్చావు కదా అందుకే అడిగానని కవర్ చేస్తాడు. కారు నాకు డ్యాష్ ఇవ్వబోతుండగా తను కాపాడి ఇక్కడ డ్రాప్ చేశారని చెబుతాడు. హమ్మయ్య రిషికి నిజం తెలియలేదు..వెంటనే అనుపమని కలసి మాట్లాడాలని ఫిక్సవుతాడు మహేంద్ర. రిషి లోపలకు వెళతాడు..మహేంద్ర బయటకు వెళతాడు. రిషి వస్తానన్నా వద్దని చెప్పి వెళ్లిపోతాడు మహేంద్ర..


Also Read: రిషికి మొత్తం చెప్పేసిన వసు - అనుపమ గురించి వసుధార ఎంక్వైరీ!


వసుధార రూమ్ బయట నిల్చుని ఆలోచిస్తుంటుంది...ఇంతలో రిషి రావడంతో కంగారుగా ఇంత లేట్ అయిందేంటని అడుగుతుంది. 
రిషి: నన్ను ఎవరో కారుతో అటాక్ చేశారు..కరెక్ట్ టైమ్ లో ఒకావిడ నన్ను కాపాడింది..లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది..అయినా ఏంటిది వసుధారా.. ఇక్కడ కూడా నాపై అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది
వసు: ఇదికూడా శైలేంద్ర పనే అయి ఉంటుందని మనసులో అనుకుంటుంది
రిషి; ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు..అధైర్య పడలేదు..అమ్మ దూరమైన ఇన్ని రోజులైనా నా శత్రువులు ఎవరో కూడా తెలియడం లేదు. అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నది ఎవరో అర్థం కావడం లేదు. 
వసు: మీరు కరెక్టుగా ఆలోచిస్తే కనిపెట్టగలరు.మీరు ప్రశాంతంగా ఆలోచించండి..మీ శత్రువులు ఎవరో మీకు తెలిసే అవకాశం ఉంది. మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీరు ఏదో మిస్సవుతున్నారు. శత్రువులు మనవెంటే నీడలా ఉంటారు..మన గురించి అన్నీ తెలిసిన వాళ్లే చేస్తుంటారు. అలాంటి వారు ఎవరో మీరే తెలుసుకోవాలి ( ఆధారాలు చూపించకపోతే నమ్మరు అందుకే మౌనంగా ఉంటున్నా అనుకుంటుంది మనసులో).. రిషి సార్ కి వాళ్లపై అనుమానం వచ్చేలా చేయి అనుకుంటుంది..
ఫుడ్ ఆర్డర్ చేశానని చెప్పడంతో ఇద్దరూ తినేందుకు వెళతారు...


Also Read: రిషికి మొత్తం చెప్పేసిన వసు - అనుపమ గురించి వసుధార ఎంక్వైరీ!


