Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరుగుతున్న పోటీ రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. ముందుగా టాప్ 6 నుంచి 10 స్థానాల దగ్గర నిలబడిన వారి మధ్య ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ మొదలయ్యింది. అందులో అర్జున్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సొంతం చేసుకున్నాడు కానీ అది అర్జున్ దగ్గరే ఉండిపోదు అని మిగతావారితో పోటీపడి పాస్‌ను కాపాడుకోవాలని బిగ్ బాస్ తనకు షాకిచ్చాడు. దీంతో అర్జున్.. ముందుగా యావర్‌తో పోటీపడ్డాడు. అర్జున్, యావర్‌కు మధ్య జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీ ఎన్నో ట్విస్టులతో ముందుకెళ్లింది. ఫైనల్‌గా యావర్ చేతికి పాస్ వచ్చింది. ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్లే మొదటిసారి పల్లవి ప్రశాంత్, శివాజీ మధ్య మనస్పర్థలు వచ్చాయి. అంతే కాకుండా శోభా శెట్టి, శివాజీల మధ్య కూడా చాలాకాలం తర్వాత వాగ్వాదం జరిగింది.


అర్జున్ నుంచి ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను యావర్ సంపాదించుకున్నాడు. అయితే యావర్ ఆడిన ఆట కరెక్ట్ కాదని కొందరు భావించారు. అమర్‌దీప్ సంచాలకుడిగా ఉన్నా సరిగా గమనించలేదని తనపై కూడా ఆరోపణలు చేశారు. కానీ ఈ డిస్కషన్ మరింత సీరియస్‌గా ముందుకు వెళ్లలేదు. యావర్ చేతిలో పాస్ ఉండడం వల్ల తన తరువాతి ఛాలెంజ్‌కు పల్లవి ప్రశాంత్‌కు ఎంపిక చేసుకున్నాడు. ఆ ఛాలెంజ్‌లో కూడా యావరే గెలిచి పాస్‌ను కాపాడుకోగలిగాడు. ఆ తర్వాత జరిగిన టాస్క్ కోసం శోభా శెట్టిని ఎంచుకున్నాడు. కానీ శోభా కూడా యావర్‌తో పోటీపడి గెలవలేకపోయింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ జరిగిన టాస్కులను గెలిచి తన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను కాపాడుకున్నాడు యావర్. ఫైనల్‌గా శివాజీ, ప్రియాంకతో ఒకేసారి టాస్క్‌లో పోటీపడ్డాడు. 


శివాజీపై అలిగిన ప్రశాంత్..


ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగిన చివరి టాస్కులో యావర్, శివాజీ, ప్రియాంక.. ఒక విల్లుపై మూడు బాల్స్‌ను బ్యాలెన్స్ చేయమని బిగ్ బాస్ తెలిపారు. ఈ టాస్కులో బిగ్ బాస్ కొన్ని రూల్స్‌ను కూడా పెట్టి శోభా శెట్టిని, పల్లవి ప్రశాంత్‌ను సంచాలకులుగా వ్యవహరించాలని ఆదేశించారు. యావర్ విల్లుపై బాల్స్ సరిగా పెట్టడం లేదని పల్లవి ప్రశాంత్ పదేపదే గుర్తుచేశాడు. దీంతో ప్రశాంత్ మాట్లాడుతున్న మాటలు తనకు డిస్టర్బెన్స్‌లాగా ఉన్నాయని శివాజీ సీరియస్ అయ్యాడు. ముందుగా మూడు బాల్స్ బ్యాలెన్స్ చేసిన తర్వాత కూడా ప్రియాంక.. విల్లుపై పట్టు పోగొట్టుకొని ముందుగా టాస్క్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత శివాజీ రూల్స్‌ను పాటించడం లేదని బిగ్ బాస్ సైతం అనౌన్స్ చేశారు. దీంతో ప్రశాంత్ వల్లే ఇలా జరిగిందంటూ కోపంగా విల్లును వదిలేసి వెళ్లిపోయాడు శివాజీ. యావర్ మాత్రం బజర్ వచ్చేవరకు విల్లుపై బాల్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ నిలబడ్డాడు. దీంతో శివాజీ వచ్చి యావర్‌ను హత్తుకున్నాడు. ప్రశాంత్‌ను కూడా జాయిన్ అవ్వమన్నాడు. ‘‘మీ గేమ్ నేనేం డిస్టర్బ్ చేస్తున్నా నన్ను అంటున్నారు’’ అని అలిగి శివాజీని దూరం పెట్టాడు.


శోభా, శివాజీ మధ్య గొడవ..


టాస్క్ పూర్తయిన తర్వాత శివాజీ, యావర్, ప్రియాంకలలో ఎవరు విన్నర్ చెప్పమని శోభా, ప్రశాంత్‌లను అడిగాడు బిగ్ బాస్. నియమాల ప్రకారం ఎవరు ఆడారో అని శోభా, ప్రశాంత్ చర్చించుకున్నారు. శివాజీ ఎక్కువసేపు బాల్స్‌ను చేతులతో పట్టుకున్నాడని శోభా చెప్పింది. కానీ ఆ విషయాన్ని శివాజీ ఒప్పుకోలేదు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. బిగ్ బాస్ చెప్పిన తర్వాత చేయి తీసేసానని కూడా వాదించాడు. ‘‘ఎప్పుడూ మీ నిర్ణయంతోనే నడుస్తుంది. మీ ఇష్టం. మొదటి వారం నుంచి మీ ఇష్టమే. ఎప్పుడూ సంచాలకులుగా చేసిన మీ ఇష్టమే’’ అని శోభాతో వాదనకు దిగాడు. శోభా కూడా తగ్గకుండా శివాజీతో వాదన మొదలుపెట్టింది. శోభా అరుస్తుందని ‘‘నీకంటే పెద్దగా అరుస్తా. అరవలేనా నేను’’ అని మీదకు వచ్చాడు శివాజీ. యావర్, ప్రియాంకలలో ఎవరు కరెక్ట్‌గా ఆడారో చెప్పమని కంటెస్టెంట్స్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంది శోభా. అక్కడ కూడా శివాజీ అడ్డువచ్చాడు. ప్రియాంకను గెలిపించడానికే ఇలా చేస్తుందని యావర్‌తో చెప్పాడు. ఫైనల్‌గా శోభా తన ఎలిమినేషన్‌కు తానే పునాది వేసుకుంటుందని, ఈ వారం కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుందని శివాజీ అన్నాడు.


Also Read: ప్రియాంక, అమర్‌ల స్ట్రాటజీని బయటపెట్టిన వైరల్ వీడియో - శివాజీ చెప్పింది నిజమేనా?