Guppedantha Manasu November 15th Episode (గుప్పెడంతమనసు నవంబరు 15 ఎపిసోడ్)
జగతి చనిపోలేదని చెప్పు మహేంద్ర అని అనుపమ గట్టిగా నిలదీస్తుంది..జగతి చనిపోయింది తనునాకు దూరమైపోయిందని బాధగా చెబుతాడు మహేంద్ర. విశ్వనాథం, ఏంజెల్ షాక్ అవుతారు
అనుపమ:జగతి చనిపోయిన విషయం నాకెందుకు చెప్పలేదు..ఎందుకు దాచావ్..మనం ప్రాణస్నేహితులం కదా..జగతికి ఏదైనా జరిగితే తట్టుకోలేనని తెలుసుకదా మరెందుకు చెప్పలేదు..నువ్వే చంపావా? నువ్వే చంపేశావా? నువ్వు తనని దగ్గరకు తీయలేదనే బాధతోనే తను చనిపోయిందా? చెప్పు అని కాలర్ పట్టుకుంటుంది..తనకి నీ ప్రేమను దక్కనివ్వకుండా నువ్వే చంపేశావా? నా జగతిని చంపేశావ్ మహేంద్ర.. అంతలా ప్రేమించి ఎలా వదిలేయగలిగావ్? ఎలా దూరంగా ఉంచేశావ్? తను ప్రాణం పోవడానికి ఎందుకు నువ్వు కారణం అయ్యావ్?
రిషి: మా అమ్మ చనిపోవడానికి కారణం డాడ్ కాదు మేడం..( జగతికి బుల్లెట్ తగిలిన సీన్ బ్యాగ్రౌండ్ లో వస్తుంది)...మీరు అనుకున్నట్టు జరిగినదాంట్లో డాడ్ తప్పేం లేదు..ఆయన అమ్మని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు, అపురూపంగా చూసుకున్నారు..కానీ మా తలరాత అడ్డం తిరిగింది..కాలం పగబట్టి అమ్మని తీసుకెళ్లిపోయింది...నన్ను కాపాడుకునే ప్రయత్నంలో ఆవిడ ప్రాణాలు విడిచారు..
అంతా విని అనుపమ, ఏంజెల్, విశ్వనాథం షాక్ అవుతారు...( మా అమ్మ కోరిక తీర్చడం కోసం మా మధ్య దూరం పక్కనపెట్టి మేం ఇద్దరం ఒక్కటయ్యాం అని రిషి చెప్పిన విషయం ఏంజెల్ గుర్తుచేసుకుంటుంది).. మా దురదృష్టం దేవతలాంటి అమ్మను దూరం చేసుకున్నాం...
అనుపమ కన్నీళ్లతో అలాగే నిలబడిపోతుంది... డాడ్ రండి వెళదాం అని మహేంద్రని తీసుకుని వెళ్లిపోతారు రిషి-వసుధార...
అనుపమ అక్కడే కుప్పకూలిపోతుంది...
ఏంజెల్: ఏంటి విశ్వం..ఏం జరుగుతోంది..
Also Read: జగతి చనిపోయిందని అనుపమకి తెలిసిపోయింది, రిషిధారకి క్లారిటీ వచ్చేసినట్టేనా!
రిషి-వసుధార-మహేంద్ర కారులో వెళుతూ అనుపమ మాటలు గుర్తుచేసుకుంటారు.. రిషి ఓసారి కారు ఆపు అని అడిగి మహేంద్ర కిందకు దిగి ఏమోషనల్ అవుతాడు..జగతిని తలుచుకుని బాధపడతాడు. నీ గురించి నిజం తెలిస్తే తను తట్టుకోలేదని ఈ విషయం దాచాను కానీ ఈ రోజు తెలిసిపోయింది..నేను నీ చావుకి కారణం అయ్యానని నన్ను నిలదీసింది...ఏం మాట్లాడాలో తెలియడం లేదని ఆకాశం వైపు చూపి మాట్లాడుకుంటాడు... ఇంతకీ ఎవరీ అనుపమ అని రిషి, వసుధార అడుగుతారు
మహేంద్ర: మీ అమ్మను ఎంతలా ప్రేమించానో మీ అమ్మ అంటే తనకు అంత ఇష్టం..మీ అమ్మ కోసం తనకు నచ్చిన సబ్జెక్ట్ వదిలేసి తనున్న గ్రూపులో చేరింది... కాలేజీలో ఎవరో ఏడిపించారని కాలేజీ మొత్తం పరిగెత్తించి కొట్టించింది... మా ప్రేమకు సపోర్ట్ చేసింది..మనింట్లో అందర్నీ ఎదిరించి పెళ్లిచేసింది..ఆ తర్వాత ఎక్కడికో వెళ్లిపోయింది.నేను - జగతి ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది..జగతికి చిన్న ఫీవర్ వస్తేనే తట్టుకునేది కాదు అలాంటిది జగతి లేదని తెలిసిపోయింది..ఇప్పుడెలా ఉంటుందో..మా స్నేహం ముక్కలైపోయినట్టేనా
రిషిధార: మీ స్నేహం ముక్కలవకుండా చూసే బాధ్యత మాది..మీరు ఎప్పటిలా మంచి స్నేహితులుగా ఉంటారని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తారు...