అటు మహేంద్ర అనుపమని కలుస్తాడు...
మళ్లీ వస్తావని అనుకోలేదని అనుపమ అంటే..రాక తప్పలేదంటాడు మహేంద్ర. జగతి గురించి అడిగితే మాట మార్చేస్తాడు మహేంద్ర. మీవారు ఏం చేస్తున్నారు? పిల్లలు ఎంతమంది ?
అనుపమ: టాపిక్ డైవర్ట్ చేయవద్దు
మహేంద్ర: జగతితో పెళ్లి తప్ప ఏదీ నా జీవితంలో అనుకున్నది జరగలేదు. ఓ కొడుకు..పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్యే..
మళ్లీ మళ్లీ జగతి గురించి అనుపమ అడుగుతూనే ఉంటుంది కానీ మహేంద్ర మాత్రం బయటపడడు.. నీ పర్సనల్ విషయాలు చెప్పు అని మహేంద్ర అంటే.. నువ్వు-జగతి కలసి ఇద్దరూ అడిగితే సమాధానం చెబుతాను అంటుంది..
మహేంద్ర: ఇప్పుడు సమాధానం చెప్పాలని అనుకోవడం లేదన్నమాట
అనుపమ: నిన్ను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి..నీతో జగతిని చూడకపోయేసరికి కోపం వస్తోంది..నువ్వు ఏదో దాస్తున్నావ్.. జగతి ఎక్కడ? చెప్తావా చెప్పవా? చెప్పు మహేంద్ర...జగతి ఎక్కడ? మహేంద్ర నిన్నే అడుగుతున్నానని చొక్కా పట్టుకుని రెట్టిస్తుంది
మహేంద్ర: అనూ...ఏంటిదింతా..
అనుపమ: Sorry... వెళ్లేందుకు బయలుదేరిన మహేంద్రని డ్రాప్ చేసేందుకు బయలుదేరుతుంది.. ఎంత గొప్ప బంధం అయినా ఏదో ఓరోజు చెరిగిపోతుందనుకున్నావ్..కానీ మన మధ్య స్నేహం అలాగే చెరిగిపోకుండా ఉంది..
మహేంద్ర: మనం కలవడం యాదృశ్చికం మాత్రం కాదు..
ఇద్దరూ రిసార్ట్ కి వెళతారు... లోపలకి పిలవ్వా అని అనుపమ అంటే పిలవలేను అంటాడు మహేంద్ర.. ఏమైందని మళ్లీ మళ్లీ అడిగినా చెప్పడు. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెబుతాను..నీకు తెలుసుకునే సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావని దాటేస్తాడు. 
మహేంద్ర-అనుపమ మాట్లాడుకుంటూ ఉండగా వసుధార చూస్తుంది...
అనుపమ - మహేంద్ర: నీకు డ్రింక్స్ అలవాటు లేదుకదా అని అనుపమ రెట్టిస్తే కొన్ని అలవాట్లు అవుతుంటాయి..నీలాంటి ఫ్రెండ్స్ కలిశాక అలాంటి అలవాట్లు పోతాయిలే అనేసి వెళ్లిపోతాడు...  ఏదో ఉందనే అనుమానం అనుపమలో పెరుగుతుంది...


Also Read: గుప్పెడంతమనసులో 'ఆర్య' లవ్ స్టోరీ, అనుపమ ఎంట్రీతో ఇంట్రెస్టింగ్ గా మారిన కథ!


లోపల రిషి భోజనం వడ్డిస్తాడు.. వసుధార వచ్చి నేను వడ్డించేదాన్ని కదా అంటుంది. ఇంతలో మహేంద్ర రావడంతో భోజనానికి పిలుస్తారు. మీరిద్దరూ కలసి భోజనం చేసి నిద్రపోండి గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్లిపోతాడు మహేంద్ర.  
రిషి-వసు: డాడ్ లో ఈ రోజు మార్పు వచ్చింది కదా..డ్రింక్ చేసి కూడా రాలేదు. ఇక్కడే తనలో మార్పు వస్తుందని తన ప్రయాణం మళ్లీ మొదలు పెడతారని నా నమ్మకం..ఈ రోజు ఆ నమ్మకం నిజమైందని రిషి అంటే..అవును సార్ అంటుంది వసుధార. డాడ్ ఫేస్ లో ఆనందం చూసిన తర్వాతే ఇంటికి వెళదాం అంటాడు రిషి. సరే అని వసు అనడంతో థ్యాంక్స్ చెబుతాడు రిషి... నాక్కూడా బాధ్యత ఉందన్న వసుధార... అనుపమ అంటే ఆవిడేనా ఆమె పరిచయం వల్లే మహేంద్ర సార్ లో మార్పు వచ్చిందా? ఇదే నిజమైతే వాళ్లిద్దరి మధ్యా ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయం మహేంద్ర సార్ ని అడగాలా వద్దా ? అని అలోచనలో పడుతుంది.