పెళ్లి సంబంధం విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పంటావా అని దివ్య తల్లిని అడుగుతుంది. తల్లి జీవితం దగ్గర నుంచి చూసి మంచి నిర్ణయం తీసుకున్నావని తులసి కూతుర్ని మెచ్చుకుంటుంది. పెళ్ళాం అంటే కేవలం పిల్లల్ని కానీ సంసారం చూసుకునేదే అని అనుకుంటున్నాడని దివ్య చెప్తుంది. కాలం మారుతున్న కొంతమంది మగాళ్లు అలాగే ఆలోచిస్తున్నారని కాసేపు తులసి తన జీవితానుభవాలు చెప్పుకొస్తుంది. పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యిందని లాస్య రగిలిపోతూ ఉంటుంది. నందు వచ్చి లాస్యని తిడుతూ తులసిని వెనకేసుకొస్తాడు. ఎవరినో నమ్మించి ఎవరి దగ్గరో మార్కులు కొట్టేయడానికి తులసి అబద్ధాలు ఆడదు, పాతికేళ్లు తనతో కాపురం చేసిన వాడినని అంటాడు. అయితే మరొక పాతికేళ్లు కాపురం చేయకపోయావా ఎందుకు విడాకులు తీసుకున్నావ్ అని లాస్య అరుస్తుంది.


Also Read: భార్యభర్తలుగా రిషిధార కొత్త ప్రయాణం ఎటువైపు- ప్రేమ జ్ఞాపకాల్లో తేలిపోతున్న వసు


పెళ్లి కొడుకు ప్రవర్తన దివ్యకి నచ్చలేదు అందుకే వద్దని చెప్పిందని నందు లాస్యకి నచ్చ జెప్పడానికి చూస్తాడు. ఒకప్పుడు ప్రేమ్ విషయంలో ఇలాంటి తప్పు చేయబోయాను మళ్ళీ దివ్య విషయంలో చేయదలుచుకోలేదని నందు కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. తులసి చేతులతోనే దివ్య జీవితం నాశనం అయ్యేలా చేస్తాను అప్పుడు ఈ లాస్య పగబడితే ఎలా ఉంటుందో చూస్తారని అనుకుంటుంది. విక్రమ్ దివ్య ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. ఏదో ఊహల్లో తేలిపోతున్నావ్ ఎవరి గురించి తెగ ఆలోచిస్తున్నావని బసవయ్య అడుగుతాడు. ఒక అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేయాలని విక్రమ్ తన మావయ్యని అడుగుతాడు. కాఫీలు తాగి చేయి చేయి పట్టుకుని అని బసవయ్య అనేసరికి విక్రమ్ చాలులే అని వెళ్ళిపోతాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరని బసవయ్య అడుగుతాడు. మన హాస్పిటల్ లో అమ్మాయి డాక్టర్ అమ్మ సెలెక్ట్ చేసిందని అంటాడు.


దివ్య మళ్ళీ విక్రమ్ కి ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ టేబుల్ మీద ఉండటంతో బసవయ్య లిఫ్ట్ చేస్తాడు. కాసేపు తిక్క తిక్కగా మాట్లాడి దివ్య మైండ్ తినేస్తాడు. తులసిం దివ్య రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే పెళ్లికొడుకు అజయ్ ఎదురుపడతాడు. తులసి అతనికి సోరి చెప్తుంది. ఎందుకు ఎవరదిగారు అని రూడ్ గా మాట్లాడతాడు. అయినా మీ అమ్మాయి ఏమైనా ఎలిజబెత్ రాణి అనుకుంటున్నారా? అని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. పెళ్ళానికి డీవోర్స్ ఇచ్చేసి తలనొప్పి వదిలించుకున్నా, ఈ లాస్య వచ్చి మా డాడ్ మైండ్ పొల్యూట్ చేసింది, మంచి అమ్మాయి మంచి సంబంధమని చెప్పిందని చెప్పేసరికి డాడీ సరే అని చెప్పారని అజయ్ అంటాడు. మీకు ముందే పెళ్లి అయ్యిందా అని తులసి ఆశ్చర్యంగా అడుగుతుంది. అయ్యింది కాబట్టే రెండో సంబంధం కాబట్టి మీకు ఒకే చెప్పాను లేదంటే మీరు మా ఆస్తి అంతస్తుల్లో మా కాలిగోటికి కూడా సరిపోవని అంటాడు. దివ్య అజయ్ మీద అరుస్తుంది.


Also Read: భ్రమరాంబిక స్కెచ్, మాళవిక ఔట్- ఆగిపోయిన వసంత్, చిత్రల పెళ్లి


అసలు సంబంధం క్యాన్సిల్ అయినప్పుడే మీ లాస్య చెంప పగలగొడదామని అనుకున్నానని చెప్తాడు. పొరపాటున నా కూతురు గొంతుకోసినట్టు అయ్యేదని తులసి అంటుంది. మొదటి పెళ్లి సంబంధం దాచిపెట్టారు కాబట్టే మీవెంట లాస్య పడిందని తులసి అంటే తనకి అంతా తెలుసు మా నాన్న ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తానని అనేసరికి పెళ్లి చూపుల దాకా తీసుకొచ్చింది ఆ లాస్యని వదిలిపెట్టేది లేదని అజయ్ కోపంగా అంటాడు. నిజం తెలుసుకున్న తులసి ఆవేశంగా ఇంటికి వచ్చి లాస్యని గట్టిగా అరిచి పిలుస్తుంది. దివ్య నీ కన్నకూతురి అయితే ఇలాగే చేసేదానివా? నిజాన్ని దాచిపెట్టి దివ్యని రెండో పెళ్లి వాడికి అంట గట్టాలని చూసిందని తులసి చెప్తుంది. పెళ్ళే కాదు డివోర్స్ కూడా అయ్యిందని దివ్య చెప్తుంది. నిజమేనా అని నందు సీరియస్ అవుతాడు. ఇదేమన్నా మన ఇంట్లో కొత్త మీ అమ్మకి నాన్న ప్రవర్తన నచ్చలేదు డివోర్స్ ఇచ్చాడు ఇందులో తప్పేముంది. దీన్ని ఎందుకు బూతద్దంలో పెట్టి చూస్తున్నారని మాట్లాడుతుంది.