నీ కోడలు గుడికి వెళ్లమని చెప్పినా వెళ్లలేదని అంటుంద రుద్రాణి అంటుంది. నాకు అబద్దాలు చెప్పడం రాదని మీరు నాకు చెప్పలేదని కావ్య అంటుంది. వదిన నీ కోడలుకు పెద్దంతరం చిన్నంతరం లేదని వాదిస్తుంది. దీంతో రాజ్ కలిపించుకుని అత్త ఆగు అంటాడు. ఇంతలో రుద్రాణి ఏంటి రాజ్ నీ పెళ్లాన్ని అనగానే నీకు కోపం వచ్చిందా? అంటుంది.
రాజ్: కాదు నిజం మాట్లాడాలనిపించింది. మీరు కళావతికి చెప్పారో లేదో నాకు తెలియదు.. కానీ తనకి మాత్రం అబద్దం చెప్పే అలవాటు లేదు.
రుద్రాణి: అంటే నాకు అలవాటు ఉందంటున్నావా? నువ్వు నేను చెప్పినప్పుడు లేవు అలాంటప్పుడు అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావురా..?
రాజ్: కళావతి గురించి నాకు తెలుసు.. తాను ఎప్పుడూ తప్పు చేయదు.. అందుకే ఎవ్వరికీ భయపడదు.. అలాంటప్పుడు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు కదా..? మళ్లీ నేను సపోర్ట్ చేస్తున్నాని అనకండి.. జస్ట్ తనేంటో చెప్తున్నాను అంతే..
అంటూ రాజ్ పైకి వెళ్లిపోతాడు. రుద్రాణి అపర్ణకి నీ కొడుకుతో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. స్వప్న బెడ్ రూంలో చిరాకుగా చీరను కింద పడేస్తుంది. రుద్రాణి స్వప్న రూంలోకి వచ్చి నీకు రెడీ కావడం రాకపోతే నా రూంలో నిన్ను రెడీ చేయడానికి కొందరు రెడీ ఉన్నారు అక్కడికి వెళ్లు నిన్ను రెడీ చేస్తారని చెప్తుంది.
స్వప్న: మీరిలా మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంది. నేను వెళ్లి రెడీ అవుతాను..
రుద్రాణి: త్వరగా వెళ్లు రెడీ అవ్వు అంటుంది.
స్వప్న వెళ్లాక రూంలో ప్రెగ్నెసీ రిపోర్ట్ తీసుకుని ఫొటోలు తీసుకుంటుంది రుద్రాణి.. స్వప్న తిరిగి రూంలోకి వస్తుంది. ఏంటి అత్తయ్యా ఇంకా ఇక్కడే ఉన్నారు అని అడుతుంది. ఏం లేదు అని వెళ్లిపోతుంది రుద్రాణి.
సీమంతం ఏర్పాట్లు జరుగుతుంటే చుట్టాలు వస్తుంటారు. చుట్టాల్లో ఒకరు అప్పుని చూసి అబ్బాయి అనుకుని ఆట పట్టిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ.. అప్పును కూడా అమ్మాయిలా తయారవ్వమని చెప్తారు. దీంతో అప్పు చీర కట్టుకట్టుకోవడానికి వెళ్తుంది.
రుద్రాణి: శ్రీదేవి మా స్వప్న రిపోర్ట్స్ నీకు పెట్టాను చూడు..వాటిని చూసి నిజంగా కడుపు ఉందో లేదో చూసి చెప్పు..
డాక్టర్: సరే కొంచెం టైం ఇవ్వు..
రుద్రాణి: నా దగ్గర లేనిదే అది త్వరగా కనుక్కుని చెప్పు..
డాక్టర్: చూడు నీవు ఇలా తొందర పెడితే నాకు రాంగ్ రిజల్ట్ చెబితే మొత్తానికే నువ్వు ఇరుక్కుంటావు అలా చేయమంటావా?
రుద్రాణి : అంత కోపం ఎందుకులే కానీ కాస్త త్వరగా చూసి పెట్టు..
పంక్షన్‌లో అందరు బిజిగా ఉంటే రాహుల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ ఉంటాడు అది చూసిన..
రాజ్ : ఏరా సగం తండ్రి.. అందరూ బిజిగా ఉంటే నువ్వు గేమ్ ఆడుతూ కూర్చున్నావేంట్రా రాస్కెల్ ఈ ఘనకార్యం నీదేరా.. ఈ శుభకార్యం కూడా నీదే..
అంటుండగా అప్పు చీర కట్టుకుని వస్తుంది. కుటుంబ సభ్యులందరూ అప్పు చీరకట్టులో బాగాలేదని ఆటపట్టిస్తుంటారు.
రుద్రాణి: చీర కట్టడం ఒక ఆర్ట్. రేపు తన పెళ్లిలో కూడా ఈ అమ్మాయి ప్యాంట్ షర్ట్ వేసుకుంటుందేమో..
కావ్య: కవిగారు ఇక ఏడిపించింది చాలు.. నన్ను మా అక్కను ఏ మగపిల్లలు ఏడిపించకుండా ఉండటానికే మా అప్పు బ్రదర్ లా పెరిగింది. అందుకే ప్యాంట్ షర్టులు అలవాటయ్యాయి. చక్కగా జడ వేసి చీర కడితే చాలా బాగా కనిపిస్తుంది.
బామ్మ: కావ్య, రాజ్ మీరింకా ఇలాగే ఉంటారా? కార్యక్రమం అయిపోయాక రెడీ అవుతారా? వెళ్లి కొత్త బట్టలు వేసుకుని రండి
కావ్య రాజ్ పైకి వెళ్తారు. కనకం స్వప్న రూంలోకి వచ్చి.. రెడి అవుతున్న స్వప్పను చూసి...
కనకం.. ఏంటో నువ్వింకా రెడీ కాలేదా.. ఇలా అయితే ఎలా.. త్వరగా రెడీ కావాలి
స్వప్న: అమ్మ వాటిని ఎలా పడితే అలా వేయోద్దు. అవేమైనా మన ఇంట్లో లాగా గిల్టీ నగలు..
కనకం: సరేలే కానీ పెట్టుకో..
రాహుల్: చూశావా మమ్మీ మన నగలు వేసుకుని తన నగలు అని బిల్డప్ కొడుతుంది.
రుద్రాణి: ఇంటి కోడలు అయినప్పుడు ఆ మాత్రం ఉంటుంది.
అని రుద్రాణి డాక్టర్ కు కాల్ చేసిన విషయం రాహుల్‌కు చెప్తుంది. స్వప్నకు కడుపు లేదని డాక్టర్ శ్రీదేవి చెప్పిందనడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ముగుస్తుంది.