మాళవికని చూసి ఎందుకు వచ్చావ్అని వసంత్ కోపంగా అడుగుతాడు. మనది తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు. లోకంలో భర్తకి విడాకులు ఇచ్చిన ఆడదాన్ని నేనేనా ఏంటని మాళవిక అంటుంది. పొత్తిళ్లలో బిడ్డని వదిలేసి పరాయి మగవాడి కోసం వెళ్ళిపోయిన ఆడదానివి నువ్వేనని వసంత్ అంటాడు. నేను వదిలేసిన భర్తకి సపోర్ట్ చేయడం ఏంటని నిలదీస్తుంది.


మాళవిక: ఈ ఆరేళ్ళలో ఏ రోజు నీ విషయంలో జోక్యం చేసుకోలేదు. నిశ్చితార్థం చేసుకునేటప్పుడు కూడా రాలేదు. తమ్ముడిగా నీమీద మమకారం ఉంది


వసంత్: అంత మమకారం ఉంటే ఎందుకు నా పెళ్లి చెడగొట్టావ్


మాళవిక: చెడగొట్టలేదు తాత్కాలికంగా చెడగొట్టాను. మన మధ్య అక్కాతమ్ముడు బంధం ఉంది అది లీగల్ రిలేషన్ షిప్ అది లోకానికి తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. ఇదే విషయం నీ వాళ్ళందరికీ తెలిసేలా చేశాను


వసంత్: నీ తప్పులు క్షమించలేను


Also Read: జానకి ఆన్ డ్యూటీ- రామతో గొడవపడిన ఎస్సై మనోహర్, కష్టాలు మొదలాయెనే


మాళవిక: నిన్ను క్షమించమని దేబిరించడం లేదు. నాకు కావలసింది అభిమన్యుతో పెళ్లి. నా తరఫున నిలబడి పెళ్లి జరిపించడానికి తోబుట్టువులు ఉండాలని అభిమన్యు వాళ్ళ అక్క కండిషన్ పెట్టింది. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి పెళ్లి జరిపించి మళ్ళీ అత్తారింట్లో దిగబెట్టాలి. ఇప్పుడు నేను నిన్ను కోరుకునేది కూడా ఇదొక్కటే. చేతులు జోడించి వేడుకుంటున్నా నా తమ్ముడిగా వచ్చి నిలబడు నా పెళ్లి అభిమన్యుతో జరిపించు


వసంత్: అది జరగదు ఎందుకంటే నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావ్ గెట్ అవుట్ అని తోసేస్తాడు. దీంతో మాళవిక గన్ తీసుకుని చస్తానని బెదిరిస్తూ తలకి గురిపెట్టుకుంటుంది. వెంటనే వేద వచ్చి చెయ్యి జరిపేసరికి గాల్లోకి కాల్చేస్తుంది. భర్త ఉండి లేనివాడిని అయ్యాను, బిడ్డలు ఉండీ గొడ్రాలు అయ్యాను. తమ్ముడు ఉండి కూడా అనాథ అయ్యాను. తప్పో ఒప్పో ఒక వ్యక్తితో ఉంటున్నా. ఒక్క నెలరోజులు తమ్ముడి స్థానంలో ఉంది పెళ్లి జరిపించమని అడిగాను తప్పా, నేరమా, పాపమా అని ఎమోషనల్ అవుతుంది.


ఇది కరెక్ట్ కాదని వేద అంటుంది. సాటి ఆడదానిగా సమస్యని అర్థం చేసుకో, నన్ను ఎంతగానో అసహ్యించుకునే నా తమ్ముడి నీ మాటకి గౌరవం ఇస్తాడు. వసంత్ ని ఒప్పించు బతకడం అంటూ జరిగితే అభిమన్యు భార్యగా బతుకుతా లేదంటే యశోధర్ మాజీ భార్యగా చనిపోతానని మాళవిక అంటుంది. బతుక్కి, చావుకి మధ్య 24 గంటలు మాత్రమే గడువు ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంది. వేద వసంత్ తో మాట్లాడటానికి వస్తుంది. మాళవిక రిక్వెస్ట్ కూడా ఆలోచించు పెళ్లి చేయమనే కదా నిన్ను ప్రాధేయపడుతుందని అంటుంది. ఇది ప్రాధేయపడటం కాదు చస్తాను అని బెదిరించడం వదిన నీ మాట నేను కాదనలేను కానీ అందుకు నా మనసాక్షి ఒప్పుకోవడం లేదని వసంత్ అంటాడు. యష్ కూడా వేద చెప్పిన మాట కరెక్ట్ కదా జరిగిందేదో జరిగిపోయింది గతాన్ని వదిలేద్దామని, మర్చిపోదామని అంటాడు.


Also Read: ఛీ ఛీ లాస్య చెత్త ఐడియా, చీవాట్లు తిన్న నందు- పెళ్లికి ఒకే చెప్పిన విక్రమ్


జరిగిన అవమానాలు మరచిపోవడం తన వల్ల కాదని వసంత్ అంటాడు. మాళవిక ఏం వదిలేసి వెళ్లిపోయిందని అవన్నీ నా దగ్గర ఉన్నాయి. మొదటి పెళ్లి పెటాకులు అయ్యింది. ఖుషికి మంచి అమ్మని తెచ్చాను. ఒక మంచి భార్యకి భర్తని అయ్యాను. గతాన్ని ఒక పీడకలలా వదిలేయాలి. మన అందరి కంటే వేదకి మాళవిక మీద కోపం ఉండాలి. మా పెళ్లి దగ్గర నుంచి మాళవిక కుట్రలు చేసింది అవన్నీ వేద తట్టుకుంది. అలాంటి వేద మాళవికకి ఒక అవకాశం ఇద్దామని చెప్పింది కదా ఇక మనకి అభ్యంతరం ఏంటని అంటాడు. మాళవిక కోసం ఎందుకు ఆలోచిస్తున్నావ్ అని వసంత్ అంటాడు. మాళవిక నా పిల్లల తల్లి తను అవమానాలు పడితే అది పిల్లల భవిష్యత్ మీద పడుతుంది. వెళ్ళి తనని ఇంటికి తీసుకురా పెళ్లి చేయ్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి రా తగ్గుదాం తప్పేముంది. వెళ్ళి తనని తీసుకొచ్చి పెళ్లి చెయ్యి ఇదే ఫైనల్ అని యష్ చెప్తాడు.