గుప్పెడంతమనసు మార్చి 8 ఎపిసోడ్ దేవయాని...రిషి కోసం ఎదురుచూస్తుంటుంది. ఫణీంద్ర: దేవయాని ఏంటి నీ ప్రాబ్లం దేవయాని: ప్లాబ్లెమ్ నాది కాదండి రిషిది ఫణీంద్ర: రిషి ప్రాబ్లం అయితే రిషి సాల్వ్ చేసుకుంటాడు మద్యలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవడందేవయాని: ఇదేనండి మీతో వచ్చిన సమస్య ఇంట్లో కాలేజీలో సమస్యలు ... కాలేజీలో ఇంట్లో సమస్యలు మాట్లాడుతారు అదేంటి అంటే నా నోరు మూయిస్తారు . అసలు మీకు రిషి గురించి బాధ్యత ఉందా ఫణీంద్ర: రిషి ఏమైనా చిన్న పిల్లవాడా ...దేవయాని: ఇన్నాళ్లు ఇవే మాటలు చెబుతూ వచ్చారు. ఆ వసుధార విషయంలో నేను ఎంత మొత్తుకున్నా కూడా వినలేదు. రిషి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అని దేవయాని అంటుందిఇంతలోనే అక్కడికి జగతి, మహేంద్ర వస్తారు. రిషి ఎక్కడికి వెళ్లాడని అడుగుతుంది.. ఏమో తెలియదు అంటారు... రిషి కచ్చితంగ ఆ వసుధార దగ్గరకే వెళ్లాడు అనుకుంటూ రుసరుసలాడుతుంది దేవయాని..
Also Read: అప్పుడే కోపం, అంతలోనే అలక, అంతులేని ప్రేమ - రిషిధార జీవితంలో ఎన్నిరంగులో!రిషి పసుధార కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార నార్మల్ గా రెడీ అయి వస్తుంది.. ఇలాంటి డ్రెస్ వేసుకున్నావేంటి అంటాడు రిషివసు: నేను రెగ్గులర్ గా ఇలాంటి డ్రెస్సే వేసుకుంటాను కదారిషి: బయటకు వెళుతున్నాం అని చెప్పానుకదా..మంచి డ్రెస్ వేసుకోవాలి కదావసు: ఎక్కడికో చెప్పలేదు కదా.. రిషి: ఇప్పుడు వాదించకు ఈ డ్రెస్ నాకు నచ్చలేదు.. నువ్వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని రా...వసు: డ్రెస్ ది ఏముంది మన వ్యక్తిత్వం మనకు ఉంటుంది కదారిషి: అన్నీ రెండు రోజులకో, రెండు వారాలకో, రెండు నెలలకో తెలిసే విషయాలు.. లుక్ చాలా ముఖ్యం.. వెళ్లి డ్రెస్ ఛేంజ్ చేసుకుని రావసు: నాడ్రెస్ గురించి కామెంట్ చేస్తున్నారు..మీ డ్రెస్ బావుంది అనుకుంటున్నారారిషి: నాకు కంఫర్ట్ గానే ఉంది..నేను చెప్పేది చెప్పాను నీ ఇష్టం అనేసి వెళ్లిపోతాడు
జగతికి కాల్ చేసిన వసుధార..ఏంటి మేడం మీ అబ్బాయి నాపై అధికారం చెలాయిస్తున్నారుజగతి: ఏంటి పొద్దున్నే కంప్లైట్స్ ఇస్తున్నావ్..కాల్ చేసి ఏమైనా అన్నాడావసు: ఎక్కడికో చెప్పరు..వేసుకున్న డ్రెస్ నచ్చలేదంటారు..అందరి ముందూ భార్య అంటారు..నాలుగు గోడల మధ్యా కాదంటారు..జగతి: నువ్వు రిషిని అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడుగుతావేంటి... రిషి ఎవ్వరిపైనా అధికారం చూపించడు, ఎవ్వర్నీ శాసించడు..నిన్ను శాసిస్తున్నాడంటే నీపై ప్రేమ పెరిగినట్టే కదా..సంతోషించాలి కానీ అలుగుతున్నావేంటివసు: తనకి నేను భార్యని కాదంటూ..అధికారం చూపిస్తే సంతోషించాలాజగతి: పరిస్థితులు బట్టి కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి
Also Read: ప్రేమ, క్షమ, ఆత్మాభిమానం, సహనానికి కేరాఫ్ - అందుకే యుగయుగాలకు ఆమె ఆదర్శం
ఆ తర్వాత రిషి వసుధార కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు వసుధార చీర కట్టుకుని రావడంతో రెప్పవేయకుండా చూస్తుంటాడు రిషి. అప్పుడు ఈ చీరని ఎక్కడో చూసినట్టు ఉంది అనడంతో...ఈ చీర నాకు పెళ్లికి గిఫ్ట్ గా వచ్చింది అనడంతో అప్పుడు మినిస్టర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు రిషి. ఆ తర్వాత ఇద్దరూ అక్కడినుంచి బయలుదేరుతారు. వసుధార: ఏంటి సార్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు చెప్పొచ్చు కదా . సార్ ఈ తాళిబొట్టు చూసినప్పుడు మీరు ఏమనుకుంటున్నారురిషి సమాధానం చెప్పకుండా కావాలనే పాటలు పెడతాడు.మరోవైపు జగతి మహేంద్ర ఇద్దరూ రిషి, వసుధారలు ఎక్కడికి వెళ్లి ఉంటారని ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ధరణి అక్కడికి వస్తుంది.
ఆ తర్వాత వసుధార,రిషి ఇద్దరు మినిస్టర్ ఇంటికి వెళ్లడంతో సార్ ఏంటి ఇక్కడికి వచ్చాం అని అడుగుతుంది. మినిస్టర్ గారు మన ఇద్దరినీ భోజనానికి రమ్మని చెప్పారు మనిద్దరం కొత్త దంపతులం కదా అంటాడు రిషి. అప్పుడు రిషి చేయందించి పదండి శ్రీమతి గారు అనడంతో..వసుధార నవ్వుతూ రిషి చేయిపట్టుకుని లోపలకు వెళుతుంది. మినిస్టర్ రిషిధారని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత ముగ్గురూ కలసి భోజనం చేస్తారు.