అర‌కు టూర్‌ను రిషి, వ‌సుధార  ఎంజాయ్ చేస్తుంటారు. అరుకు అందాల న‌డుమ రిషికి ఐ ల‌వ్ యూ చెబుతుంది వ‌సుధార‌. రిషి కూడా వ‌సుధార‌కు ప్ర‌పోజ్ చేస్తాడు.


రిషి : వసుధార మన జీవితంలో ఈ పచ్చటి అడవిని చూసినట్లు..ఎన్నో శిశిరాలు.. ఎన్నో వసంతాలు చూశాము..మన బంధం ఎన్నో అడ్డకులను దాటుకుని వచ్చింది. చివరికి ఇదిగో ఇలా సంతోషంగా ఉన్నాము. చాలు వసుధార ఈ జీవితానికి ఇది చాలు. మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి.


వసుధార: అవును సార్‌ మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఈ పచ్చని అడవి.. కిలకిల రాగాలు చేస్తున్న పక్షులే మన ప్రేమకు సాక్ష్యాలు. నింగి నేల మధ్యలో ఉండి చెప్తున్నాను సార్‌ ఈ ప్రకృతికి పంచభూతాలకు నిలయమే మన బంధం సార్‌. వాటి మన బంధం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోవాలి. ఐ లవ్‌ యూ సార్‌. ఈ చల్లటి వాతావారణంలో మీతో కలిసి కాఫీ తాగాలని ఉంది.


రిషి : చిటికెలో తెస్తా..


వసుధార : ఒక్కటే తెచ్చారు.


రిషి: షేర్‌ చేసుకుందాం..


ఇద్దరూ కాఫీ తాగుతూ వారి జీవితంలో జరిగిన విషయాలను షేర్‌ చేసుకుంటూ కాఫీ తాగుతూ ప్రకృతి ఒడిలో పరవశించిపోతారు. వారి సంతోషానికి కారణమైన జగతిని గుర్తుచేసుకుంటాడు రిషి. ఇంతలో రిషిని, వసుధారను చంపడానికి శైలేంద్ర నియమించిన రౌడీ వారిని ఫాలో అవుతుంటాడు. రౌడీ శైలేంద్రకు ఫోన్‌ చేస్తాడు.


శైలేంద్ర : ఒరేయ్‌ వాళ్లకు స్పాట్‌ పెట్టావా? చంపావా?


రౌడీ: ఎస్‌ సార్‌ వాళ్లను ఫాలో అవుతున్నాను. చంపేస్తాను కావాలంటే చూడండి


అని రిషి, వసుధారను వీడియో కాల్‌ లో చూపిస్తాడు రౌడీ.


రౌడీ: ఇక్కడ జరిగేదంతా లైవ్‌ చూస్తూ ఉండండి


అంటూ కత్తి తీసుకుని వాళ్లను చంపడానికి వెళ్తాడు రౌడీ. రిషి వెనక్కి మళ్లీ చూసే సరికి రౌడీ చెట్లలోకి వెళ్తాడు. అప్పడు వీడియోలో వెనకాల అనుపమ కనిపించడంతో దేవయాని భయపడి వాడిని వెనక్కి రమ్మని చెప్పమంటుంది. అయినా రౌడీ అలాగే ముందుకు వెళ్తాడు.


దేవయాని: అరె వాడికి వద్దని చెప్పరా..


శైలేంద్ర: అరెయ్‌ వద్దురా వెనక్కి వచ్చేయ్‌..


ఎంత చెప్పినా రౌడీ వినకుండా కత్తితో రిషి, వసుధారపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే వెనక నుంచి అనుపమ కర్రతో రౌడీ మీదకు విసురుతుంది. దీంతో  రౌడీ చేతిలో కత్తి కింద పడిపోతుంది. వెంటనే రౌడీ అక్కడి నుంచి పరుగెత్తుతాడు.  అది గమనించిన రిషి,  రౌడీ వెంట పడతాడు. ఇంతలో వసుధార కింద పడిపోతుంది. రౌడీ తప్పించుకుని పారిపోతాడు.


దేవయాని : అనుకున్న నేను అనుకున్న ఆ అనుపమ వాళ్లను కాపాడుతుందని..


శైలేంద్ర : అనుపమనా.. ఎవరు మమ్మీ ఆమె..


దేవయాని : అనుపమ్మ నాకే చుక్కలు చూపించింది.  మీ బాబాయ్‌కి జగతికి పెళ్లి చేసింది తనే.. తను వాళ్లిద్దరికి క్లోజ్‌ ప్రెండ్‌  ముగ్గురు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. మాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసింది. చూడ్డానికి చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ చాలా డేంజర్‌.


రిసార్ట్ నుంచి రిషి, వ‌సుధార బ‌య‌ట‌కు వెళ్లి చాలా స‌మ‌య‌మైనా తిరిగి రాక‌పోవ‌డంతో మ‌హేంద్ర వారి కోసం ఎదురుచూస్తుంటాడు. రిషి, వ‌సుధార దెబ్బ‌లతో రావ‌డం చూసి మ‌హేంద్ర కంగారు ప‌డ‌తాడు. వారితో పాటు అనుప‌మ కూడా వస్తుంది. త‌మ‌పై ఎటాక్ జ‌రిగితే అనుప‌మ‌నే కాపాడింద‌ని మ‌హేంద్రతో చెప్తాడు రిషి. అనుప‌మ‌కు థాంక్స్ చెబుతాడు మ‌హేంద్ర‌. ఇంత‌కు మీ పేరు చెప్ప‌లేదని వ‌సుధార అడుగుతుంది. అనుప‌మ త‌న పేరు చెప్ప‌గానే రిషి, వ‌సుధార ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ ముగుస్తుంది.