గుప్పెడంతమనసు అక్టోబరు 28 ఎపిసోడ్


అనుపమ దగ్గర్నుంచి వచ్చిన మహేంద్ర రూమ్ లో కూర్చుని ఆలోచనలో పడతాడు. అనుపమ నా జీవితంలోకి ఎందుకొచ్చింది? మంచికా-చెడుకా? దీన్ని ఎలా తీసుకోవాలి? అనే ఆలోచనలో పడతాడు. ఇంతలో వసుధార వచ్చి మజ్జిక ఇస్తుంది. మీరు భోజనం చేయలేదని అడుగుతుంది వసుధార
మహేంద్ర: నా ఫ్రెండ్ కలసింది..రెస్టారెంట్ కి వెళదాం అని అడిగితే వెళ్లాను
వసు: ఇన్నాళ్లూ కాంటాక్ట్ లో లేరు..అడగగానే భోజనానికి వెళ్లారా..తన పేరేంటి
మహేంద్ర: చాలా ఆత్మీయురాలు..చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు డీటేల్స్ చెబుతాను
ఇంతలో వసుధారకి కాల్ వస్తుంది..శైలేంద్ర కాల్ చేస్తాడు...ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు
వసు: ఇప్పటి వరకూ బాగానే ఉన్నాం..ఇకపై ఆలోచించాలి
శైలేంద్ర: ఆ మాత్రం భయం ఉండాలిలే
వసు: భయానికి వ్యంగ్యానికి తేడా తెలియకుండా బతుకుతున్నారు
శైలేంద్ర: ఇప్పుడు తెలుసుకుంటానులే. ఇంతకీ అరకు ఎలా ఉంది? కాటేజ్ లు ఎలా ఉన్నాయి?
వసు: మీరు ధరణి మేడంలా మెసేజ్ చేసి తెలుసుకున్నారు కదా.. 
శైలేంద్ర: ఎవరు చెప్పారు..
వసు: అంతా బాగానే చాట్ చేశారు కానీ..ఆఖర్లో మా ఆయనతో జాగ్రత్త అని మెసేజ్ చేశారు..ధరణి మేడం ఎప్పుడూ భర్త గురించి అలా మాట్లాడరు. అయినా మేం ఎక్కడున్నామో ధరణి మేడంకి తెలుసు..కానీ మీరు మెసేజ్ లో ఎక్కడున్నారని మెసేజ్ చేసి దొరికిపోయారు... ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్ కి మీ నిజస్వరూపం తెలిసిన రోజు మీ పాపం పండుతుంది..
శైలేంద్ర: నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనివ్వను..మొత్తం బూడిద చేసేస్తా..
వసు: మీరు బూడిద చేసినా, మసి చేసినా మళ్లీ ఎదగగలిగే సామర్థ్యం మాకుంది.. చెట్టుకొమ్మకి DBST బోర్డు పెట్టి మళ్లీ పాఠాలు చెబుతాం..మీకు మాత్రం ఎండీ సీటు దక్కదు..ఆ ఆశలు వదిలేసుకుని ఏదైనా ఉద్యోగం చేసుకునేందుకు ప్రయత్నించండి.. రిషి సార్ తో చెప్పి మంచి ఉద్యోగం చూపిస్తాను
శైలేంద్ర: నా ఈగోని టచ్ చేస్తున్నావ్ అంటూ కాల్ కట్ చేస్తాడు...


Also Read: అనుపతో మహేంద్ర కొత్త జర్నీ మొదలు, ఫుల్ జోష్ లో రిషిధార!


ఆ కోపంలో ఉన్న శైలేంద్రకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ధరణి...
వసుధార వాళ్లు ఎక్కడున్నారో తెలుసంట కదా..నీకు తెలిసి కూడా తెలియదని చెప్పావ్..ఆ వసుధార నేను మెసేజ్ చేస్తున్నానని తెలిసి కూడా తెలియనట్టు నటించిందంటూ ఫైర్ అవుతుంటాడు.... కాఫీ చల్లగా అయిపోతోందంటూ చేతిలో పెట్టేసి వెళ్లిపోతుంది ధరణి...


జరిగిన యాక్సిడెంట్ గురించి..అనుపమ మాటల గురించి ఆలోచిస్తాడు రిషి... ఇక్కడ నాకు శత్రువులు ఎవరుంటారు? నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైమ్? ఈ అటాక్ ఎవరు చేసి ఉంటారనే ఆలోచనతో జరిగినవన్నీ గుర్తుచేసుకుంటాడు...నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? వాడు ఎవడో కానీ ముసుగువేసుకుని నన్ను వెంటాడుతున్నాడు..వాడి గురించి చిన్న ఆధారం దొరికినా వాడిని వదిలిపెట్టను...అతి తొందర్లోనే వాడి ఆటలకు ముగింపు చెప్పాలనే ఆలోచనలో పడతాడు...


