Guppedantha Manasu November 11th Episode (గుప్పెడంతమనసు నవంబరు 11 ఎపిసోడ్)
చెవికమ్మలు గిఫ్ట్ గా ఇస్తాడు రిషి..అవి కిందపడిపోవడంతో రిషికి కనిపిస్తాయి కానీ తీసి దాచేస్తాడు. కాసేపు ఆటపట్టిస్తాడు..ఎంతో ప్రేమగా తీసుకొచ్చాను ఎందుకిలా అయిందని రిషి అంటే..కచ్చితంగా దొరుకుతుంది అంటుంది వసుధార. ఎప్పటికీ దొరక్కపోవడంతో పోనీలెండి వాటిని పెట్టుకునే అదృష్టం నాకు లేదనుకుంటా అందుకే దొరకడం లేదు అని అనగానే..రిషి ఆ రింగుని చూపించడంతో సంతోషపడుతుంది. అంటే మీ దగ్గర దాచుకుని నన్ను ఆటపట్టించారు మీరు దొంగ సార్ అంటుంది. నన్ను ఏడిపించారు కదా అనడంతో ఇది ఏడిపించడం కాదు నా చిలిపి జ్ఞాపకం అని అంటాడు రిషి. ఇప్పటివరకూ మనకున్న దూరం తగ్గిపోయింది..ఇప్పుడు మళ్లీ మనం రిషిధారలం అయ్యాం అని రిపై ఇస్తాడు. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటూ రిషి తాను తెచ్చిన రింగులు వసు చెవికి పెడతాడు. ఇద్దరూ కాసేపు సంతోషంగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఇద్దరూ సెల్ఫీ దిగుతారు...
Also Read: సీరియస్ సింహం కాదు రొమాంటిక్ రిషి - మహేంద్ర మాటలు బాగానే పనిచేశాయ్!
అనుపమ-విశ్వనాథం
అనుపమ విశ్వనాథం దగ్గరికి వెళ్తుంది. నీకు ఇక్కడ అంతా ఓకేనా అమ్మ అనడంతో బాగానే ఉంది డాడ్ అని అంటుంది అనుపమ. డాడీ నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నేను ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను అనడంతో ఏం ఫంక్షన్ అని అడుగుతాడు విశ్వనాథం. మా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరిని ఒకసారి కలుస్తాను అనడంతో సరే అని ఓకే చెబుతాడు విశ్వనాథం. ఫ్రెండ్స్ ని కలవడం చాలా మంచిది వాళ్ళని కలవడం వల్ల పాత జ్ఞాపకాలు వచ్చి మనస్సు ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది అని అంటాడు. కొంతమంది నెంబర్స్ ఉన్నాయి మరి కొంతమంది నంబర్స్ లేవు..అందర్నీ అప్రోచ్ అవుతానంటుంది. నా హెల్ప్ కావాలంటే నేను చేస్తానంటాడు విశ్వనాథం..
Also Read: జగతి లెటర్ రిషిని చేరుతుందా , సీక్రెట్స్ మెంటైన్ చేస్తున్న అనుపమ-ఏంజెల్
రిషిధార
రిషి వసుధార ఒడిలో తల పెట్టుకుని పడుకుని కబుర్లు చెబుతూ ఉంటాడు. నేను ఒకటి అడుగుతాను చెప్పు వసుధార నేను ఏంజెల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలుసు కదా అనడంతో అవును సార్ అని అంటుంది. మా ఇద్దరి మీద ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అని అడగడంతో ముందు పైకి లేవండి సార్ అని అలిగి పక్కకు వెళ్లి నిలబడుతుంది వసుధార. ఏమైంది అలా వెళ్ళిపోయావు అనడంతో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ మాట వేరే వాళ్ళు కనుక అడిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని బుంగమూతి పెడుతుంది వసుధార. మీ మీద నాకు ప్రేమ తప్ప మరో ఆలోచన లేదు మిమ్మల్ని అనుమానిస్తే ఈ వసుధార అసలు వసుధారే కాదనడంతో రిషి సంతోషిస్తాడు. అయినా వసు బుంగమూతి పెట్టడంతో బెడ్ పైకి ఎక్కి..వసుధారా సారీ అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడు మావయ్య వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయనంటుంది వసుధార...అయితే టెర్రస్ పైకి ఎక్కి గట్టిగా అరిచి చెబుతానంటాడు. వద్దులెండి మీ సారీ యాక్సెప్ట్ చేస్తాననడంతో రిషి చాలా హ్యాపీగా ఫీలవుతాడు.
