Guppedantha Manasu Serial Farewell: సీరియల్లో గుప్పెడంత సీరియల్‌ వేరయ్యా అంటున్నారు ప్రస్తుతం బుల్లితెర ఆడియన్స్‌. ఎందుకంటే త్వరలోనే ఈ సీరియల్‌కు శుభం కార్డు పడింది. ఇప్పటికే ఫైనట్‌ షాట్‌కి సంబంధించిన షూటింగ్‌ కూడా అయిపోయింది. ఈ వీకే సీరియల్‌కు చివరి వారం కావోచ్చు. బుల్లితెరపై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన గుప్పెడంత మనసుకు ఎండ్‌ కార్డు పడుతుందని తెలిసి సీరియల్‌ ప్రియులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక గుప్పెడంత సీరియల్‌ టీం కూడా తమ జర్నీని ముగించుకుంటుండటంతో భావోద్వేగానికి లోనయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా స్టార్‌ మా రిలీజ్‌ చేసింది. 



ఇక గుప్పెడంత మనసు సీరియల్‌ అయిపోతుండటంతో టీంకి ఇటీవల స్టార్‌ మా ఫెయిర్‌ వెల్‌ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకను ఆదివారం స్టార్‌ మా పరివారం  షో వేదికగా నిర్వహించారు. ఎప్పుడు ఈ షోలో రెండు సీరియల్ల నటీనటులు పాల్గొని సందడి చేస్తుంటారు. కానీ ఈ ఎపిసోడ్‌లో కేవలం గుప్పెడంత సీరియల్‌ టీం మాత్రమే పాల్గొంది. అంతేకాదు ఈ సీరియల్‌ ఎప్పుడో ప్యాకప్‌ చెప్పిన జగతి మేడం అలియా జ్యోతిరాయ్‌ కూడా ఈ ఫెయిర్‌ వెల్‌ పార్టీలో పాల్గొంది. ఇక ఈ ఆదివారం దీనికి సంబంధించి ఫుల్‌ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్‌ మా.



వసుధర కన్నీరు


అయితే ఇందులో 'గుప్పెడంత మనసు' టీం తమ ఆటపాటలతో ఫుల్‌ జోష్‌ నింపింది. రిషి-వసుధర; జగతి-మహేంద్రలు తమ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. అలాగే మహేంద్ర పాట పాడి అలరించాడు. ఇలా మొత్తం షో మొత్తం ఫుల్‌ సందడి చేసిన ఈ టీం చివరిలో ఎమోషనల్‌ అయ్యింది. మూడేళ్ల పాటు సాగిన ఈ జర్నీలో ఈ సీరియల్‌ ఎన్నో మెమోరీస్‌ ఇచ్చిందన్నారు. ఒకరినోకరం ఎంతో దగ్గరయ్యామని, ఒక ఫ్యామిలీ అనే బాండింగ్‌ వచ్చింది.. వీరందరి చాలా మిస్‌ అవుతానంటూ కన్నీరు పెట్టుకుంది వసు. అలాగే రిషి కూడా మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు. "ఈ ప్రాజెక్ట్‌ అందరికి పేరు తెచ్చింది.. కానీ నాకు మాత్రం లైఫ్‌ ఇచ్చింది.  




'స్టార్ మా'కు ఎప్పటికి రుణపడి ఉంటా: రిషి


స్టార్‌ మాకు నేను ఎప్పటికీ రుణ పడి ఉంటాను. ఎందుకంటే గత సంవత్సరం మా నాన్న చనిపోయారు. కానీ ఆయన గర్వించేలా స్టేజ్‌పై ఆయన ముందే నాకు స్టార్‌ మా అవార్డు ఇప్పింది. అది నా లైఫ్‌లో ది మూమెంట్‌, మెమోరీగా ఉంటుంది. ఇంత గొప్ప గిఫ్ట్‌ ఇచ్చిన స్టార్‌ మాకు నేనేప్పుడు క్రతజ్ఞుడినే. గుప్పెడంత మనసు నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌. ఈ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. ఇదంతా తెలుగువాళ్ల గొప్పతనం. రక్షని కూడా చాలా మిస్‌ అవుతాను. తను నా లక్కీయేస్ట్‌ హీరోయిన్‌. నిజంగా లక్క్‌ తెచ్చింది" అని చెప్పుకొచ్చాడు.  ఆ తర్వాత గుప్పెడంత మనసు లోగోతో ఉన్న టీ షర్ట్స్‌ ధరించి అంతా ఆటోగ్రాఫ్‌ ఇచ్చుకున్నారు. ఇక రిషి, వసుధారలు ఎమోషనల్‌ అయిన తీరు అక్కడ ఉన్న వారందని కంటతడి పెట్టించింది. 


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మహేంద్రను కిడ్నాప్ చేసిన శైలేంద్ర – దేవయాని అరాచకాలు తెలుసుకున్న ఫణీంద్ర