గుప్పెడంతమనసు అక్టోబరు 24 ఎపిసోడ్
మహేంద్ర కనిపించలేదని వెతుకుతూ ఉంటారు రిషిధార. మహేంద్ర అలా నడుచుకుంటూ వెళుతుంటే..జగతి పిలిచినట్టు అనిపించడంతో ఓ చోట ఆగిపోతాడు. అక్కడే కొత్త క్యారెక్టర్ అనుపమ ఎంట్రీ ఇస్తుంది. ఆ ప్లేస్ గురించి బాగా తెలిసిన వాడిలా పార్క్ లోపలికి నడుచుకుంటూ వెళతాడు మహేంద్ర. తన పర్సు కిందపడిపోయిన విషయం గమనించకుండా మత్తులో తూలుకుంటూ ఓ చోట కూర్చుంటాడు. అక్కడ చెట్టు కింద ఉన్న బండరాయిపై జగతి, మహేంద్రల పేర్లు రాసి ఉంటాయి. అక్కడ కూర్చుండి జగతి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. జగతి, మహేంద్రలతో పాటు ఆ రాయిపై అనుపమ అనే మరో పేరు ఉంటుంది. అనుపమ పేరును మహేంద్ర చదువుతుండగానే అక్కడికిఅనుమప ఎంట్రీ ఇస్తుంది. కిందపడిపోయిన మహేంద్ర పర్సును ఇవ్వడానికి వస్తుంది. అనుపమను చూడగానే మహేంద్ర షాకవుతాడు.
Also Read: వాటర్ అనుకుని ఫుల్లుగా తాగేసిన రిషిధార, మహేంద్రకి ఎదురపడిన కొత్తక్యారెక్టర్
అనుపమ-మహేంద్ర
ఇంతకాలమైనా నాపై ఉన్న కోపం తగ్గలేదా అని అనుపమను ఉద్దేశించి మనసులో అనుకుంటాడు మహేంద్ర. నీ విషయంలో మామూలుగా ఉండలేకపోతున్నానని అనుపమ కూడా మనసుతోనే అతడి ప్రశ్నకు బదులిస్తుంది. అనుపమను చూడగానే మందు బాటిల్ దాచేస్తాడు మహేంద్ర. పర్సును ఇస్తుంది అనుపమ. ఇంకా పడేసుకునే అలవాటు ఇంకా నీకు పోలేదా అని అడుగుతుంది. నా తలరాత అంటూ అనుపమకు బదులిస్తాడు అనుపమ: మహేంద్ర.ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావని అంటే మహేంద్ర మాత్రం సమాధానం చెప్పడు. ఇంతకాలమైన నీకు ఈ ప్లేస్ ఇంకా గుర్తుందా...అందుకే ఇక్కడకు వచ్చావా
మహేంద్ర: నేను రాలేదు. నా జ్ఞాపకాలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. మర్చిపోయే జ్ఞాపకాలా అవి...ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవడానికి అంటూ మహేంద్ర బదులిస్తాడు.
అనుపమ: జగతిని ఎందుకు తీసుకురాలేదు. మహేంద్ర సమాధానమివ్వడు. జగతి చనిపోయిన విషయం అనుపమకు తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని మహేంద్ర భయపడిపోతాడు. సమాధానం చెప్పకుండా సెలైంట్‌గా ఉండిపోతాడు. మహేంద్ర ఆన్సర్ ఇవ్వకపోవడంతో అనుపమ సీరియస్ అవుతుంది. జగతి ఎందుకు రాలేదని నిలదీస్తుంది.
అనుపమ: నీ భార్య కంటే ముందు జగతి నాకు ప్రాణ స్నేహితురాలు అంటూ అనుపమ కోపంగా అంటుంది. జగతి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనివాడికి ఆమెకు దూరంగా ఎందుకు ఉంటున్నావు...నీ మనసును ఎవరి కోసం రాయిగా మార్చుకున్నావు. జగతిని ఎందుకు బాధపెడుతున్నావు
మీ ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తానని, జగతి ఎక్కడ ఉందో చెప్పమని కోపగించుకుంటుంది. జగతిని ఏం చేశావో చెప్పు అంటూ గట్టిగా అడుగుతుంది. జగతిని ప్రాణంగా ప్రేమించి ఇప్పుడు ఆమెను ఎందుకు దూరం పెడుతున్నావని నిలదీస్తుంది.
మహేంద్ర: సమాధానం చెప్పకుండా సెలైంట్‌గా ఉంటాడు. నా మనసు బాగాలేదని, తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాను
నేను నిన్ను మళ్లీ కలుస్తానని...అప్పుడు జగతి గురించి తప్పకుండా చెప్పాల్సిందే అని మహేంద్ర తో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనుపమ. అప్పుడే రిషి, వసుధార అక్కడికి వస్తారు.మహేంద్రను చూసి కంగారు పడతారు. అక్కడ రాయిపై జగతి, మహేంద్రలతో పాటు అనుపమ పేర్లు రాసి ఉండటం వసుధార గమనిస్తుంది. అనుపమ ఎవరో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతుంది.
Also Read: అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం, ఫుల్ జోష్ లో రిషిధార !
మహేంద్రతో మాట్లాడిన విషయాల్ని అనుపమ గుర్తుచేసుకుంటుంది. అప్పుడే ఆమె పెద్దమ్మ ఆమెకు కాల్ చేస్తుంది. అనుపమ డల్‌గా ఉండటంతో ఏమైందని అడుగుతుంది. మహేంద్ర కనిపించిన విషయం పెద్దమ్మకు చెబుతుంది. మహేంద్ర పేరు వినగానే పెద్దమ్మ షాక్ అవుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మహేంద్ర నిన్ను కలిశాడంటే నాకే ఆశ్చర్యంగా ఉందని పెద్దమ్మ అంటుంది. అతడి పక్కన జగతి లేదా అని పెద్దమ్మ అడగ్గా...లేదని అనుపమ అంటుంది. అప్పుడు నువ్వు మహేంద్రతో సరిగ్గా మాట్లాడకపోవడం వల్లే నువ్వు ఇలా ఒంటరిగా మిగిలిపోయావని అనుపమకు చెబుతుంది. జగతి, మహేంద్ర ఇద్దరు తనకు ప్రాణ స్నేహితులు అని, వారి కోసం ఏదైనా చేస్తానని, ఇక ముందు కూడా చేస్తానని అనుపమ అంటుంది. జగతి తన ప్రాణమని, తనకు ఏం జరిగినా తట్టుకోలేనని అనుపమ అంటుంది. మరి మహేంద్ర అంటే అని అనుపమను అడుగుతుంది పెద్దమ్మ. అనుపమ సమాధానం చెప్పకుండా ఉండిపోతుంది..
ఎపిసోడ్ ముగిసింది..