Brahmamudi Serial November 14th Episode : డాక్టర్ క్యాన్సర్‌ను నయం చేయగలను అని చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా సంతోషపడతారు. ఇక డాక్టర్ బయలు దేరుతా అంటే కావ్య ఆతిధ్యం తీసుకోండి అంటుంది. మరోసారి వస్తా అని చెప్పి డాక్టర్ బయలు దేరుతారు. ఇక చిట్టి, కుంటుంబ సభ్యులంతా చాలా సంతోష పడతారు. 


తాతయ్య: పిచ్చి చిట్టీ నువ్వు ఎంత భయపడ్డావో నాకు తెలీదా. బావ అన్న పిలుపు నాకు ఎక్కడ దొరుకుతుంది. పైకి వెళ్లినా రంభ ఊర్వశిలు తాతయ్య అంటారే తప్ప బావ అనరుకదా. 


రాజ్: డాక్టర్ తాతయ్య చెప్పింది విన్నారు. 


తాతయ్య: నేను విన్నాను రా ఇప్పుడు ఇక మీరు నా మాట వినాలి. డాక్టర్ గారికి నచ్చినట్టే  మన ఫ్యామిలీ అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఇప్పటి వరకు ఇంట్లో ఎన్నో మనస్పర్థలు వచ్చాయి. ఇకపై అలా కాకుండా అందరూ కలిసి మెలసి ఉండాలి అంటే ఇంట్లో ఏదో శుభకార్యం జరిపించండి. 


చిట్టీ: శుభకార్యమా అయితే మన కల్యాణ్ పెళ్లి అనుకున్నామ్ కదా అదే జరిపిచండి


కనకం అప్పుకు తినిపించమని అన్నం తన అక్క చేతికి ఇస్తుంది. ఇక తన భర్తకు కూడా వడ్డించాలా అని అడుగుతుంది. ఇంతలో కనకానికి కావ్య ఫోన్ చేసి తాతయ్య గారికి నయం అవుతుంది చెప్తుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉంటారు. మరోవైపు కల్యాణ్ అప్పుకు కాల్ చేస్తాడు. అయితే అప్పు కల్యాణ్‌ని తిడుతుంది. అయితే కల్యాణ్ తిట్టినా పర్లేదు కానీ నేను లొకేషన్ పెడితా రా అని పిలుస్తాడు. మరోవైపు కల్యాణ్ అనామికకు కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పాలని రమ్మంటాడు. 


కావ్య: నిజంగా తాతయ్య గారిని కాపాడుకునే అవకాశం ఉందని తెలియడంతో చాలా సంతోషంగా ఉంది. 


రాజ్: నేను పరాయి మనుషులతో సంతోషం పంచుకోను


కావ్య: నేను పరాయి మనిషిని కాను మీరు కట్టుకున్న భార్యను. ఏమండి నేను మాట్లాడాలని వచ్చాను. మీరు నాతో పోట్లాడుతున్నారు. ఇకపై మనం కొత్తగా మాట్లాడుకోవాలి. ప్రేమించుకోవాలి. అరవకుండా చెప్పేది వినండి. కుటుంబం మొత్తం తాతయ్య గారిని సంతోష పెట్టాలని అనుకుంటున్నారు. మనిద్దరి మధ్య ఉన్న మనస్ఫర్ధల వల్ల తాతయ్య మనసు బాధ పడకూడదు. మన ఇద్దరి మధ్య ఉన్న సమస్యలకు మనం పరిష్కారం వెతుక్కొని నిజంగా మనం సంతోషంగా ఉంటేనే తాతయ్య సంతోషంగా ఉంటారు. అది ఆయన ఆరోగ్యానికి చాలా మంచిది. 


రాజ్: ఈ సందర్భాన్ని నువ్వు అడ్వాంటేజ్‌గా తీసుకొని ఒక్కటై పోవాలని చూస్తున్నావా. అసలు నా సమస్య నువ్వే. నువ్వు దూరంగా ఉంటే నాకు సమస్యే లేదు. 


కావ్య: అది నావల్ల కాదు.. 


రాజ్: నా వల్ల అవుతుంది.


కావ్య: అయినా నా వల్ల కాదు. ఏవండీ మీరు నేను కలిసిపోతేనే తాతయ్యగారి మనోవ్యథ తగ్గిపోతుంది. మీరు మీ కుటుంబం కోసం నాతో ప్రేమగా ఉన్నట్లు నటించారు. నేను మా అక్క కోసం నిజం తెలిసినా తెలియనట్లు నటించాను. ఇందులో ఇద్దరి తప్పు ఉంది. నాది నాటకం అయితే మీది నాటకమే. నాది మోసం అయితే మీది మోసమే. ఇద్దరం చెరో నాటకం ఆడి తిరిగాం. మీరు బయట పడినప్పుడు నేను మిమ్మల్ని దోషిగా చూడలేదు. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు దోషిలా చూస్తున్నారు. 


రాజ్: అవును నేను నటించాను. అవసరం అయితే ఇంకా నటిస్తాను. అంతే కానీ నీతో మాత్రం కలిసి కాపురం చేయను. అది కలలో కూడా జరగదు. భార్యగా ఎప్పటికీ ఒప్పుకోను. నువ్వు ఉంటే ఇంకా నీకు ఈ మొహం పెట్టుకొని ఇంట్లో ఉండాలి అనుకుంటే నన్ను నేను పట్టించుకోను. ప్రేమ అన్న పదానికి మనద్దరికీ ఎప్పటికీ చోటు ఉండదు. ఇన్నాళ్లు నటించావ్ కదా ఇప్పుడు నటించుకో.


కావ్య:  నేను నిజంగా నటిస్తే ఎవరూ గుర్తుపట్టలేరు. మనసులో ఈయన ఎన్ని చెప్పినా వినేలా లేరు ఆయన మారాలి అంటే ఆయన రూట్ లోనే వెళ్లాలి. సరే అయితే నేను నటిస్తే ఎలా ఉంటుందో ముందు ముందు మీరే చూస్తారు వస్తాను. ఏవండి ఐ లవ్ యూ ఇది నటనే అండి ముందుంది అసలు నటన.  


స్వప్న మేకప్ అవుతుంటే రాహుల్ చూస్తుంటాడు. ఇక రుద్రాణి వచ్చి తిడుతుంది. అయితే తాను స్వప్నను ఎలా బయటకు తరమాలి అని ఆలోచిస్తున్నా అని చెప్తాడు. అయితే రుద్రాణి రాహుల్‌కి చీవాట్లు పెడుతుంది. స్వప్నకు గతంలో ఓ లవర్ ఉండేవాడని వాడితో రిలేషన్‌లో ఉందని నమ్మిస్తే ఇంట్లో వారు స్వప్నను తరిమేస్తారని చెప్తాడు. ఈ విషయంలో రాజ్, అపర్ణను ముందు నమ్మించాలని డిసైడ్ అవుతారు. వాళ్లకు అనుమానం వస్తే ఇంట్లో వాళ్లుకు విషయం ఈజీ వెళ్తుందని ప్లాన్ చేస్తారు. ఇక రాహుల్ ఆ అబ్బాయ్‌తో మాట్లాడటానికి వెళ్తాడు. 


మరోచోట అప్పు, కల్యాణ్, అనామిక కలుసుకుంటారు. కల్యాణ్ తనతో అనామిక పెళ్లికి డేట్ ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారని చెప్తాడు. దీంతో అనామిక కల్యాణ్‌కు హగ్ ఇస్తుంది. ఇక అప్పు షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.