Also Read: మహేంద్రను అనుపమ దగ్గరకు తీసుకెళ్తున్న రిషిధార!
అటు అనుపమ రూమ్ లో కూర్చుని జగతి చనిపోయిందన్న మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంది... నువ్వు లేవన్న నిజాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను ఒంటరిగా మిగిలిపోయాను.నువ్వు మాత్రం అందర్నీ వదిలేసి వెళ్లిపోయావు.. ఈ బాధని నేను భరించలేకపోతున్నాను..ఇంతలో అక్కడకు విశ్వం, ఏంజెల్ వస్తారు....నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తారు కానీ అనుపమ ఆ బాధ నుంచి బయటకు రాదు...
విశ్వం: జగతి గురించి రిషివాళ్లు నీతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను..జగతి చాలా మంచి మనిషి..తను లేదన్న నిజాన్ని అంగీకరించలేకపోతున్నాను
అనుపమ: అసలు నేను ఈ ఫంక్షన్ చేసిందే జగతి కోసం..ఇప్పుడు నేను తట్టుకోలేని నిజం తెలిసింది.. ఆ మాట వినగానే గుండె ఆగినంత పనైపోయింది.ఈ విషయం మహేంద్ర నాదగ్గర ఎందుకు దాచిపెట్టాడు..
విశ్వం: నువ్వు బాధపడతావని చెప్పలేదేమో..
అనుపమ; జగతి అంటే నాకుప్రాణం అని తనకి తెలుసు..అసలు ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు మాట దాటేస్తూ వచ్చాడు.. జగతి తనకోసమే చనిపోయిందని రిషి చెప్పాడు కదా...అంటే జగతిని ఎవరు చంపేసారు...అసలు జగతిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది..ఇది జరిగి చాలా రోజులైందంటున్నారు..ఇంతవరకూ ఆ హంతకుడు ఎవరో కనిపెట్టలేదు..శిక్ష వేయకుండా ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు...అంటే జగతి గురించి తేలిగ్గా తీసుకున్నారా
ఏంజెల్: రిషి అంత తేలిగ్గా తీసుకోడు...
అనుపమ: రిషి గురించి నీకు అంత బాగా తెలుసా
ఏంజెల్: జగతి మేడం మనింటికి కూడా వచ్చారు..ఆమెతో మాట్లాడుతుంటే సొంత మనిషిలా అనిపించేది..
విశ్వం: జగతి నాతో మాట్లాడుతుంటే నువ్వు నాతో మాట్లాడుతున్నట్టే అనిపించేది... మీ ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా..ఈ మహేంద్ర వల్లనే ఆ రోజుల్లో నువ్వు.......
అనుపమ: ప్లీజ్ డాడ్... పాత జ్ఞాపకాలు మళ్లీ తవ్వొద్దు...గతాన్ని మర్చిపోండి...
విశ్వనాథం ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా అనుపమ చెప్పనివ్వదు...
ఏంజెల్: ఏంటి విశ్వం..అసలేం జరిగింది చెప్పు విశ్వం...
విశ్వం: మీ మేనత్త జీవితం, నీ జీవితం ఒకేలా ఉన్నాయమ్మా...అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు...
ఏంజెల్: జగతి మేడం చనిపోయిందంటే నాకు చాలా బాధగా ఉంది..మీరు అధైర్య పడకండి..జగతి మేడంపై బెంగపడొద్దు
అనుపమ: జగతి విషయంలో నేను అలా ఉండలేను..జగతి నా జీవితంలో జ్ఞాపకం కాదు..జగతే నా జీవితం..అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు.. చెప్పే పరిస్థితుల్లో లేను.అందుకే నేను జగతి విషయం తేలిగ్గా తీసుకోను...నా జగతిని ఎవరు చంపేశారో అన్నీ తెలుసుకుంటాను.. వాళ్లను పట్టుకుని శిక్ష వేసేవరకూ నేను నిద్రపోను..
Also Read: బుంగమూతి , బుజ్జగింపులు -రిషిధార ఏసాలు మామూలుగా లేవు
వసుధార నిద్రపోతుంటుంది..పక్కనే రిషి కనిపించకపోవడంతో కంగారుగా లేచి వెతుకుతుంది..తీరా వెళ్లి చూస్తే కిచెన్లో వంట చేస్తుంటాడు... షాక్ అవుతుంది వసుధార.మీరేంటి ఇక్కడ అని అడిగితే..ఏం చేయకూడదా అని రివర్స్ క్వశ్చన్ చేస్తాడు... అప్పుడప్పుడు వంట పనులు చేస్తేనే కదా మీ కష్టం తెలిసేది అని రిషి...మీ కష్టం చూడలేకపోతున్నా అని వసు అంటుంది. వంట గురించి ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు... ఈ రోజు వంటబ్బాయ్ రిషీంద్ర భూషణ్... ఎక్కడ ఏం వస్తువులు ఉన్నాయో కూడా తెలియదు అని వసు అనగానే... ఎక్కడ ఏం ఉన్నాయో చూపిస్తూ పైనుంచి బియ్యం లాగేస్తాడు...ఇద్దరిపై తలంబ్రాలు పడతాయి....