జానకి ఐపీఎస్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు అందరూ బాధగా ఉంటారు. మలయాళం కూడా కిచెన్ లో కూర్చుని బాధపడుతూ ఉంటే మల్లిక వచ్చి పాయసం చేశావా ఆనందంలోనే కాదు బాధ్యలో కూడా తినొచ్చు అని గిన్నెకి వేసుకుని లాగించేస్తుంది. అప్పుడే గోవిందరాజులు వస్తాడు ఆయన రావడం చూసి పాయసం గిన్నె దాచి పెట్టేస్తుంది. బాగా తింటూ బాధపడుతున్నావ్ గా అని సెటైర్ వేస్తాడు. భోజనానికి అందరూ వస్తారు కానీ రామ, జానకి మాత్రం రాలేదని జ్ఞానంబ వాళ్ళ దగ్గరకి వెళ్తుంది. మధ్యాహ్నం కూడా ఏమి తినలేదని మలయాళం చెప్తాడు.
జ్ఞానంబ జానకి దగ్గరకి వచ్చి మాట్లాడుతుంది. పరీక్షలు బాగా రాయలేకపోయావ్ అంటే అది నీ తప్పు కాదు చదువుకోవడానికి అవకాశం కల్పించలేకపోవడం తమ తప్పు అని జ్ఞానంబ అంటుంది. నేనే ఇంకా బాగా చదవాల్సిందని జానకి బాధపడుతుంది. జరిగిన దాని గురించి బాధపడి లాభం ఏముందని జ్ఞానంబ అంటే చేతికి వచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకున్నానని జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఓడిపోవడం అంటే అదొక అనుభవం మళ్ళీ తప్పు చేయకుండా సాయం చేస్తుంది. జరిగింది తలుచుకుని తిండి మానేస్తే ఎలా ఆశయాల కోసం ఆకలిని చంపుకోకూడదు. ఒకసారి అవకాశం పోయిందంటే మరొక అవకాశం వస్తుంది. ఈసారి కాకపోయిన మరొకసారి పరీక్షలు రాసి పాస్ అవుతావు అండగా మేమున్నామని ధైర్యం చెప్పి భోజనానికి తీసుకెళ్తుంది.
Also Read: కావ్యని పెళ్లిచేసుకుంటానన్న రాజ్- పెళ్ళికాకుండానే ఒక్కటైన రాహుల్, స్వప్న
జానకి తినడానికి వచ్చి కూర్చుంటే ఇన్ డైరెక్ట్ గా మల్లిక సెటైర్లు వేస్తూ ఉంటుంది. వంకరగా మాట్లాడటం వల్ల జానకి మరింత బాధపడుతుంది. జానకి ఫెయిల్ అయినంత మాత్రాన తన చదువుకి విలువ తగ్గదు, మల్లిక నీ చదువుకి విలువ పెరగదని జ్ఞానంబ గడ్డి పెడుతుంది. జానకి నిద్రపోకుండా ఐపీఎస్ పుస్తకాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. జానకిని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదని రామ కూడా బాధపడతాడు. రామ రోడ్డు మీద వెళ్తుంటే ఊరి వాళ్ళు జానకి పాస్ అయ్యిందా అని ఫలితాలు వచ్చాయా అని అడుగుతారు. కానిస్టేబుల్ పరీక్షలు రాయవచ్చు కదా అని రోడ్డు మీద కనిపించిన కానిస్టేబుల్ సలహా ఇస్తాడు. వెంటనే ఈ విషయం జానకికి చెప్పి అప్లై చేయిస్తానని అంటాడు. జానకి ఒక్కతే కూర్చుని బాధపడుతుంటే అఖిల్, మల్లిక కావాలని తనని దెప్పిపొడిచేలా సూటిపోటి మాటలు అంటారు.
Also read: లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- విక్రమ్ ని అపార్థం చేసుకున్న దివ్య
మీ పెద్ద వదినకి ఏదో ఒకటి చేయాలి కదా అని మల్లిక అంటే తనకి ఉద్యోగం ఇప్పించేంత పెద్దవాడిని కాదని అంటాడు. మరి అయితే జానకి బావగారితో కలిసి స్వీట్ బండి తోసుకుంటూ బతకడమేనా అని దహేళన చేస్తుంది. జానకి అక్క అసలే బాధలో ఉంటే మీరేంటి ఇలా మాట్లాడతారని జెస్సి మల్లికని అంటుంది. మనం మీ వదిన మంచి కోసం మాట్లాడుతుంటే ఏంటి నీ భార్య ఇలా అంటుందని అఖిల్ ని రెచ్చగొడుతుంది. కానీ జెస్సి మాత్రం స్వీట్ బండి దగ్గర కూర్చుంటే తప్పేముంది, ఆ బండి ఇన్నాళ్ళూ కుటుంబాన్ని పోషించింది అఖిల్ ని చదివించింది అలాంటి దాని గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని గడ్డి పెడుతుంది.