Also Read: నిలదీసిన ఏంజెల్ - నిజం చెప్పిన రిషి, దేవయానికి ఇచ్చిపడేసిన ఫణీంద్ర!
ఫణీంద్ర-రిషి
మరొకవైపు ఫణింద్ర పేపర్ చదువుతుండగా ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు. నేను లేనప్పుడు వచ్చి డాడ్ ని కలిసి వెళ్లారంట అంటాడు రిషి. నా మనసంతా ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది. నేను మీ డాడీ మీ ఇంటికి రమ్మని పిలిచాను. ఎన్ని సార్లు అడిగినా రాను అన్నాడు. అందుకే నేను బలవంతం చేయలేదు పెద్దనాన్న మీరు ఏమీ అనుకోకపోతే అప్పుడప్పుడు వచ్చి డాడ్ ని పలకరించి వెళ్తారా అనడంతో తప్పకుండా రిషి నా తమ్ముడిని బాగు చేసుకోవడం నా బాధ్యత అని అంటాడు. ఇంతలో దేవయాని, శైలేంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు శైలేంద్ర ఫోన్ తీసుకొని రిషితో ప్రేమగా మాట్లాడినట్టు నటిస్తాడు. అప్పుడు శైలేంద్ర అసలు విషయం రాబట్టడం కోసం మొన్న మేము వచ్చినప్పుడు మీరు లేరు ఎక్కడికి వెళ్లారు రిషి అని అడుగుతాడు. అప్పుడే వచ్చిన వసుధార...మిమ్మల్ని మావయ్య పిలుస్తున్నారని చెప్పి ఫోన్ తీసుకుని రిషిని పంపించేస్తుంది.
వసు: రిషి సార్ ని ఏమడుగుతున్నారు
శైలేంద్ర: ఏమీ లేదు
వసు: మీ బుద్ధులన్ని నాకు తెలుసు సార్ ప్రేమగా నటిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు మొన్న వచ్చినందుకు సంతోషం ఎందుకంటే పెద్ద మామయ్య వాళ్ళు చిన్న మామయ్య సంతోషంగా ఉంటారు కానీ మీరు రావడం వల్ల మాకు సంతోషం దూరం అవుతుంది అనడంతో దేవయాని షాక్ అవుతుంది. ధరణి మేడంని కూడా మీతో పాటూ తీసుకొస్తే బావుండేది..ధరణి మేడం భూషణ్ ఫ్యామిలీ మెంబర్ అని అనుకోవడం లేదా... స్త్రీని గౌరవించడం తెలియని మీరు ఓ కాలేజీని ఎలా నడపగలరు శైలేంద్ర గారు... జీవితంలో మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ముందు అవి నేర్చుకోండి..అంతే కానీ కాలేజీ జోలికి రావొద్దు
దేవయాని: మా గురించి మర్చిపోయి మాట్లాడుతున్నావా
వసు: అరవకండి మేడం..ఆరోగ్యానికి మంచిది కాదు
దేవయాని: శైలేంద్రతో పర్సనల్ విషయాల గురించి మాట్లాడొద్దు
వసు: భార్య-భర్త బావుంటే ఎవ్వరూ జోక్యం చేసుకోరు..కానీ నా తోడి కోడలు బాధపడితే చూస్తూ ఊరుకోలేను..ఏం చేసుకుంటారో చేసుకోండి...
దేవయాని-శైలేంద్ర షాక్ అవుతారు...
ఎపిసోడ్ ముగిసింది...