Guppedanta Manasu  Serial Today Episode:  నిజం తెలుసుకున్న మహేంద్ర కోపంతో రగిలిపోతూ రిషి, వసుధారలను ఇంట్లో లాక్‌ చేసి కారులో వెళ్తుంటాడు. మహేంద్రకు ఎదురుగా శైలేంద్ర వస్తాడు. దీంతో మహేంద్ర కోపంగా శైలేంద్ర కాలర్‌ పట్టుకుని నువ్వు చస్తేనే మేము మనశ్శాంతిగా బతుకుతాంరా రాక్షసుడా అంటాడు. శైలేంద్ర విదిలించుకుని నేను రాక్షసుడినే. నువ్ నన్ను అంతమొందిస్తావా.. నీ వల్ల కాదు కదా. ఆ దేవుడు వల్ల కూడా కాదు. నిన్ను, వసుధార, రిషి అందరిని అంతమొందిద్దామని వస్తుంటే నువ్వు తగిలావు అని మహేంద్రను రౌడీల చేత కొట్టించి కిడ్నాప్‌ చేస్తాడు.  మహేంద్ర కుర్చీలో కట్టిపేడసి ఉంటాడు.


మహేంద్ర: నిన్ను వదలనురా. నీ అంతు చూస్తానురా


శైలేంద్ర: మీ చేతికున్న వాచ్‌లో టైమే చూసుకోలేరు. నా అంతు ఏం చూస్తారు బాబాయ్‌.  ఇది నా అడ్డా. నా ప్లేస్. పైగా నువ్వు కట్టేసి ఉన్నావ్.


మహేంద్ర: నువ్వు వెధవని తెలుసు. కానీ, నువ్వింతా నీచుడివి, ఇన్ని దుర్మార్గాలు చేస్తావని అనుకోలేదురా.


శైలేంద్ర: అవును, నీచుడినే. నా జాగ్రత్తలో నేనున్నా. అందుకే నిన్ను తీసుకొచ్చా. రిషికి నా నిజ స్వరూపం తెలిసిపోయింది. అయినా నీకు నిజమెలా తెలిసింది.


మహేంద్ర: జగతి పోతు పోతూ నీ పాపాల చిట్టా మొత్తం ఒక లెటర్‌లో రాసింది.


శైలేంద్ర: ఆ లెటర్‌ లో కొన్నే ఉన్నాయి బాబాయ్‌. ఇప్పుడు నేను నీకు చెబుతాను విను. రిషిపై అటాక్ చేయించి కనిపించకుండా పోయేలా చేసింది నేనే. నీపై అటాక్ చేసింది నేనే


మహేంద్ర: నాకు అన్ని తెలుసు కానీ నీకు తెలియంది ఒకటి చెప్తాను విను. మను కన్నతల్లి అనుపమ కాదు జగతి. రిషి, మను కవలపిల్లలు.


శైలేంద్ర: ఏంటీ బాబాయ్.. నేను నీకు షాక్ ఇద్దామనుకుంటే నువ్వే నాకు షాక్ ఇస్తున్నావ్.


 అని సరే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదు. జగతి పిన్నికి జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చి చంపేశాం. అని చెప్పగానే మహేంద్ర రగిలిపోతుంటాడు. ఇక నీకు ఇన్ని నీతులు చెప్పడం వేస్ట్ అని మహేంద్రకు గన్ గురిపెడతాడు శైలేంద్ర. మళ్లీ ఆగి.. అసలే పిన్నిని చంపి పాపం మూటగట్టుకున్నా. మళ్లీ నిన్ను చంపి డబుల్ పాపం ఎందుకు. ఈసారి ఛాన్స్ రౌడీలకు ఇస్తున్నాను. మా బాబాయ్‌ను జాగ్రత్తగా చంపండి. నా కళ్ల ముందే చంపితే చూడలేను. నేను బయటకు వెళ్లాక చేయండి అని శైలేంద్ర వెళ్లిపోతాడు. మరోవైపు ఫణీంద్ర దగ్గరికి వసుధార  వచ్చి శైలేంద్ర గురించి అడుగుతుంది.


ఫణీంద్ర: ఏం జరిగింది. ఎందుకింత ఆవేశంగా ఉన్నారు.


ఇంతలో దేవయాని వస్తుంది.


వసుధార: మేడం మీ కొడుకు శైలేంద్ర ఎక్కడున్నారు. మా మావయ్య గారు ఎక్కడున్నారు?


 ఇంతలో శైలేంద్ర అక్కడకు వస్తాడు.


శైలేంద్ర: ఏంటీ బాబాయ్ ఇంట్లో లేడా?


ఫణీంద్ర: అమ్మ వసుధార మహేంద్ర ఇంట్లో లేడా?


వసుధార: మహేంద్ర సార్‌ కనిపించట్లేదు. అది శైలేంద్రకే తెలుసు


   అని వసుధార చెప్పగానే శైలేంద్ర నాకేం తెలసని ఎదురు ప్రశ్నిస్తాడు. మహేంద్ర కనిపించకపోడానికి, శైలేంద్రకు ఏంటీ సంబంధం అని ఫణీంద్ర అడిగితే జగతి రాసిన లెటర్‌ ఫణీంద్రకు ఇస్తుంది వసుధార ఈ లెటర్‌ చదివితే మీకే అర్థం అవుతుంది అని చెప్తుంది. లెటర్ చదివిన ఫణీంద్ర గుండె పట్టుకుని కుర్చీలో కూలబడిపోతాడు. అసలు ఏముంది ఆ లెటర్‌లో, ఎవరు రాశారు అని దేవయాని అడిగితే.. జగతి మేడమ్ అని వసుధార చెబుతుంది. అందులో మీది మీ కొడుకుది నేర చరిత్ర మొత్తం ఉందని వసుధార అంటుంది.


ఫణీంద్ర: దేవయాని ఏంటిది.. అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో..


దేవయాని:  లేదండి అదంతా అబద్ధం, అంతా బూటకం అదంతా వసుధారనే క్రియేట్ చేసింది. జగతి రాయలేదు. ముందునుంచి ఆమెకు మేమంటే గిట్టదు.


శైలేంద్ర: ఆ లెటర్‌లో ఉన్నది అబద్ధం


ధరణి: లేదు మావయ్య. వసుధార చెప్పేది నిజం. మనింటికి శని పట్టింది. కళ తప్పిందని మీరంటారు. కదా. అది మా ఆయనతోనే వచ్చింది. ఇంట్లో జరిగిన ప్రతిదానికి మా ఆయనే కారణం.


 అని ధరణి నిజం చెప్తుంది. చిన్నత్తయ్య మీకు ఈ నిజాలు చెప్పొద్దని నాతో మాట తీసుకుంది అందుకే ఇన్ని రోజులు మీకు చెప్పలేదు అంటుంది ధరణి. దీంతో కోపంగా ఫణీంద్ర, శైలేంద్రను కొట్టబోతుంటే ఇంతలో మహేంద్ర, రిషి వస్తారు. వాళ్లను చూసిన శైలేంద్ర షాక్‌ అవుతాడు. అంతకు ముందు మహేంద్ర దగ్గర శైలేంద్ర మాట్లాడిన వీడియో చూపిస్తాడు రిషి. మా డాడ్‌ ని ఎవరు కాపాడారో చెప్పమంటావా? అని రిషి అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.