గుప్పెడంతమనసు మార్చి 10 ఎపిసోడ్ 


మినిస్టర్ ఇచ్చిన గిఫ్ట్ ని వసుధారకి ఇచ్చేస్తాడు రిషి...ఇది నీది అనడంతో.. మనది కదా సార్ అంటుంది వసుధార
రిషి: మంగళసూత్రం నీ మెడలోనే ఉంది నీకు నువ్వుగా కట్టుకున్నావు కదా తీసుకో అని అంటాడు రిషి. 
వసు:అన్నీ నేనే తీసుకుంటే మీకు ఎలా సార్ 
రిషి: నాకు నా బాధలు ఉన్నాయి వసుధార అవే సరిపోతాయి
అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి...వసుధార బయటే నిల్చుని ఉంటుంది.. అది చూసి చక్రపాణి ఏదో ఆలోచిస్తూ లోపలకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్లి కారు ఆపి దిగుతుండగా..వసుధార కూర్చున్న సీట్లో మల్లెపూలు కనిపిస్తాయి. నేను మీ భార్యని కాదన్నప్పుడు ఈ పూలు ఎందుకు కొనిచ్చారని వసుధార అన్నమాటలు గుర్తుచేసుకుంటాడు..ఇంతలో వసుధార నుంచి మెసేజ్ వస్తుంది
వసు:  థాంక్స్ ఎండి గారు, మీరు జెంటిల్ మెన్ అని మెసేజ్ చేస్తుంది.
రిషి: ఎందుకు థాంక్స్ 
వసు: అన్నిటికీ...మీరు జెంటిల్మెన్ సార్
రిషి: గాయాలన్నీ భరిస్తున్నా కదా నేను జెంటిల్మెన్ నే 
ఆ తర్వాత వసుధార మంగళసూత్రానికి ఉన్న వీఆర్ ఉంగరం చూసి బాధపడుతుంది. నాకోసం ఇంతలా తాపత్రయ పడుతున్నప్పుడు నేను మిమ్మల్ని అలా ఎలా వదిలేస్తాను సార్ మీ కోసం ఒక అడుగు ముందుకు వేస్తాను అని అనుకుంటూ గుడ్ డే ఎండీగారు అని మెసేజ్ చేస్తుంది


Also Read: భార్యవి కాదంటూనే ప్రేమగా మల్లెపూలు కొనిచ్చిన రిషి, వసుని ఆడేసుకుంటున్న ఈగో మాస్టర్!


దేవయాని సోఫాలో కూర్చుని కాఫీ తీసుకురమ్మని ధరణిని పిలుస్తుంది. ఇంతలోనే అక్కడికి ఫణీంద్ర, మహేంద్ర జగతి  వస్తారు. పాలు ఇంకా రాలేదని ధరణి అంటుంది
మహేంద్ర: ఏంటి ధరణి నువ్వు పాలు లేకపోతే తెప్పించుకోవాలి కదా.. వదిన గారిని ఇబ్బంది పెడితే ఎలా 
దేవయాని: నాకోసం కాదు మహేంద్ర రిషి కోసం... రిషి లేచి కాఫీ అడిగితే అప్పుడు ఏం చెప్పాలి అంటూ నటన మొదలెట్టేస్తుంది
ఇంతలోనే ఎవరో వచ్చారంటూ దేవయాని వెళ్లి తలుపులు తీయగా అక్కడ చక్రపాణిని చూసి షాక్ అవుతుంది. ఎవరు దేవయాని అని ఫణీంద్ర అడిగినా దేవయాని ఉలకదు , పలకదు అలాగే చూస్తుండిపోతుంది. అందరూ అక్కడకు వెళ్లి చక్రపాణిని చూసి షాక్ అవుతారు. ఇంతలో వసుధార లగేజ్ తీసుకుని రావడంతో అది చూసి అందరూ నిలబడి ఉండిపోతారు. జగతి-మహేంద్ర మాత్రం సంతోషపడతారు. 
అప్పుడు నమస్కారం బావగారు అని ఫణింద్రకు నమస్కారం పెడతాడు
ఫణీంద్ర:వసుధార ఈ ఇంటి కోడలు అయినప్పుడు మీరు నాకు అక్కయ్య గారు ఆయన బావగారు అవుతారు కదా అక్కయ్య గారు 
చక్రపాణి: వసుధారే తన భార్య అని రిషి సార్ అందరి ముందు చెప్పినప్పుడు నా కూతురిని నా ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అక్కయ్య గారు.  పాడులోకం పాడు మనుషులు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదా అక్కయ్య గారు అని. అందుకే  మీ ఇంటి కోడలిని మీకు అప్పగిస్తున్నాను 
దేవయాని: జగతి మహేంద్ర ఏంటిది. ఏం జరుగుతోంది
చక్రపాణి:  సమయానికి మా ఇంటి ఆవిడ కూడా అందుబాటులో లేదు అక్కయ్య లేదంటే ఆమె కూడా వచ్చేది
అప్పుడు వసుధార ఇంట్లోకి అడుగుపెడుతుంది. దేవయాని ఆగు అని అరుస్తుంది.. ఏ అధికారంతో లోపలికి వస్తున్నావు అని అడుగుతుంది. వసుధార తన మెడలో ఉన్న తాళిని దేవయానికి చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. 
చక్రపాణి: వెళ్ళొస్తాను అక్కయ్య గారు మంచి రోజు చూసి అల్లుడిని కూతురిని మా ఇంటికి తీసుకెళ్తాను అనడంతో దేవయాని కోపంతో రగిలిపోతుండగా ధరణి మహేంద్ర జగతి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు.
వసుధార: మేడం రిషి సార్ లేచారా కాఫీ ఇచ్చారా
ధరణి: పాలు రాలేదు 
ఇంతలో పాలు రావడంతో మీరు వెళ్లి పాలు కాచండి నేను దేవుడి గుడిలోకి వెళ్లి దండం పెట్టుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


