Prema Entha Madhuram  Serial Today Episode:  శంకర్‌ కు ఫోన్‌ చేసి నీ గెస్‌ కరెక్ట్ అయిందని ఎస్సై చెప్తుంది. దీంతో ఇద్దరూ కలిసి ఎలా పట్టుకోవాలో ప్లాన్‌ చేస్తారు. ఇంతలో చిన్నొడు వచ్చి తను చూసిన బిల్డింగ్స్‌ గురించి చెప్తాడు. ఎక్కడ అనుమానంగా కనిపించలేదంటాడు. దీంతో అందరూ ఆలోచనలో పడిపోతారు. ఇంతలో గౌరి దేవుడి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ మొక్కుతుంది. చిన్నప్పుడే అమ్మా నాన్నలను దూరం చేశావు. ఇప్పుడు చెల్లెలిని దూరం చేస్తావా? ఇలాగైతే నేను ప్రాణాలతో ఉండలేని అని ప్రార్థిస్తుంది. ఇంతలో శంకర్‌ వస్తాడు.


శంకర్‌: గౌరి గారు మీకు నా మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉందో లేదో చెప్పండి గౌరి గారు.


గౌరి: ఉంది...


శంకర్‌: నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే మీ చెల్లెల్ని కాపాడే బాధ్యత నాది. నా ప్రాణంగా భావించే నా తమ్ముళ్ల మీద ఒట్టేసి చెప్తున్నానండి సంధ్యను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది.


అని చెప్పగానే గౌరి సాంత్వనగా చూస్తుంటుంది. మరోవైపు శ్రీను వెహికిల్‌ తీసుకుని కిడ్నాపర్లు చెప్పిన బంగ్లా దగ్గరకు వెళ్తాడు. రౌడీలు వచ్చి శ్రీను దగ్గర బండి తాళాలు తీసుకుని మా వాళ్లు లోడ్‌ చేస్తారు. అంతవరకు మనం బిర్యాని తిందాం పదండి అని శ్రీనును పక్కకు తీసుకెళ్తారు. జగ్గుభాయ్‌ అమ్మాయిలందరినీ వ్యాన్‌ లోకి ఎక్కించండి అని ఒక్క సంధ్యను మాత్రం వద్దని చెప్తాడు. రాకేష్‌ ఎందుకని అడగ్గానే ఈ అమ్మాయిని అడ్డుపెట్టుకుని నేను సేఫ్‌గా సిటీ దాటాలి అందుకే ఇలా చేస్తున్నాను అని గౌరికి ఫోన్‌ చేస్తాడు.


శ్రావణి: అక్కా ఏదో అనౌన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వస్తుంది.


జెండే: అనౌన్‌ నెంబర్‌ నుంచి కాలా? స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడు.


జగ్గుభాయ్‌: మాట్లాడేది గౌరియేనా?


గౌరి: ఎవరు మీరు?


జగ్గుభాయ్: మీ చెల్లిని కిడ్నాప్‌ చేసింది మేమే..


గౌరి: నా చెల్లెలును ఏమీ చేయకండి ఫ్లీజ్‌. తనను వదిలేయండి ప్లీజ్‌.


జగ్గుభాయ్: వదిలేస్తాం. కానీ మేము చెప్పినట్లు చేయాలి.


గౌరి: ఆ ఏం చేయాలో చెప్పండి చేస్తాం.


జగ్గుభాయ్: మీ చెల్లి మీకు సేఫ్‌గా కావాలంటే మీరు మీ పార్ట్‌ నర్‌ శంకర్‌ పోలీసులకు సహకరించకూడదు. నన్ను పట్టుకోవడానికి మీరు పోలీసులతో కలిసి ప్లాన్‌ చేశారని నాకు తెలుసు. కానీ నేను ఏ అడ్డు లేకుండా సేఫ్‌గా సిటీ దాటాలి. అప్పుడే నీ చెల్లి నీకు దక్కుతుంది.


శంకర్‌: సార్‌ నేను శంకర్‌ ను మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్లే వింటాము.. మీకు జోలికి అస్సలు రాను. ప్లీజ్‌ ఆ అమ్మాయిని వదిలేయండి సార్‌.. అని బతిమాలుతాను అనుకుంటున్నావురా? నువ్వు సిటీ దాటి ఎలా వెళ్తావో నేను చూస్తాను. మా సంధ్య ఒక్కతే కాదు. నీ చెరలో ఉన్న అందరు అమ్మాయిలను కాపాడతాను.


జగ్గుభాయ్: శంకర్‌...


శంకర్‌: ఏంట్రా నువ్వు జాలి పడి మాకు ఆఫర్‌ ఇస్తున్నావా? నువ్వు భయపడుతున్నావని నాకు క్లియర్‌ గా అర్థం అవుతుంది. నువ్వు చెప్పినట్లు వినడానికి నేనేమైన డూడూ బసవన్న అనుకున్నావా?


జగ్గుభాయ్: రేయ్‌ నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు..


శంకర్‌: నువ్వు అమ్మాయిలను సిటీ దాటించే పనిలో ఉన్నావు కదా? నీ ప్రయత్నంలో నువ్వుండు.. నిన్ను అడ్డుకునే పనిలో నేనుంటా?


 అంటూ శంకర్‌ ఫోన్ కట్‌ చేస్తాడు. భాయ్‌ భయపడుతూ ఏవడు వీడు అంటూ రాకేష్‌ ను అడుగుతాడు. నేను ముందే చెప్పాను కదా వెరీ డేంజరస్‌ అని అందుకే వాడి వెహికిల్‌ నే బుక్‌ చేశాము. అని అందర్ని వ్యాన్‌ ఎక్కించమని భాయ్‌ చెప్తాడు. మరోవైపు గౌరి, శంకర్‌ ను తిడుతుంది. మీకు మీరే హీరో అనుకుంటున్నారా? అంటుంది. నా చెల్లెలు ప్లేస్‌లో మీ తమ్ముళ్లు ఉండి ఉంటే ఇలాగే ఆలోచించేవారా? అంటుంది. దీంతో శంకర్‌ ఉండనని వాడు చెప్పింది వాణ్ని వాడు కాపాడుకోవడానికే తప్పా సంధ్యను వదిలేయడానికి కాదు అని చెప్పడంతో గౌరి కన్వీన్స్‌ అవుతుంది.  తన తమ్ముళ్లను తీసుకుని శంకర్‌ వెళ్లిపోతాడు. శంకర్‌ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి భాయ్‌ ఫోన్‌ చేసిన నంబర్‌  లోకేషన్‌ ట్రేస్‌ చేయమని చెప్తాడు. దీంతో పోలీసులు లోకేషన్‌ ట్రేస్‌ చేయగానే అందరూ అక్కడికి వెళ్తుంటారు. మరోవైపు శ్రీను వ్యాన్‌ స్టార్ట్ చేసుకుని రౌడీలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


ALSO READ: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మంచి మనుషులుగా మారిన శైలేంద్ర, దేవయాని – గుప్పెడంత మనసుకు హ్యపీ ఎండింగ్