Brahmamudi Serial Today Episode: రూంలో స్వప్న వినేలా ఎవరితోనో ఇల్లీగల్ గోల్డ్ గురించి ఫోన్ మాట్లాడతాడు రాహుల్. ఇదే విషయం స్వప్న, కావ్యకు చెప్తుంది. కావ్య ఆలోచిస్తుంటే.. ఇంకా ఏం ఆలోచిస్తున్నావే.. అందరి ముందు ఈ విషయం బయటపెడదాం అని స్వప్న అంటుంది. అలా చేస్తే.. రాహుల్ అందరిముందు చెడ్డవాడు అవుతాడు. కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు అని కావ్య అంటుంది. అయితే కానీ, నా భర్త కంపెనీ బాధ్యతలు తీసుకుంటే సంతోషమే కానీ, ఇలా ఆస్తులు పోగొడతాడని తెలిస్తే.. ఇరికించడానికి నేను సిద్ధమే అని స్వప్న అంటుంది. మరోవైపు జాబ్ చేస్తే జీతం రావడానికి నెల టైం పడుతుంది. రోజు డబ్బులు వచ్చే పని చేయాలనుకుంటాడు కళ్యాణ్. ఇంతలో ఒక ఆటో అతని దగ్గరకు వెళ్తాడు.
కళ్యాణ్: సార్ మీరు రోజు ఆటో నడిపితే ఎంతోస్తుంది.?
ఆటోవాలా: అబ్బో ఈ మధ్యన ఆటోవాళ్లను సార్ అని కూడా పిలుస్తున్నారా? అయినా మనకెందుకులే రోజుకు ఓ 500 నుంచి 1000 రూపాయలు వస్తాయి.
కళ్యాణ్: అవునా.. అయితే నేను కూడా మీలాగే ఆటో నడుపుదామనుకుంటున్నాను.
ఆటోవాలా: నిన్ను చూస్తుంటే ఆటో కంపెనీ కొనేవాడిలా ఉన్నావు. నువ్వు ఆటో నడపడమేంటి? సరే అర్థమైంది. కోట్లు పోగొట్టుకుని నోట్లకోసం పాట్లు పడుతున్నారన్న మాట. ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు.
ఈ పక్కనే అని ఇల్లు చూపిస్తాడు కల్యాణ్. హో.. బంటిగాడి ఇంటికి వచ్చిన కొత్త జంట మీరేనా సరే. నేను సేటు నెంబర్ ఇస్తాను. అతని దగ్గరికి వెళ్లి నా పేరు చెబితే రెంట్‌కు ఆటో ఇస్తాడు. అని సేటు నెంబర్ ఇస్తాడు అతను. మరోవైపు రాహుల్ ఆఫీస్‌కు వెళ్తున్నట్లు రుద్రాణికి చెబుతాడు. నువ్వు ఇలా ప్రయోజకుడివి కావడం కంటే ఏముంది అంటుంది రుద్రాణి. ఇంతలో కావ్య, స్వప్న వచ్చి రాహుల్ అక్రమంగా దొంగ బంగారాన్ని కంపెనీ ద్వారా కొనడానికి సిద్ధపడ్డాడని చెప్తారు. దీంతో అందరూ షాక్ అవుతారు. అపర్ణ, ఇందిరాదేవి రాహుల్ ను తిడతారు. ఇంతలో నేను దొంగబంగారం కొంటున్నట్టు మీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. దీంతో నీ చేతిలో ఉన్న ఫైలే దానికి సాక్ష్యం అని ఆ ఫైల్ ను తీసి రాజ్‌కు ఇస్తారు.
స్వప్న: ఇతని బాగోతం ఇందులోనే కనిపిస్తుంది.
రాజ్: ఇందులో ఏ తప్పు లేదు స్వప్న. ఇది మనం రెగ్యులర్ గా గోల్డ్ సప్లై చేసే కంపెనీతో చేసుకున్న అగ్రిమెంటే కదా. ఇందులో దొంగ బంగారం కొంటున్నట్లు ఎక్కడ లేదు. డాక్యుమెంట్స్ అన్ని అఫీషియల్ గానే ఉన్నాయి.
కావ్య, స్వప్న షాక్ అవుతారు. రాహుల్ బాగ్ ను పూర్తిగా వెతుకుతారు. అందులో మరేమీ దొరకదు. ఇంతలో ఎలా మాయం చేశావు అని స్వప్న అడగ్గానే మా అక్కనే పూల్ ను చేస్తున్నావా? రాహుల్ అంటుంది కావ్య.
రుద్రాణి: హేయ్ షటప్. రాజ్‌ను కాదని, రాహుల్‌కు కంపెనీ బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి కావ్య మండిపోతుంది. అందుకే అక్కచెల్లెళ్లు కలిసి ఇలా చేశారు.
అపర్ణ: రుద్రాణి ఆపు.. నోరు గుక్కతిప్పుకోకుండా అంటున్నావేంటీ. స్వప్న చూశానంటుంది. చదివానంటుంది. ఏ భార్య కూడా చేయని తప్పు భర్తపై మోపదు. కావ్య కూడా ఆధారం లేకుండా ఎవరిని అనదు. నిజంగానే నీ కొడుకు ఆ ఫైల్ మార్చాడేమో..?
రాహుల్: పెద్దత్తయ్య మీరు కావ్యను నమ్మి నన్ను అంటున్నారు. ఫైల్ సంగతి పక్కన పెడితే అలా చేస్తే నేరం ఎవరిపై పడుతుంది. నా మీదే కదా. నేనే కదా ఆఫీస్‌కు వెళ్తున్నాను.
స్వప్న: ఎంత బాగా నటిస్తున్నావు రాహుల్. నన్ను పిచ్చిదాన్ని చేద్దామనుకుంటున్నావా..?
రుద్రాణి: మీ ఇద్దరు కలిసి రాహుల్ ను చేస్తున్నారు. నాన్న కావాలంటే రాజ్‌కే కంపెనీ అప్పజెప్పండి.
ధాన్యలక్ష్మీ: అలా ఎలా కుదురుతుంది. కల్యాణ్ వచ్చేవరకు రాజ్ కంపెనీకి వెళ్లకూడదని మావయ్య గారే చెప్పారు.
అని చెప్పగానే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇక ఇక్కడితో వదిలేయండి. నేను వచ్చి సీటు లాక్కోను ఇవాళ్టీ నుంచి ఆఫీసుకు రెగ్యులర్‌గా వెళ్లు రాహుల్ అని రాజ్ చెప్పి కావ్యను పక్కకు తీసుకెళ్లి కుటుంబాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నావా? అని తిడతాడు రాజ్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.