రాత్రికి రాత్రే జానకి కానిస్టేబుల్ పరీక్షలు రాసి పాస్ అయిపోయి పోలీస్ డ్రెస్ వేసుకుంటుంది. నెలరోజులు ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తుంది. ఇంట్లో వాళ్ళందరూ తనకి కంగ్రాట్స్ చెప్తారు. మల్లిక ఆఫీసర్ కాకపోయిన కానిస్టేబుల్ అయ్యావ్ కంగ్రాట్స్ అని వంకరగా చెప్తుంది. మోటార్ సైకిల్ అమ్ముకుని సైకిల్ పట్టుకొచ్చారు, ఈవీడేమో ఆఫీసర్ అని చెప్పి కానిస్టేబుల్ అయ్యిందని మనసులో నవ్వుకుంటుంది. రామ రోడ్డు మీద వెళ్తు తన భార్య జానకి కానిస్టేబుల్ అయ్యిందని కనిపించిన వాళ్ళందరికీ చెప్తూ సంబరపడతాడు. ఉద్యోగంలో చేరే మొదటి రోజని జానకి, రామ ముందుగా గుడికి వెళతారు. నా ప్రయాణం ఇక్కడితో ఆగకూడదు నాన్న, అత్తమామలు అనుకున్నట్టుగా ఐపీఎస్ ఆఫీసర్ కావాలి. దానికి ఇదే తొలి అడుగు కావాలని జానకి మనసులోనే దేవుడిని వేడుకుంటుంది.


Also Read: ఛీ ఛీ లాస్య చెత్త ఐడియా, చీవాట్లు తిన్న నందు- పెళ్లికి ఒకే చెప్పిన విక్రమ్


ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ లో జానకి డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంది. ఆ స్టేషన్ ఎస్సై చాలా స్ట్రిక్ట్. సెల్యూట్ సరిగా చేయలేదని అక్కడ కానిస్టేబుల్ దుంపతెంచుతాడు. అక్కడి కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ మీద పొరపాటున టీ పోసేస్తుంది. అది చూసి ఎస్సై కస్సుబుస్సులాడతాడు. అందుకే ఆడవాళ్ళని ఇలాంటి డిపార్ట్మెంట్ లోకి తీసుకురావద్దని అరుస్తాడు. ఆ మారాజుకి ఆడవాళ్ళు అంటే చిరాకు అనుకుంటా. అందరితో స్నేహంగా ఉండమని, ఎస్సైతో మంచిగా ఉండమని రామ సలహా ఇస్తాడు. భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుని పోలీస్ స్టేషన్ లోకి అడుగుపెడుతుంది. జానకి ఎస్సైకి సెల్యూట్ చేసి కొత్తగా జాయిన్ అవడానికి వచ్చినట్టు చెప్తుంది. అయితే స్టేషన్ లోకి కొత్త కానిస్టేబుల్ వచ్చిందని వెటకారంగా నవ్వుతాడు. అమ్మవారి గుడిలో దొంగతనం జరిగిందట, అక్కడే ఎమ్మెల్యే కూడా ఉన్నారని చెప్పి జానకిని కూడా ఎస్సై రమ్మని పిలుస్తాడు.


ఎమ్మెల్యేకి పబ్లిసిటీ ముఖ్యమని అందుకోసం ప్రజల తరఫున పోరాడుతున్నట్టు నటించాలని పీఏతో చెప్తాడు. అప్పుడే ఎస్సై జానకిని వెంటపెట్టుకుని వస్తాడు. పోలీసులు రాగానే ఎమ్మెల్యే కాస్త హడావుడి చేస్తాడు. జానకిని స్టేషన్ కి వెళ్ళమని చెప్పి ఎస్సై వెళ్ళిపోతాడు. ఎలా వెళ్తావ్ ఏంటి అని ఆడగకుండా అలా వెళ్లిపోయారు ఏంటని అనుకుంటూ ఉంటుంది. రోడ్డు మీద రామ బండి పక్కన ఉన్న మురికి గుంట ఉంటుంది అటువైపే ఎస్సై బండి వెళ్లడంతో మురికి నీళ్ళు బండి మీద పడతాయి. ఎవరో తెలియక రామ అరుస్తాడు. పోలీసులు అని తెలియక అన్నానని రామ చెప్తున్నా కూడా వినకుండా ఎస్సై అరుస్తాడు. పోలీసులు అయినా కూడా స్పీడుగా వెళ్ళడం తప్పు కదా అని రామ అనేసరికి ఎస్సై మనోహర్ తన కాలర్ పట్టుకుని గొడవ చేస్తాడు.


Also Read: వేద, యష్ రొమాంటిక్ మూమెంట్- తన తలకే గన్ గురిపెట్టుకున్న మాళవిక


జానకి స్టేషన్ కి వెళ్ళిన తరవాత అక్కడి కానిస్టేబుల్ ఎస్సైతో జాగ్రత్తగా ఉండమని ఆయనకి కోపం ఎక్కువని చెప్తాడు. ఆయన వచ్చేలోపు ఫైల్స్ అన్నీ సర్ది పెట్టమని అంటాడు. అమ్మవారి నగలు ఎవరు దొంగతనం చేశారా అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది. దొంగతనం చేసింది గుడిలో సెక్యూరిటీ గార్డ్ అని జానకి కనిపెట్టేస్తుంది.