Guppedantha Manasu November 17th Episode (గుప్పెడంతమనసు నవంబరు 17 ఎపిసోడ్)


జగతికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలి..ఇప్పుడే అక్కడకు బయలుదేరుతాను అనుకుంటూ కిందకు దిగుతుంది అనుపమ. బ్యాగ్ తీసుకుని బయలుదేరిన అనుపమని చూసి విశ్వం, ఏంజెల్ షాక్ అవుతారు.. ఎక్కడకు బయలుదేరావ్ అని అడుగుతారు.. తేల్చుకోవాల్సిన లెక్కలున్నాయి అందుకే వెళుతున్నా అంటుంది. నువ్వు ఇన్నాళ్లూ దూరంగా ఉన్నావ్ ఇప్పుడు వచ్చావ్ మళ్లీ వెళతానంటున్నావని బాధపడతాడు విశ్వం. ఇకపై మిమ్మల్ని బాధపెట్టను డాడ్ అని మాటిస్తుంది అనుపమ. ఎక్కడ ఉంటావని అడిగితే...ఎందుకు వెళుతున్నానో తెలుసు కానీ ఎక్కడ ఉండలో తెలియదు అంటుంది. నీతోపాటూ ఏంజెల్ ని తీసుకెళ్లు అని విశ్వం చెప్పినా, ఏంజెల్ కూడా వస్తానని చెప్పినా...అనుపమ నో చెప్పేస్తుంది. నీమేనత్తగా , ఓ ఫ్రెండ్ గా ఓ మంచిమాట చెబుతాను వింటావా...నీ జీవితం నా జీవితంలా మాత్రం చేసుకోవద్దు అని ఏంజెల్ కి చెప్పేసి ...కాల్ చేస్తూ ఉంటానని చెప్పి వెళ్లిపోతుంది...


Also Read:  రంగంలోకి దిగిన జర్నలిస్ట్ అనుపమ - దేవయాని,శైలేంద్రకి దబిడి దిబిడే!


ధరణి ఇంట్లో పని చేసుకుంటుంటే... కాఫీ తీసుకెళ్లి ఇచ్చి శైలేంద్ర షాక్ ఇస్తాడు. నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు..కష్టపడకు అని యాక్షన్ స్టార్ చేస్తాడు... 
శైలేంద్ర: నేను కాఫీ చేసి తీసుకొచ్చాను తీసుకో అంటాడు. ఇకపై నిన్ను కష్టపెట్టకూడదని డిసైడ్ అయ్యాను, నిన్ను ప్రేమగా చూసుకోవాలి అనుకుంటున్నాను..నువ్వు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను...
ధరణి: సడెన్ గా ఇలా మాట్లాడారంటే ఇందులో ఏదో కుట్ర ఉంది అనుకుంటుంది..
శైలేంద్ర: నిన్న డాడ్ అన్న మాటలు నన్ను కలిచివేశాయ్..రాత్రి నిద్రకూడా పోలేదు..ఇన్నాళ్లూ నిన్ను ఎంత బాధపెట్టానో అర్థమైంది.. అందుకే మారాలి అనుకున్నాను...ఇకపై నిన్ను ఒక్క మాట కూడా అనను, ఇంకెవర్నీ అననివ్వను..
ధరణి: మీరు మాట్లాడుతున్నది నిజమేనా...
శైలేంద్ర: నేను మారిపోయాను..
ఇదంతా విన్న ఫణీంద్ర...కొడుకు నిజంగా మారాడు అనుకుని మెచ్చుకుంటాడు...మరో నాలుగు సలహాలిస్తాడు...
దేవయాని మాత్రం నిజంగా మారిపోయాడా ఏంటి అనుకుంటుంది.
బయటకు వచ్చిన ఫణీంద్ర...దేవయానిని చూసి..ఏంటి అలా ఉన్నావ్ అని అడుగుతాడు
దేవయాని: నిన్న మీరన్నమాటలు ఇంకా గుచ్చుతూనే ఉన్నాయి..కోపంలో ఏమైనా అన్నా కానీ మళ్లీ నేనే కదా మహేంద్రని రమ్మన్నానని అంటుంది..
శైలేంద్ర మారాడు..ఇక నువ్వుకూడా మారడం మంచిది...


Also Read: కిచెన్లో స్వతంత్రం కావాలంటున్న రిషి సర్, జగతి కేసు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన అనుపమ!


