విక్రమ్ గురించి చెప్తూ రాముడు మంచి బాలుడు అన్నట్టు చూడచక్కగా ఉన్నాడని అనేసరికి తులసి దీర్ఘాలు తీస్తుంది. ఓహో నచ్చాడన్నమాట అని అంటుంది. పరాయి వాళ్ళ డబ్బు మన ఇంట్లో ఉండటం మంచిది కాదు ఇవి ఇచ్చేసి వీలైతే ఆ అబ్బాయిని ఇంటికి తీసుకురమ్మని తులసి చెప్తుంది. విక్రమ్ దివ్య గురించి ఆలోచిస్తూ ఉండగా తన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి ఎవరని అడుగుతాడు. దివ్య గొంతు మార్చి వెరైటీగా మాట్లాడి కాసేపు ఆటపట్టిస్తుంది. తరవాత తను దివ్యనని చెప్తుంది. కలవాలని లొకేషన్ పెడతాను రమ్మని చెప్పడంతో విక్రమ్ గాల్లో తేలిపోతూ ఉంటాడు. కథలోకి మరొక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. నందు తన ఫ్రెండ్ వాసుదేవ్ వస్తున్నాడని ఎగిరి గంతేస్తాడు. రాజయోగం రాబోతుందని నందు సంబరపడుతుంటే తులసి వచ్చి ఏమైంది దినఫలాలు ఏమైనా చూసుకున్నార అని గాలి తీసేస్తుంది.


Also Read: జానకికి అండగా నిలిచిన జ్ఞానంబ- సూటిపోటి మాటలతో హేళన చేసిన మల్లిక


తన ఫ్రెండ్ వాసుదేవ్ ఇండియా వస్తున్నట్టు తులసికి చెప్తాడు. వాడికి యూఎస్ లో మంచి బిజినెస్ ఉంది. ఇండియాలో దాన్ని ఎక్స్ పాండ్ చేద్దామని అనుకుంటున్నాడని ఆ బిజినెస్ డీల్ తనకే ఇస్తున్నాడని చెప్పి సంతోషపడతాడు. అది విని తులసి కూడా హ్యపీగా ఫీల్ అవుతుంది. వాసుదేవ్ మళ్ళీ ఫోన్ చేసి ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఇంటికే వస్తాను, నా చెల్లి తులసి మొహం చూసి నీతో బిజినెస్ డీల్ కుదుర్చుకుంటున్నా, తను నీ భార్య అవడం నీ అదృష్టమని అనేసరికి నందు తల పట్టుకుంటాడు. అదృష్టం చేతికి అందినట్టే అంది చేజారిపోతుందేమో తులసితో విడాకులు తీసుకున్న విషయం తెలియదు చెప్తే ఒక తంటా చెప్పకపోతే మరొక తంటానని ఆలోచనలో పడతాడు.


విక్రమ్ దివ్య రమ్మన్న కాఫీ షాప్ దగ్గరకి వచ్చి తన కోసం తెగ ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. మీ అమ్మానాన్నని వదిలేసి బాయ్ ఫ్రెండ్ తో అమెరికా వెళ్తున్నావంట కదా అని విక్రమ్ ఆ అమ్మాయిని అడుగుతాడు. అవును నా జీవితం గురించి ఆలోచించి వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తానని శిరీష చెప్పడంతో విక్రమ్ సీరియస్ అవుతాడు. తన మంచి కోసం చెప్తున్నా శిరీష వినిపించుకోకుండా ఉంటుంది. ఇప్పటికీ నీ మాయమాటలు వింటే జీవితం నాశనం అయిపోతుందని శిరీష అనే టైమ్ కి దివ్య వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. ఆ మాటలు విని దివ్య విక్రమ్ ఒక మోసగాడని అనుకుంటుంది. రాముడు అనుకున్న బొట్టు పెట్టుకున్న రావణాసురుడని తిట్టుకుంటుంది. శిరీష వెళ్లిపోగానే దివ్య వచ్చి కూర్చుంటుంది.


Also Read: కావ్యని పెళ్లిచేసుకుంటానన్న రాజ్- పెళ్ళికాకుండానే ఒక్కటైన రాహుల్, స్వప్న


దివ్యని చూడగానే విక్రమ్ మొహం వెలిగిపోతుంది. ఒక అమ్మాయి ఛీ కొట్టగానే మరొక అమ్మాయికి లైన్లో పెడుతున్నావా అని దివ్య ఇన్ డైరెక్ట్ గా తిడుతుంది. అమాయకమైన మొహం బొట్టు చూసి మంచి వాడివి అనుకున్నా, జిత్తుల మారి నక్క అనుకోలేదని అనేసరికి అదేంటి అలా మాట్లాడుతున్నారని విక్రమ్ అంటాడు. ఆడపిల్లల జీవితంతో ఆడుకున్న నీతో ఇంకెలా మాట్లాడతారని దివ్య సీరియస్ అయి డాబు ఇచ్చేసి మళ్ళీ కాల్ చేయవద్దని చెప్పి వెళ్ళిపోతుంది. దివ్య ఇంటికి వచ్చి కిచెన్ లో దూరి ఏదో వెతుకుతూ చిరాకుగా ఉండటం చూసి ఏమైందని తులసి అడుగుతుంది. రాముడు మంచి బాలుడు అన్నావ్ ఏమైందని అంటుంది. రావణాసురుడు అనబోయి రాముడు అన్నా అర్థం చేసుకోవాలని దివ్య కస్సుబుస్సులాడుతుంది.