Jagadhatri Serial Today Episode: గణేష్‌ను పట్టుకుని కొడుతూ పరంధామయ్యను ఎందుకు చంపావు అని అడుగుతుంటే భాగ్య దొంగచాటుగా చూస్తుంది. దీంతో ధాత్రి, భాగ్యను చూసి పిలుస్తుంది. చంపింది మీరే అని తెలిసిపోయింది. కానీ ఎందుకు చంపారో చెప్పండి అని ధాత్రి అడగడంతో గణేష్, భాగ్య షాక్ అవుతారు. దీంతో తామిద్దరం ప్రేమించుకుంటున్నామని మాది వేర్వేరు కులాలు కావడంతో ఊర్లో కలుసుకునే వాళ్లం కాదని పక్క ఊరిలో ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే మా నాన్న చూశారని మమ్మల్ని కొట్టి నన్ను తీసుకెళ్లారని భాగ్య చెప్తుంది. తర్వాత నన్ను అప్పటి నుంచి నాన్న బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. కానీ షష్టిపూర్తి రోజు రాత్రికి ఇద్దరం కలిసి వెళ్లిపోవాలనుకున్నాం అని జరిగింది మొత్తం చెప్తుంది భాగ్య. తామిద్దరం లేచి వెళ్లిపోతుంటే పరంధామయ్య చూశారని.. గణేష్ ను కత్తితో పొడిచే ప్రయత్నంలో పెనుగులాడుతుండగా ఆయన కత్తి ఆయనకే గుచ్చుకుందని చెప్తారు.
భాగ్య: అలా తెలియకుండా తప్పు జరిగిపోయింది.
ధాత్రి: తెలియకుండా చేసినా.. తప్పనిసరి పరిస్థితుల్లో చేసినా.. తప్పు తప్పే భాగ్య. నువ్వు ఆ తప్పు నుంచి తప్పించుకోవాలని చూశావు. నువ్వు చేసిన తప్పుకు కౌషికి గారు తల దించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి కొంచమైనా శిక్ష తగ్గుతుంది.
అని చెప్పగానే సీన్ పోలీస్ స్టేషన్‌లో మారుతుంది. అక్కడ సురేష్, కౌషికి, ఆదిలక్ష్మీ అందరూ ఉంటారు.
ఆదిలక్ష్మీ: ఇదంతా నిజం కాదు నా కూతురు ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయదు. మీరే ఏదో అబద్దం చెప్తున్నారు.
ధాత్రి: ఇప్పటిదాకా ఇదంతా చెప్పింది మీ కూతురే అమ్మా..
ఆదిలక్ష్మీ: నా కూతురుని భయపెట్టి మీరే ఇలా చెప్పిస్తున్నారు. సురేష్ అలా కూర్చున్నావేంట్రా… వచ్చి నీ చెల్లి ఇలా చేయదని చెప్పరా..
కేదార్: ఒక తల్లిగా మీ బాధను మేము అర్థం చేసుకోగలం కానీ మీరు ఒప్పుకోనంత మాత్రాన జరిగింది మారదు.
ఆదిలక్ష్మీ: చెప్పు నువ్వే డబ్బులిచ్చి వీళ్లందరినీ కొనేశావు కదూ.. నా కూతురు ఏమీ చేయలేదని నిజం చెప్పు కౌషికి. ఈ పోలీసులతో కలసి ఇదంతా నువ్వు చేసిన కుట్ర అని చెప్పు.
కౌషికి: ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నాకు మామయ్య చావుకు ఎలాంటి సంబంధం లేదు అత్తయ్య.
భాగ్యలక్ష్మీ: నిజం నేను చెప్పింది. పోలీసులు చెప్పింది నిజమే అమ్మా.. నాన్నా చేతిలో ఉన్న కత్తి లాక్కునే ప్రయత్నంలో అది నాన్నకు తగిలింది.
అని చెప్పి ఏడుస్తుంది భాగ్యలక్ష్మీ. దీంతో సురేష్, కౌషికి మీ ప్రేమను మాతో చెప్పి ఉంటే మేమే అందరితో మాట్లాడి మీ పెళ్లి చేసేవాళ్లం కదా అంటారు. ఇంతలో ఆదిలక్ష్మీ, సురేష్‌ను తిట్టి వెళ్లిపోతుంది.
ధాత్రి: కౌషికి గారు మీ మీద పెట్టిన కేసును కొట్టేస్తున్నాం.. మీరిక వెళ్లొచ్చు.
కౌషికి: జేడీ.. నువ్వు ఈ కేసు టేకప్ చేస్తున్నావని చెప్పగానే పాత కక్షలు మనసులో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టిస్తావనుకున్నాను. కానీ
ధాత్రి: కానీ ఇలా నిజాయితీగా డ్యూటీ చేస్తుననుకోలేదా? కౌషికి గారు. అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు ఈ జేడీ అన్యాయాన్ని ఎదుర్కొని న్యాయం కోసం పోరాడుతుంది. అది మీ కోసమైనా మీకు పోటీగా అయినా.. తప్పైతే నేను తప్పనే అంటాను. ఒప్పైతే ఒప్పనే అంటాను.
కౌషికి: కానీ నా తమ్ముడి విషయంలో.. మీరు తప్పు చేశారు.
అనగానే అదేం లేదని ధాత్రి చెప్తుంది. తర్వాత అక్కడి నుంచి కౌషికి, సురేష్ వెళ్లిపోతారు. ఇంటికి వచ్చిన కౌషికిని చూసి సుధాకర్ ఎమోషనల్ గా ఫీలవుతాడు. నిషిక, వైజయంతి వెటకారంగా కౌషికితో మాట్లాడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్: జున్నుకు నిజం చెప్పిన లక్ష్మీ