Rathika Rose : బిగ్ బాస్ సీజన్ 7 చివరిదశకు చేరుకోవడంతో ఇకపై జరగనున్న ఎలిమినేషన్స్ విషయంలో బిగ్ బాస్ ఫ్యాన్స్ మరింత అలర్ట్‌గా ఉంటారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌ను నామినేషన్స్ నుండి తప్పించడం కోసం ఓట్లు వేయడానికి చాలామంది ప్రేక్షకులు ముందుకొస్తారు. అయితే 11 వారం నామినేషన్స్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్ తప్పా మిగిలిన వారంతా ఉన్నారు. శివాజీ ఈ వారం కెప్టెన్ కావడంతో తనను ఎవరూ నామినేట్ చేయలేకపోయారు. ఇక పల్లవి ప్రశాంత్‌కు కూడా నామినేషన్‌లో కేవలం ఒకటే ఓటు పడడంతో తాను కూడా ఈవారం సేవ్ అయ్యాడు. అయితే ఈవారం నామినేషన్స్‌లో ఉన్న 8 మందిలో ఒక లేడీ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.


డేంజర్ జోన్‌లో ఆ లేడీ కంటెస్టెంట్..
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న 10 మంది కంటెస్టెంట్స్‌లో ఎక్కవగా ఓటింగ్ వచ్చేది శివాజీ, పల్లవి ప్రశాంత్‌లకే. అయితే ఈ ఇద్దరూ ఈ వారం నామినేషన్స్‌లో లేని కారణంగా ఓటింగ్ అంతా ప్రిన్స్ యావర్‌పై సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈవారం అందరికంటే ఎక్కువ ఓటింగ్ యావర్‌కే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే అందరికంటే తక్కువ ఓట్లతో రతిక డేంజర్ జోన్‌లో ఉండే అవకాశం ఉందని సమాచారం. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే రతికకు ఓటు వేసే ఛాన్సే లేదు. కానీ శివాజీ ఫ్యాన్స్ మాత్రం రతికకు ఓటు వేసే అవకాశం ఉంది అనుకునేలోపే రతిక.. శివాజీకి వ్యతిరేకంగా మారడం తనకు పెద్ద మైనస్ కాబోతోంది.


నామినేషన్స్‌లో సూపర్..
ఈవారం మొదట్లో రతిక.. నామినేషన్స్‌లో ఎలా ఉండాలి అనే సూచనలను శివాజీని అడిగి తెలుసుకుంది. శివాజీ కూడా తనకు సలహాలు ఇచ్చాడు. శివాజీ ఏం చెప్పాడో రతిక అదే చేసింది. శోభా శెట్టి, ప్రియాంకలను నామినేట్ చేస్తూ తను చెప్పాలనుకున్న పాయింట్స్‌ను కరెక్ట్‌గా చెప్పింది. ఏం మాట్లాడాలనుకుందో అదే మాట్లాడింది. దీంతో రతిక మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టుగా ఉందని ప్రేక్షకులు అనుకున్నారు. నామినేషన్స్‌లో మంచిగా ఆడిందని పేరు తెచ్చుకున్న రతిక.. వెంటనే మళ్లీ పాత తప్పులను రిపీట్ చేసి ప్రేక్షకుల దృష్టిలో నెగిటివ్ అయ్యింది.


పాత విషయాలను తవ్విన రతిక..
టాప్ 1 నుండి 10 స్థానాల్లో ఎవరు ఉంటారో వారినే డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అంతా కలిసి తనకు 10వ స్థానాన్ని ఇచ్చారు. అది తట్టుకోలేని రతిక.. ఆ తర్వాత టాస్క్‌లో సరిగా పాల్గొనలేదు. తన అభిప్రాయాన్ని అడిగిన ప్రతీసారి మెజారిటీ ఏది చెప్తే అదే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అంతే కాకుండా పల్లవి ప్రశాంత్ విషయానికొచ్చే సరికి మరోసారి పాత విషయాలు అన్నీ తవ్వి రచ్చ చేసింది. దీంతో ప్రేక్షకులు.. రతిక ఏం మారలేదని, చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుందని భావిస్తున్నారు. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు కాబట్టి అర్జున్‌పై కూడా తన ఫ్యాన్స్‌లో నెగిటివిటీ ఏర్పడింది. దీంతో రతికను, అర్జున్‌ను డేంజర్ జోన్‌లో పెట్టడానికి తన ఫ్యాన్స్ అశ్వినికి ఓటు వేసే అవకాశం ఉంది. ఓట్ల విషయంలో రతిక కంటే ఎక్కువ డేంజర్ శోభా శెట్టికి కూడా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: శివన్నపై అలిగిన ప్రశాంత్, ఈ వారం శోభా ఎలిమినేట్ ఖాయమన్న శివాజీ