Guppedantha Manasu Today Episode : శైలేంద్ర ఫోన్ చేసిన విషయం తెలిసి మహేంద్ర మండిపడతాడు. శైలేంద్ర చేసిన కుట్రలకు ఆధారాలు సంపాదించాలని వసుధారతో అంటాడు. తాను అదే పనిమీద ఉన్నానని, ఆధారాల్ని సేకరించి రిషి ముందు పెడితే అతడే ఏ శిక్ష వేయాలన్నది నిర్ణయిస్తాడని వసుధార అంటుంది. అప్పుడే అక్కడికి రిషి ఎంట్రీ ఇస్తాడు. ఎవరిని వదిలిపెట్టకూడదని అంటున్నారో చెప్పమని అడుగుతాడు. టాపిక్ డైవర్ట్ చేస్తాడు మహేంద్ర. వసుధారను కొందరు ఆకతాయిలు ఏడిపించారని, ఆమెను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లొద్దని చెబుతాడు. ఆ తర్వాత వసుధార చేతిని, రిషి చేతిలో పెట్టి ఈ చేయిని నువ్వు జీవితంలో వదిలిపెట్టవద్దని చెబుతాడు. నేను జగతి ప్రాణంగా ప్రేమించుకున్నాం...ఒకరి చేయి మరొకరం వదలమని ప్రమాణం చేసుకున్నాం...కానీ కలిసి ఉండలేకపోయామని అంటాడు. మీరు విడిపోవడానికి కారణం నేనే అని రిషి ఎమోషనల్ అవుతాడు. రిషిని ఓదార్చిన మహేంద్ర ఓ ప్లేస్ కి వెళదాం రండ్ అని తీసుకెళ్తాడు.
Also Read: అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం, ఫుల్ జోష్ లో రిషిధార !
రిషిధార ఆనందం
రిషి, వసుధారలను థింసా డ్యాన్స్ చూడటానికి తీసుకెళ్లిన మహేంద్ర..బాధను పక్కన పెట్టి డాన్స్ చేద్దామని చెబుతాడు. రిషిధార ముందుకు రాకపోవడంతో మహేంద్ర వాళ్లిద్దర్నీ తీసుకెళ్లి స్టెప్పులేస్తాడు. డ్యాన్స్‌కు బ్రేక్ ఇచ్చి వాటర్ బాటిల్‌లో మందు కలుపుకుని తాగాలని అనుకుంటాడు మహేంద్ర. కానీ అనుకోకుండా ఆ బాటిల్ లో ఉన్నవి వాటర్ అనుకుని రిషి, వసుధార తాగేస్తారు. తాగిన మత్తులో ఇద్దరు తిక్కతిక్కగా మాట్లాడుతుంటారు. మాకు ఇంకా కొంచెం కోవాలని గొడవ చేస్తారు. వారిద్దరిని అక్కడి నుంచి తీసుకెళ్లాలని మహేంద్ర చాలా ప్రయత్నిస్తాడు. కానీ రిషి, వసుధార మాత్రం అతడి వినకుండా డ్యాన్స్ చేస్తారు.వాళ్ల ఎంజాయ్‌మెంట్‌ను చూసి మహేంద్ర సంతోషపడతాడు.
వాటర్ అనుకుని మందు తాగేసిన రిషిధార
నిద్రలేచేసరికి ఒకే బెడ్‌పై తాము ఉండటం చూసి రిషి, వసుధార షాకవుతారు. రాత్రి ఏం జరిగిందో అని ఆలోచిస్తుంటారు. రాత్రి డ్యాన్స్ చేసిన విషయం గుర్తుచేసుకుంటారు. తాను డ్యాన్స్ చేయలేదని వసుధారతో వాదిస్తాడు రిషి. తాను కూడా డ్యాన్స్ చేయలేదని వసుధార అంటుంది. తాను డీసెంట్ పర్సన్‌ను అని వసుధారతో చెబుతాడు రిషి. ఇద్దరిలో ఎవరూ డ్యాన్స్ చేయలేదు, గొడవ చేయలేదని కాంప్రమైజ్ అవుతారు. బయటకు వచ్చి చూసేసరికి రిసార్ట్ లో మహేంద్ర కనిపించడు. మహేంద్ర కోసం రూమ్‌కు వెళుతుంది వసుధార. రూమ్‌లో కనిపించకపోవడంతో ఆ విషయం రిషికి చెబుతుంది. ఇద్దరు కలిసి అతడిని వెతకడానికి బయటకు వెళతారు.
Also Read: ప్రేమ జ్ఞాపకాల్లో మహేంద్ర, రిషికి ధైర్యం చెప్పిన వసు - శైలేంద్ర మరో కుట్ర
కొత్త క్యారక్టర్ ఎంట్రీ
జగతిని గుర్తుచేసుకుంటూ తాగుతూ రోడ్‌పై వెళుతుంటాడు మహేంద్ర. ఓ ప్లేస్‌కు రాగానే జగతి పిలిచినట్లుగా అనిపిస్తుంది. ఆ ప్లేస్ లోపలికి దారి ఉండటంతో లోపలికి వెళతాడు మహేంద్ర. ఓ మహిళ కెమెరా పట్టుకుని ప్రకృతి అందాలను షూట్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె ఎవరన్నది సస్పెన్స్‌గా ఉంచుతూ నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.