Guppedantha Manasu November 14th Episode (గుప్పెడంతమనసు నవంబరు 14 ఎపిసోడ్)


మహేంద్రని రిషి, వసుధార పూర్వ విద్యార్థుల సమ్మేళనం దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన తర్వాత మహేంద్ర తానెక్కడికి వచ్చానో తెలుసుకుని లోపలకు రాననేస్తాడు. రిషి-వసు సర్దిచెబుతుండగా..ఇంతలో అనుపమ అక్కడకువస్తుంది. మిగిలిన కాలేజీ ఫ్రెండ్స్ వ‌చ్చి మ‌హేంద్ర‌ను పార్టీ లోప‌లికి తీసుకెళ‌తారు. ఆ త‌ర్వాత జ‌గ‌తి ఎక్క‌డ‌? ఆమెను ఎందుకు తీసుకురాలేద‌ని రిషిని అడుగుతుంది అనుప‌మ‌. జ‌గ‌తి, మ‌హేంద్ర మ‌ధ్య గొడ‌వ‌లు ఇంకా స‌మ‌సిపోలేదా, మీలా వారిద్ద‌రు సంతోషంగా ఉండాల‌ని మీకు అనిపించ‌డం లేదా అని అడుగుతుంది. ఏం వసుధారా మీరిద్దరూ ఎలా సంతోషంగా ఉంటున్నారో మీ అత్తయ్య,మావయ్ కూడా హ్యాపీగా ఉండాలని లేదా అని నిలదీస్తుంది. అమ్మగురించి మీకో విషయం చెప్పాలని రిషి మొదలుపెడతాడు..ఇంతలో ఫ్రెండ్స్ వచ్చి అనుపమని లోపలకు తీసుకెళ్లిపోతారు... అసలు ఈవిడకు జగతి మేడం గురించి ఎలా తెలుసు అనుకుంటారు రిషి ,వసు..


సమ్మేళనం ప్రారంభమవుతుంది..అందరూ సంతోషంగా ఉంటారు. జోక్స్ చేప్పుకుంటారు నవ్వుకుంటారు.. ఆ తర్వాత అనుపమ స్టేజ్ పై మాట్లాడుతుంది
అనుపమ: కాలేజీ రోజులన్నీ కళ్లముందు తిరుగుతున్నాయంటుంది.సరిగ్గా గుర్తులేదు కానీ ఎక్కడో కొటేషన్ చదివాను..నిజమైన స్నేహితులు ఎప్పటికీ విడిపోరు..మనుషులు దూరమైనా మనసులు దగ్గరగా ఉంటాయనే కొటేషన్ చెబుతుంది. నా లైఫ్ మీరంతా అలాంటి స్నేహితులే అంటుంది...ఇంతలో స్టేజ్ కిందనుంచి...జగతి-మహేంద్ర నీకు క్లోజ్ ఫ్రెండ్స్ కదా అంటారు. అవునన్న అనుపమ.. ముగ్గురు కలసి చేసిన అల్లరి గురించి, సరదాగా స్పెండ్ చేసిన సమయంగురించి చెబుతుంది. ఆ రోజులు తిరిగొస్తే బావుండును అనిపిస్తోంది... ( నువ్వు అనుకున్నట్టే కాలచక్రం వెనక్కు వెళ్లి జగతి బతికి ఉండే బావుండును అనుకుంటాడు మహేంద్ర). అందరూ స్టేజ్ పై మాట్లాడండి అంటుంది..


Also Read: మహేంద్రను అనుపమ దగ్గరకు తీసుకెళ్తున్న రిషిధార!


విశ్వనాథం-అనుపమ-రిషి
రిషి-వసుధారకి...అనుపమ-జగతి-మహేంద్ర ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఇంతలో విశ్వనాథం, ఏంజెల్ అక్కడకు వస్తారు. రిషి-వసుధార పలకరించినా ఏంజెల్ చికాకు పడుతుంది. మీరెంటి ఇక్కడ అని వసుధార అడిగితే...డాడ్ అంటూ అక్కడకు వస్తుంది అనుపమ...
మీరేంటి లేటుగా వచ్చారని అడుగుతుంది...ఆ పిలుపు విని రిషి, మ‌హేంద్ర‌తో పాటు వ‌సుధార ఆశ్చ‌ర్య‌పోతారు. విశ్వ‌నాథం త‌న తండ్రి అని రిషికి చెబుతుంది అనుప‌మ‌. మీకు అనుప‌మ అనే కూతురు ఉంద‌నే విష‌యం నాతో ఎప్పుడు చెప్ప‌లేదు ఎందుక‌ని అని విశ్వ‌నాథాన్ని అడుగుతాడు రిషి. నువ్వు మాత్రం నాకు అన్ని చెప్పే చేశావా అంటూ రిషిపై సెటైర్ వేస్తాడు విశ్వ‌నాథం.జ‌గ‌తి, మ‌హేంద్ర‌, తాను క‌లిసి చ‌దువుకున్న‌ట్లు విశ్వ‌నాథంతో చెబుతుంది అనుప‌మ‌.


