బిగ్ బాస్ సీజన్ 7లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరు గెలుచుకుంటారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ అని రివీల్ చేయకుండా టాప్ 1 నుంచి 10 స్థానాల్లో ఎవరెవరు ఏ స్థానాలకు అర్హులో డిసైడ్ చేసుకోమన్నారు బిగ్ బాస్. టాప్ 1 నుంచి 5 స్థానాల దగ్గర నిలబడిన వారిని కాకుండా టాప్ 6 నుంచి 10 స్థానాల దగ్గర నిలబడిన వారిని ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఎంపిక చేశాడు. అలా ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పెట్టిన మొదటి టాస్కులోని అర్జున్ గెలిచి పాస్‌ను సంపాదించుకున్నాడు. కానీ ఆ పాస్‌ను ఎక్కువకాలం కాపాడుకోలేకపోయాడు. బిగ్ బాస్ ఇచ్చిన రెండో ఛాలెంజ్‌లోనే ఆ పాస్.. అర్జున్ చేతి నుంచి యావర్ చేతికి వెళ్లింది.
పల్లవి ప్రశాంత్ కన్‌ఫ్యూజన్
యావర్ చేతికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చిన తర్వాత తను తెలివిగా ఒక్కొక్కరిని రేసు నుంచి తప్పిస్తూ వెళ్లాడు. ముందుగా మూడు స్కూటర్ బొమ్మలను ఇచ్చి వాటిని నెంబర్ ప్లేట్ పెట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ కోసం పల్లవి ప్రశాంత్‌ను ఎంపిక చేసుకున్నాడు యావర్. సమయానుసారం స్క్రీన్‌పై నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్లను గుర్తుపెట్టుకొని వాటిని వెతికి స్కూటర్లకు అతికించాల్సి ఉంటుంది. ఈ టాస్కులో పల్లవి ప్రశాంత్ ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అయ్యి నెంబర్లను గుర్తుపెట్టుకోలేక వెనకబడ్డాడు. దీంతో యావర్ గెలిచాడు. యావర్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ అలాగే ఉండిపోయింది.
స్ట్రాటజీతో ముందుకెళ్లిన యావర్
ఆ తరువాతి టాస్క్‌లో డైస్‌ను రోల్ చేసి బర్గర్ ఫోటో వచ్చినప్పుడల్లా బర్గర్లను తింటూ ఉండాలని బిగ్ బాస్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో ముందుగా 6 బర్గర్లను ఎవరు ముందుగా తింటారో వారే విజేతలని చెప్పారు. ఈ పోటీ కోసం శోభా శెట్టిని ఎంపిక చేసుకున్నాడు యావర్. శోభా ఎక్కువగా తినలేదని తెలిసే స్ట్రాటజీతో తనతో పోటీపడడానికి సిద్ధమయ్యాడు. అందరూ అనుకున్నట్టుగానే శోభాకంటే ముందుగా తానే 6 బర్గర్లు తిని మళ్లీ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను కాపాడుకున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ టాస్కులు గెలిచిన యావర్.. చివరిగా ప్రియాంక, శివాజీలతో పోటీపడ్డాడు.
యావర్ క్లీన్ స్వీప్
విల్లుపై బాల్స్‌ను బ్యాలెన్స్ చేయాలని శివాజీ, ప్రియాంక, యావర్‌లకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కు కొన్ని నియమాలను కూడా చెప్పారు బిగ్ బాస్. సంచాలకులుగా శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ ఉండాలని ఆదేశించారు. అయితే రూల్స్ విషయంలో కంటెస్టెంట్స్‌తో పాటు సంచాలకులు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యారు. శివాజీ రూల్స్ ప్రకారం ఆడలేదని తను ఔట్ అని డిసైడ్ చేశారు. కానీ ప్రియాంక, యావర్‌లలో ఎవరు విన్నర్ అని తేల్చుకోలేకపోయారు. ప్రియాంక ఒక్క రూల్‌ను కూడా అతిక్రమించకుండా బాల్స్‌ను కరెక్ట్‌గా పెట్టినా కూడా బజర్ మోగేవరకు విల్లును పట్టుకొని ఉండలేకపోయింది. యావర్ మాత్రం విల్లును బ్యాలెన్స్ చేస్తూ బజర్ మోగే సమయానికి నాలుగు బాల్స్‌ను బ్యాలెన్స్ చేయగలిగాడు. కానీ చాలాసేపటి వరకు తను బాల్స్‌ను చేతిలోనే పట్టుకొని ఉన్నాడు. శోభా, ప్రశాంత్.. ఇద్దరూ సంచాలకులే కాబట్టి కలిసికట్టుగా యావర్‌ను విన్నర్‌గా ప్రకటించారు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అందరినీ క్లీన్ స్వీప్ చేశాడు యావర్. అయితే, శోభా వాదన చూస్తే ప్రియాంకను విన్నర్‌గా ప్రకటించాలని ప్రయత్నించినట్లు ప్రేక్షకులకు అనిపించి ఉండొచ్చు. కానీ, ఆమె చెప్పే విధానం నచ్చకే శివాజీతో గొడవ జరిగింది. కానీ, చివరికి ఫలితం యావర్ వైపే మొగ్గు చూపింది. ప్రియాంక కూడా తాను ఫస్ట్ రౌండ్‌లోనే బాల్స్ వదిలేశాను కదా అని స్పష్టత ఇవ్వడంతో.. విజేతను ప్రకటించడం సులభమైనట్లు తెలిసింది.
Also Read: బిగ్ బాస్‌లో 11వ వారం ఎలిమినేషన్ - డేంజర్ జోన్‌లో ఆ లేడీ కంటెస్టెంట్!