జగతిని నువ్వే చంపావు కదా..తనని ఎవరు చంపారో తెలుసుకునే అవసరం లేదా..అంటూ అనుపమ మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుని మహేంద్ర బాధపడతాడు..జగతి ఫొటో పట్టుకుని తనలో ఆవేదన చెప్పుకుంటాడు...వెంటనే మందు బాటిల్ తీస్తాడు..ఇంతలో రిషి వచ్చి  ఏంటి డాడ్ ఇది తాగను అని చెప్పారు కదా అని అడుగుతాడు..
మహేంద్ర: ఈ క్షణం తాగాలి అనిపిస్తోంది
వసు: ఇలా మనసు మార్చుకుంటే ఎలా
మహేంద్ర: జగతి జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టేసిన టైమ్ లో కొన్ని ప్రశ్నలు నన్ను గుచ్చేస్తున్నాయి
రిషి: మీరు చెప్పేది అనుపమ గురించే కదా..ఆవిడ గురించి ఎక్కువ  ఆలోచించవద్దు..మీ స్నేహం ఇలాగే ఉంటుంది
మహేంద్ర: అనుపమ గురించే కాదు..మీ అమ్మ గుర్తొస్తుంది.. 
రిషి: మీకు పోయిన అమ్మే తప్ప..నేను గుర్తుకురావడం లేదా...నేను మీకోసం ఏదైనా చేసి రిషిని..అమ్మ లేకుండా 20 ఏళ్లు బతికారు మీ ఆనందం కోసం అమ్మను ఇంటికి పిలిచాను..కనీసం ఆ కృతజ్ఞతకోసం నాగురించి ఆలోచించారా
మహేంద్ర: రుణం తీసుకోమంటున్నావా..నేను అందుకు అర్హుడిని కాదు
రిషి: అమ్మను తలుచుకుని తాగి తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటారా...
నేను తాగాల్సిందే అని బాటిల్ తీసుకుంటాడు... 


Also Read: ఈ శుక్రవారం ఈ రాశులవారికి ఆదాయం,అదృష్టం - నవంబరు 17 రాశిఫలాలు


రిషి: తాగండి డాడ్..కానీ మీరు తాగుతున్నది రిషి ఆయుష్షు అని గుర్తుపెట్టుకోండి అంటాడు...మా కలల్ని మా ఆశయాలని కూడా మీరు దూరం చేస్తున్నారని గుర్తుచేసుకోండి..మీరు బాధని మర్చిపోవాలి అనుకుంటున్నా కానీ అందులోనే మేం బాధపడాలని కోరుకుంటున్నట్టు ఉంది..మీరు తాగడం వల్ల మా ఆనందం దూరమైపోతుంది, మా జీవితం మాకు కాకుండా పోతుంది..మేం సంతోషంగా బతకాలని మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఇలా తాగుతుంటే మేం అది పొందేలం..బాధ మీ ఒక్కరికేనా...నాకు లేదా... తల్లిలేదనే ఆవేదన పసితనంలో దాటాను కానీ ఎలాంటి అలవాట్లు నేర్చుకోలేదు..బాధను ఒంటరిగా అనుభవించడం నేర్చుకున్నవాడే లైఫ్ లో పైకొస్తాడు...మీరు నాకు నేర్పిన పాఠం ఇప్పుడు మీకు చెప్పాల్సి వస్తోంది... అమ్మ వచ్చింది అమ్మ విలువ తెలిసి..అంతా బావుంది అనుకున్న టైమ్ లో అమ్మ దూరమైపోయింది..మీకు దూరమైంది భార్య..నాకు దూరమైంది అమ్మ...మరి నేనెలా భరిస్తున్నాను డాడ్... అమ్మ కోరిక తీర్చడం కోసం ఆమె మన మధ్యలో ఉంటుందనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాను..అయినా కూడా అమ్మ దూరమైపోయింది..అలా అని నేను బాధపడాలా, నేను కూడా తాగాలా చెప్పండి... తాగుడే బాధకు ఓదార్పు అయితే మనిషికి కన్నీళ్లు ఎందుకు..ఈ మందునీళ్లు చాలు.. కావాలంటే మనసు దిగులు తీరేలా ఏడవండి...కానీ ఇలా తాగుతానంటే మాత్రం నేను సహించను డాడ్.. ఇంకెప్పుడూ తాగను అని నాపై ఒట్టు వేయండి అంటాడు రిషి.. సరే అని మాటిస్తాడు మహేంద్ర... మీరు మునుపటిలా మారాలి అని అడుగుతాడు..సరే అంటాడు మహేంద్ర
ఎపిసోడ్ ముగిసింది