గుప్పెడంతమనసు మార్చి 9 ఎపిసోడ్ 


వసుధార, రిషి, మినిస్టర్ ముగ్గురు కలిసి భోజనం చేస్తుండగా అప్పుడు మినిస్టర్ నాకు ఒక డౌట్ రిషి మీ ప్రేమ ఎప్పుడూ ఎలా మొదలయ్యింది అనడంతో రిషికి పొలమారుతుంది. 
మినిస్టర్: అవును రిషి ఆరోజు నువ్వు వసుధార మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వే తన భర్తని ఎందుకు చెప్పలేదు 
వసు: రిషి సారే చెప్పొద్దన్నారు సర్ 
మినిస్టర్:అదేంటి రిషి  అంత కంట్రోల్ లో పెట్టావా 
వసు:ఇప్పుడు కూడా మీ దగ్గరికి చెప్పకుండా తీసుకొచ్చారు. నేను షాపింగ్ కి తీసుకుని వెళతారు అనుకున్నాను.సరే ఇంటికి వెళ్ళేటప్పుడు షాపింగ్ కి వెళ్దామా
మినిస్టర్: తీసుకెళ్లు రిషి.. భార్య ని షాపింగ్ తి తీసుకెళ్లడం నీ బాధ్యత. అమ్మా వసుధార నువ్వు చదువులో టాపర్ వి అలాగే జీవితంలో కూడా మంచి భార్య వి అవుతావు అనడంతో వసుధార - రిషి ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు
భోజనం చేయడం అయిపోవడంతో మినిస్టర్ వసుధార, రిషి వాళ్ళ కోసం చిన్న గిఫ్ట్ ఇస్తాడు. బారసాల కన్నా మమ్మల్ని పిలవండని చెబుతాడు


Also Read: కొత్త దంపతుల తొలి అడుగు, శ్రీమతి - శ్రీవారు అంటూ మురిసిపోతున్న రిషిధార


మినిస్టర్ ఇంటి నుంచి బయలుదేరిన వసు-రిషి..కార్లో మౌనంగా ఉంటారు. మినిస్టర్ ఇంటిదగ్గర భార్య భర్తగా నటిద్దాం అన్న రిషి మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంది. ఆ తర్వాత కారు ఆపి ఓ దగ్గర కూర్చుంటారు
రిషి: ఈరోజు క్లైమేట్ బాగుంది..అయినా ఇంతకుముందు మనం చాలా సార్లు కలిసి ప్రయాణం చేశాం..అప్పటికి ఇప్పటికీ ఏదైనా తేడా ఉందా
వసుధార: తేడా ఉంది సార్ ఇన్నాళ్లు అసిస్టెంట్ గా వచ్చేదాన్ని ఇప్పుడు భార్యగా వచ్చాను కదా
రిషి: నీకు అలా అనిపించిందా
వసు: మనల్ని ప్రపంచమంతా భార్యాభర్తలు అనుకుంటుంది కదా సార్ 
రిషి: అనడంతో అనుకోవడం వేరు వాస్తవం వేరు .. నువ్వు నన్ను భర్తగా అనుకుంటున్నావు కానీ నేను నిన్ను భార్యగా అనుకోవాలి కదా 
వసుధార ఏమీ బాధగా మౌనంగా ఉండిపోతుంది
రిషి: నిజం ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు..మినిస్టర్ గారు పిలిచారు వెళ్లాం నటించాం, పాపం ఆయనకు నిజం తెలియదు. నాకు తాళి కట్టే అవకాశాన్ని లేకుండా చేశావు కదా . నీ విషయంలో నేను చాలా క్షమించాను చాలా ఓర్చుకున్నాను.
వసు: అవును సర్ కానీ మీరు ఎందుకు నన్ను ఈ ఒక్క విషయంలో ఇంతలా బాధ పెడుతున్నారు
రిషి: నీ పరిస్థితులు ఆరాటం అన్నీ నేను అర్థం చేసుకుంటాను ఒక్కసారి నా పరిస్థితి కూడా నువ్వు ఆలోచించి ఉండాల్సింది. ఈ గుండెకి అయిన గాయం ఎప్పుడూ మానుతుందో కదా


Also Read: మార్చి 9 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారి జీవితంలో అనుకూల మార్పులొస్తాయి


పూలు అమ్మే ఆవిడ అటుగా రావడంతో వసుధార ఆమె వైపు చూసి ఇప్పుడు రిషి సార్ నా కోసం పూలు కొంటారా అయినా ఈ పరిస్థితిలో అలా ఆలోచించడమే నా పొరపాటు అవుతుంది అనుకుంటుంది. అప్పుడు రిషి ఆమెను పిలిచి పూలు ఇవ్వు అనడంతో ఆమె వాళ్ళిద్దరి వైపు చూసి మీ ఇద్దరికీ పెళ్లి అయ్యిందా అనడంతో..
వసు: ఆయన మా వారే కానీ నేను ఆయన భార్యని కాదు
అప్పుడు ఆమె భర్తంటే ఎలా ఉండాలో గొప్పగా చెబుతుంది.  మీ ఇద్దరిని చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉన్నారు. ఈ మేడంని చాలా బాగా చూసుకోండి సారు రిషి: మరి నన్ను చూసుకోమని మీ మేడంకి చెప్పవా
పూలమ్మే వ్యక్తి: అయ్యో సారు భూమి మీద ఉన్న ప్రతి ఒక ఆడది భర్త దేవుడిలా భావిస్తుంది 
వసుధార కి రిషి పూలు ఇస్తాడు.. కింద పడుతుండగా పూలు తీసి మళ్లీ ఇస్తాడు..ఆ పూలు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వెళతారు..
రిషి: పక్క పక్కనే ఉన్నా మనిద్దరి మధ్య ఏదో మంచు తెర అడ్డుగా ఉన్నట్టు ఉంది వసుధార  అనుకుంటాడు
అప్పుడు వసు కారు దిగి వెళుతుండగా రిషి ఆగమని చెప్పి మినిస్టర్ ఇచ్చిన గిఫ్ట్ వసుధారకి ఇవ్వడంతో ఇది మనిద్దరికీ కదా సార్ అని అంటుంది. అప్పుడు రిషి నా ఉద్దేశంలో ఇవి మన గిఫ్ట్ లు కాదు. నువ్వు చేసిన పని వల్ల వచ్చిన గిఫ్టులు అని అంటాడు.