రాజ్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని కావ్య తండ్రి కృష్ణమూర్తి, కనకం తనని బతిమలాడతారు. కానీ కావ్య మాత్రం రాజ్ అంటే ఇష్టం లేదని ఖరాఖండీగా చెప్పేసి వెళ్లిపోతుంటే రాజ్ వచ్చి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని అంటాడు. ఆ మాట విని కావ్య షాక్ అవుతుంది. అందరిలోనూ తన పరువు తీసినందుకు గాను రాజ్ కావ్య మెడలో మూడు ముళ్ళు వేసి తనమీద పగ తీర్చుకోవాలని అనుకోని తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ఉంటాడు.


గత వారం నుంచి బ్రహ్మముడి కథ అంతా రాజ్, స్వప్న పెళ్లి చుట్టూనే కొనసాగుతుంది. రాహుల్ కోసం స్వప్న వెళ్లిపోవడంతో తప్పని పరిస్థితుల్లో కావ్యని కనకం పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది. సోమవారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఖచ్చితంగా రాజ్ తాళి కట్టే టైమ్ కి కావ్య ముసుగు తీయడంతో అందరికీ స్వప్న లేదని తెలిసిపోతుంది. దీంతో కృష్ణమూర్తి అన్నీ నిజాలు బయటే పెట్టేస్తాడు. తాము అసలు కోటీశ్వరులం కాదని తన భార్య అబద్దాలు చెప్పిందని ఇందులో కావ్య తప్పేమీ లేదని తనని ఏమి అనొద్దని వేడుకుంటాడు. స్వప్న పెళ్లి ఇష్టం లేక లెటర్ రాసిపెట్టి వెళ్లిపోయిందని కనకం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. తనకి ఒక కొడుక్కి వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో తను చనిపోయాడని తన కూతుర్లకి ఆ పరిస్థితి రాకూడదని ఇలా డబ్బున్న వాళ్ళలాగా నటించానని కనకం ఏడుస్తూ చెప్తుంది.


Also read: లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- విక్రమ్ ని అపార్థం చేసుకున్న దివ్య


భార్య అబద్ధాలు ఆడుతుంటే చూస్తూ ఉన్నావని రాజ్ కుటుంబసభ్యులు కృష్ణమూర్తిని అందరూ మాటలు వింటారు. దీంతో కావ్య కోపంగా ఆపండి అని అరుస్తుంది. అక్కడే ఉన్న మీడియా వాళ్ళు కూతురి పెళ్లి చేయడం కోసం ఓ పేద తల్లి కష్టపడితే దాన్ని తప్పుపడుతున్నారు, దుగ్గిరాల కుటుంబంలో కూడా ఇలాంటివి జరుగుతాయా, పెళ్లి కూతురిది మాత్రమేనా తప్పు పెళ్లి కొడుకుది ఏమీ లేదా అని యాంకర్ అంటుంది. ఆ మాటలు విని రాజ్ తాతయ్య పడిపోబోతాడు. యాంకర్ వచ్చి ఈ పెళ్లి జరుగుతుందా అని రాజ్ ని అడగ్గా జరగదని ఈ మోసగత్తెని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని చెప్పేసి వెళ్లిపోతుంటే కనకం వాళ్ళని బతిమలాడుతుంది. అయినా వినిపించుకోకుండా మండపం నుంచి వెళ్లబోతుంటే కనకం గుండె పట్టుకుని బాధతో కుప్పకూలిపోతుంది. వెంటనే కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని చూసి ఏడుస్తుంది. రాజ్ కుటుంబం కూడా వెనక్కి వచ్చి కనకాన్ని చూసి కంగారుపడతారు.


రుద్రాణి వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని కూతురికి చెప్తుంది. అటు రాహుల్, స్వప్న ఒక గదిలో ఉంటారు. రాహుల్ తన దగ్గరకి వెళ్తే స్వప్న దూరం పెడుతుంది. తనని బుట్టలో వేసుకునేందుకు కుటుంబాన్ని, ప్రాణ స్నేహితుడి మోసం చేసి నీకోసం వచ్చానని బాధపడుతున్నట్టు నటిస్తాడు. ఆ మాటలకు స్వప్న బాధపడి తనని దగ్గరకి తీసుకుంటుంది. పెళ్లి తర్వాత జరగాల్సిన శోభనం అప్పుడే జరిగిపోయే స్వప్న జీవితం సర్వనాశనం.


Also Read: హోలీ సంబరాల్లో క్యూట్ కపుల్, గన్ తో హల్చల్ చేసిన మాళవిక- బయటపడిన వసంత్ గతం