Also Read: రిషికి మొత్తం చెప్పేసిన వసు - అనుపమ గురించి వసుధార ఎంక్వైరీ!


మరోవైపు ఇంట్లో కూర్చుని..శైలేంద్ర కాలేజీ గురించి డిస్కషన్ మొదలుపెడతాడు...ఇన్నాళ్లూ అంటే సెలవులు..ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అయింది కదా వాళ్లను రమ్మని చెప్పండి డాడ్ అంటాడు. 
ఫణీంద్ర: లేదు..నేను ఫోన్ చేయను..వాళ్లు చాలా ఇంపార్టెంట్ పనిపై వెళ్లారు..వాళ్లంతట వాళ్లు వచ్చేవరకూ నేను పిలవను.. 
శైలేంద్ర: కాలేజీ పరిస్థితి ఏంటి
ఫణీంద్ర: మనం ఉన్నాం కదా..వాళ్లు వచ్చేవరకూ  కాలేజీలో అన్నింటినీ మనమే మ్యానేజ్ చేసుకుందాం..చిన్న చిన్న విషయాలకు వాళ్లని డిస్ట్రబ్ చేయవద్దు..
శైలేంద్ర: కనీసం ఎప్పుడు వస్తారో అడగండి
ఫణీంద్ర: నీకు చెబుతుంటే అర్థం కాదా..వాళ్లు వెళ్లింది సరదాకోసం కాదు...నా తమ్ముడిని బాగు చేయడం కోసం..నేను వాళ్లకు కాల్ చేయనని ఎన్నిసార్లు చెప్పినా పదేపదే అడుగుతున్నారు..ఇంకోసారి అడిగితే చాలా సీరియస్ గా ఉంటుంది
దేవయాని: మీరు ఈ మధ్య అస్సలు అర్థం కావడం లేదు..ఎప్పుడు చూసినా మీరు తమ్ముడు తమ్ముడు అంటారు కానీ మీ తమ్ముడు ఎలా ఉన్నాడని వాళ్లు మీకు కాల్ చేశారా అసలు
ఫణీంద్ర: నువ్వు ఎప్పుడూ ఇంతే..మహేంద్ర పొజిషన్ పై రిషి నాకు ప్రతిరోజూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడంటాడు..ఇంతలోనే రిషి కాల్ చేస్తాడు..  ఫోన్ పట్టుకుని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు...
రిషి మనల్ని పలకరించడం లేదంటే మనల్ని దూరం పెట్టాడా అని డౌట్ పడుతుంది దేవయాని...వసుధార వల్లే ఇదంతా జరుగుతోందంటాడు శైలేంద్ర... వాళ్లు ఎప్పటికైనా తిరిగి వస్తారు కదా అప్పుడు వాళ్ల సంగతి చూద్దాం అంటాడు... డీబీఎస్టీ కాలేజీని మన గుప్పిట్లోకి తీసుకుంటే రిషి విలవిల్లాడుతూ వస్తాడని చెబుతాడు.. 
రిషి రావాలంటే ఏదో ఒకటి చేయాలంటాడు..ఇప్పుడు ఎలాంటి పని చేసినా ఈజీగా దొరికిపోతాం అని హెచ్చరిస్తుంది దేవయాని..


Also Read: ఈ రోజు ( అక్టోబరు 28) చంద్రగ్రహణం - ఈ రాశివారు చూడకూడదు!


రిషి-వసుధార కోసం స్పెషల్ వెహికల్ అరెంజ్ చేసిన మహేంద్ర..అరకు మొత్తం చుట్టేసి రమ్మని చెబుతాడు. ఇదే మినీ హనీమూన్ అనుకుని సంతోషంగా వెళ్లిరండి అని పంపిస్తాడు. అరకు లోయల్లో రిషిధార చక్కర్లు కొడతారు. 


మరోవైపు మహేంద్ర.. రిసార్ట్ లో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంటాడు. జగతి చూస్తున్నావా మన కొడుకు కోడలి కోసం ఇదంతా రెడీ చేస్తున్నాను ఈ కార్యం నీ చేతుల మీదుగా జరగాలి కానీ నువ్వు మాత్రం మాకు అందనంతదూరం వెళ్లిపోయావని తలుచుకుని బాధపడతాడు. నువ్వు పోయిన తర్వాత నీ జ్ఞాపకాలతో మందుకి బానిసయ్యాను మళ్లీ ఇప్పుడిప్పుడే నీకోసం నీ కోరిక తీర్చడం కోసం మామూలు స్థితికి వచ్చాను...నువ్వు కోరుకున్నట్టే రిషిధారలు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను.. నాది చిన్న ఆశ..నువ్వు రిషివసుధార బిడ్డగా పుట్టాలి..ఈ కోర్కె తీర్చు జగతి చాలు అనుకుంటాడు...