Nindu Noorella Saavasam Serial Today Episode: శివరాం చెప్పినట్లు పిల్లలను పిక్నిక్ కు తీసుకెళ్లమని అమర్ కు చెప్పేందుకు రూంలోకి కాఫీ తీసుకుని వెళ్లిన మిస్సమ్మ కాలు జారి అమర్ ఓడిలో పడిపోతుంది. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాంటిక్ సన్నివేశం జరుగుతుంది. తర్వాత అమర్ సారీ చెప్తాడు. మరోవైపు ఆరు హ్యాపీగా ఉండటం చూసి గుప్త ఎందుకు అంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు.
ఆరు: మా అంజు అల్లరి చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది గుప్త గారు. నిన్నటి నుంచి అందరికీ చెప్పిందే చెప్పి తెగ అల్లరి చేస్తుందనుకోండి. అంజు ధైర్యాన్ని అవార్డు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఓవరాక్షన్ కు కచ్చితంగా ఇవ్వవచ్చు.
గుప్త: ఆ ఇవ్వవచ్చు ఎందుకంటే ఆ పిల్ల పిచ్చుకది నీ పోలిక కదా?
ఆరు: హా.. నేను అలిగాను..
గుప్త: మీ వాళ్లు హ్యాపీగానే ఉన్నారు. ఆ మనోహరికి ఎటుచూసినా కష్టాలే ఉన్నాయి. ఆ ఘోర నిన్ను బంధించక ముందే మనం మా లోకానికి వెళ్దాం.
అనగానే ఆరు నాకు ఏమీ వినిపించడం లేదు అని ఆరు గుప్తకు దొరకకుండా తిరుగుతుంది. గుప్త ఆపగానే ఆరు తన కన్నవాళ్ల గురించి ఎమోషనల్ గా ఫీలవుతుంది. దీంతో గుప్త నీ నమ్మకం నిజమవుంతుంది. మీ మధ్య ఉన్న ఏకైక బంధం మిమ్మల్ని కలపబోతునది అని చెప్తాడు. మరోవైపు కిచెన్ లోకి వెళ్లిన మనోహరి కిటికీలన్నీ మూసి.. గ్యాస్ సిలిండర్ ఆన్ చేస్తుంది. ఒసేయ్ మిస్సమ్మ ఈరోజుతో నీ పని అవుట్ అనుకుని వెళ్లిపోతుంది. మరోవైపు అమర్ రూంలో సిగ్గు, భయంతో నిలబడ్డ మిస్సమ్మను అమర్ నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు. పిక్నిక్ గురించి చెప్పగానే అమర్ సరే అంటాడు. ఇంతలో గ్యాస్ స్మెల్ రావడంతో అందరూ హాల్‌లోకి వస్తారు. అమర్ కిచెన్ లోకి వెళ్లి గ్యాస్ ఆఫ్ చేస్తాడు.
మనోహరి: మిస్సమ్మ కొంచెమైనా సెన్స్ ఉందా? ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలు ఉన్నారు కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? జస్ట్ మిస్ అమర్ ఆఫ్ చేశడు. అదే అంజు లాంటి వాళ్లు కిచెన్‌లోకి వెళ్లుంటే.. అమర్ నువ్వేం మాట్లాడవేంటి?
అమర్: మిస్సమ్మ స్టవ్ ఆన్ లో ఉంచింది నువ్వేనా?
మనోహరి: అమర్ కిచెన్ లోకి తను తప్పా ఇంకెవరు వెళ్లరు కదా?
అమర్: మనోహరి అది తనని చెప్పనివ్వు..
మిస్సమ్మ: కాఫీ పెట్టింది నేనేనండి. కానీ స్టవ్ ఆఫ్ చేసింది నాకు బాగా గుర్తు ఉంది.
నిర్మల: చిన్నతప్పును పట్టుకుని అమర్ కు కోపం పెంచేలా ఉందేంటి ఈ పిల్ల. (అని మనసులో అనుకుని) నాన్నా అమర్ ఇందులో మిస్సమ్మ తప్పేం లేదు. ఇందాక మీ నాన్నకు వేడి నీళ్లు పెడదామని ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయాను.
మనోహరి: ఆంటీ మీరు వెళ్లారా? నేను చూడలేదే?
శివరాం: ఏమ్మా.. ఇలా గ్యాస్ లీక్ అవుతుందని ముందే ఊహించి కిచెన్ లోకి వెళ్లే వాళ్లను వచ్చే వాళ్లను చూడటమేనా నీ పని.
అమర్: గ్యాస్ లాంటి విషయాల్లో ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి అమ్మా..
అని చెప్పి అమర్ వెళ్లిపోతాడు. ఇంతలో శివరాం రేపు పిక్నిక్ కు మీరు మాత్రమే వెళ్లాలని మేము ఇంట్లోనే ఉంటామని చెప్తాడు. తర్వాత మిస్సమ్మ, మనోహరిని పిలిచి వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు ఆశ్రమానికి వెళ్లిన రామ్మూర్తి తన కూతురు గురించి తెలుసుకోవడానికి వెళ్తాడు. వార్డెన్ ను కలిసి వివరాలు అడుగుతాడు. వార్డెన్ అమర్ చెప్పిన నిజం గుర్తుకు చేసుకుంటుంది. అమర్ ను అడిగి ఇతనికి నిజం చెప్పాలని అమర్ కు ఫోన్ చేస్తుంది. రామ్మూర్తికి నిజం చెప్పొద్దని ఆయనకు సర్జరీ అయిందని నిజం తెలిస్తే ఆయన తట్టుకోలేడని అమర్ చెప్పగానే వార్డెన్ సరే అంటుంది. తర్వాత రామ్మూర్తికి ఏమీ తెలియలేదని చెప్తుంది. దీంతో రామ్మూ్ర్తి ఎమోషనల్ గా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘కార్తీకదీపం 2’ సీరియల్: కాశీకి రాఖీ కట్టిన దీప – జ్యోత్స్న తో రాఖీ కట్టిస్తానన్న పారిజాతం