మహేంద్ర
పార్టీలో మ‌హేంద్ర మాట్లాడాల‌ని స్నేహితులు బ‌ల‌వంతం చేస్తారు. తాను మాట్లాడ‌లేన‌ని మ‌హేంద్ర ఎంత చెప్పినా స్నేహితులు తన మాట‌ల్ని ప‌ట్టించుకోరు. స్నేహం కూడా ప్రేమ‌లో ఒక భాగ‌మేన‌ని తాను న‌మ్ముతాన‌ని మ‌హేంద్ర మొదలుపెట్టి.. ఏ బంధ‌మైనా మ‌నం ఊహించుకున్న‌ట్లుగా ఉండ‌ద‌ని, తొలుత ప‌ల‌చ‌బ‌డి ఆ త‌ర్వాత పూర్తిగా క‌నుమ‌రుగైపోతుంద‌ని మాట్లాడుతాడు. మ‌హేంద్ర మాట‌లు విని అంద‌రూ షాక‌వుతారు. జ‌గ‌తి గురించి మాట్లాడాల‌ని స్నేహితులంద‌రూ మ‌హేంద్ర‌ను రిక్వెస్ట్ చేస్తారు. కానీ మ‌హేంద్ర మాట్లాడ‌లేక‌పోతాడు. క‌న్నీళ్ల‌తో స్టేజ్ దిగి వెళ్లిపోతాడు. 


Also Read: బుంగమూతి , బుజ్జగింపులు -రిషిధార ఏసాలు మామూలుగా లేవు


అనుపమ: జ‌గ‌తిని ఎందుకు దూరంగా పెడుతున్నావు, నిన్ను నువ్వు ఎందుకు మార్చుకోవ‌డం లేదు అంటూ నిల‌దీస్తుంది. జ‌గ‌తిని ఎందుకు ఇక్క‌డికి తీసుకురాలేద‌ని మ‌హేంద్ర‌ను నిల‌దీస్తుంది. ఇంకా ఆమెను ఎందుకు వేధిస్తున్నావు. క్షోభ‌పెడుతున్నావ‌ు
వ‌సుధార మ‌ధ్య‌లో క‌ల్పించుకుని స‌మాధానం చెప్పాల‌ని చూస్తుంది. ఇది మా ముగ్గురికి సంబంధించిన విష‌యం మీరు ఎవ‌రు జోక్యం చేసుకోవ‌ద్ద‌ని అనుప‌మ అంటుంది. 
అనుపమ: జ‌గ‌తిని ఇక్క‌డికి తీసుకొస్తే ఆమెను చూడాల‌ని, త‌న‌తో మాట్లాడాల‌ని ఎంతో ఆశ‌గా ఎదురుచూశాన‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది. అనుప‌మ ప‌దే ప‌దే అడ‌గ‌టంతో జ‌గ‌తి చ‌నిపోయింద‌నే నిజం బ‌య‌ట‌పెడుతుంది వ‌సుధార‌. లేని మ‌నిషిని తీసుకురావ‌డం సాధ్యం కాద‌ని అంటుంది. 
జగతి చనిపోయిందన్న మాటవిని అనుప‌మతో పాటు అక్క‌డే ఉన్న విశ్వ‌నాథం, ఏంజెల్ కూడా షాక్ అవుతారు. 
జ‌గ‌తి చ‌నిపోలేద‌ని చెప్పు అంటూ మ‌హేంద్ర గ‌ట్టిగా నిల‌దీస్తుంది. జ‌గ‌తి చ‌నిపోయింది. త‌ను నాకు దూర‌మైంది అంటూ అనుప‌మ‌తో అంటాడు మ‌హేంద్ర‌. 
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...


Also Read: సీరియస్ సింహం కాదు రొమాంటిక్ రిషి - మహేంద్ర మాటలు బాగానే పనిచేశాయ్!