ఆ తర్వాత వసుధార దగ్గరికి జగతి మహేంద్ర వాళ్ళు రావడంతో నేను ఏమైనా తప్పు చేశానా మేడం అంటే..చాలా మంచిపని చేశావంటుంది జగతి. మహేంద్ర కూడా ధైర్యం చెబుతాడు. మహా అయితే రిషి అలుగుతాడు అంతకుమించి ఏమీ అనడులే అంటారు. నువ్వు ఇంటికి రావడాన్ని రిషి బయటకు ఒప్పుకోపోయినా మనసులో సంతోషిస్తాడు..ఒక్క అడుగు వేశావు..మళ్లీ వెనక్కు తిరిగి చూడకు అని జగతి చెబుతుంది


Also Read: మార్చి 10 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ఏదో జరుగుతోంది, నిందలు పడాల్సి ఉంటుంది జాగ్రత్త!


రిషి ఇంకా నిద్రలేవలేదా అని ధరణిపై ఫైర్ అవుతుంది దేవయాని
ధరణి: ఈ లగేజ్ ని ఏం చేయమంటారు
దేవయాని: తీసి నా నెత్తిన పెట్టు...తను వచ్చిందని టెన్షన్ పడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడతావు. తను ఇక్కడే తిష్టవేసుకుని కూర్చుంటే మనం చూస్తూ ఊరుకోవాలా
ధరణి: ఏం చేస్తారు అత్తయ్యగారు
దేవయాని: రిషి ఏదో అన్నాడని పెట్టేబేడా సర్దుకుని వచ్చేయడమేనా.. భార్య భర్త బంధం అంటే ఏంటి..అసలు రిషి నిద్రలేవనీ చెబుతా సంగతి... వసుధార ఈ ఇంట్లోకి అంత ధైర్యంగా వచ్చిందంటే ఈ ఇంట్లో వాళ్ల సహాయం లేదంటావా. జగతి-మహేంద్ర పాత్ర లేదా
ధరణి: మీరెలా షాకయ్యారో వాళ్లు కూడా అలాగే షాకయ్యారు... నేను కూడా..
ఛీఛీ పొద్దున్నే ఏంటో ఈ దరిద్రం ఎక్కడుంది అది అని దేవయాని అంటూ ఉండగా వసుధార వస్తుంది...
వసుధార: ఏంటి మేడం ఏదో అంటున్నారు ఈ రోజు మంచిరోజు.. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలిసు మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా నేను రెండే సమాధానాలు చెబుతాను ఒకటి ఈ తాళి రెండవది రిషి సార్ అని నవ్వుతూ మాట్లాడుతుంది
దేవయాని  కోపంతో రగిలిపోతూ ఉంటుంది
వసుధార: ధరణి మేడం రేపటి నుంచి మీకు సహాయం చేస్తాను. ఈరోజు నుంచి ఒక గ్లాస్ బియ్యం ఎక్కువగా పెట్టాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది
అప్పుడు గదిలోకి వెళ్లిన వసుధార సంతోష పడుతూ ఉంటుంది.