బ్యాండ్ మేళం వాయిస్తు యష్ ఫుల్ సరదాగా వసంత్, చిత్ర వాళ్ళని రిజిస్ట్రార్ ఆఫీస్ కి తీసుకుని వస్తాడు. అందరూ డాన్స్ వేస్తూ సంతోషంగా లోపలికి వెళతారు. విన్నీకి కూడా ఒక అమ్మాయిని చూస్తే ఒక పని అయిపోతుందని యష్ అంటాడు. అప్పుడే నాకు పెళ్లి ఏంటని అనేసరికి యష్ కోపంగా తిట్టుకుంటాడు. పెళ్లి చేసే అతను అగ్రహారం బ్యాచ్ అంటూ కాసేపు సోది పెట్టేస్తారు. పెళ్లికి ఏదైనా అబజక్షన్ ఏమైనా ఉంటే చెప్పమని నోటీస్ బోర్డులో కూడా పెట్టాము ఎటువంటి లీగల్ ఆబ్జెక్షన్స్ కూడా రాలేదని చెప్తాడు. అటు భ్రమరాంబిక పంతులను పిలిపించి ఇద్దరి జాతకాలు చూశారు కదా ఎలా ఉన్నాయని అంటుంది. మాళవిక, అభిమన్యుని పిలిపించి కూర్చోబెడుతుంది.


ఒకరికోసం ఒకరు పుట్టారు అన్నట్టు జాతకాలు ఉన్నాయని పంతులు చెప్తాడు. మరి అయితే వీళ్ళకి ఇంతవరకు పెళ్లి కాకపోవడానికి రీజన్ ఏంటని భ్రమరాంబిక అడుగుతుంది. పెళ్లి కాకుండా అబ్బాయి అమ్మాయి ఒకే ఇంట్లో ఉండకూడదు అది అశుభమని పంతులు అంటాడు. ఇందుకు పరిష్కారం ఏమీ లేదా అని అభి అంటే ఉంది మీరు ముందు ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవాలి. పెళ్లి అయ్యే వరకు ఈ ఇంటికి దూరంగా ఉండాలని అనేసరికి మాళవిక షాక్ అవుతుంది. అభి లోలోపల సంతోషపడుతూనే బయటకి మాత్రం మాళవిక ఈ ఇంటికి దూరంగా ఉండటానికి వీల్లేదని అంటాడు. అందుకు నేను ఒప్పుకుంటాను ఆరేళ్లుగా మనం కలిసి ఉంటున్నాం పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఏదో ఒక అవాంతరం వస్తుంది, నాకు నీతో పెళ్లి ముఖ్యమని మాళవిక చెప్తుంది.


Also Read: ఐపీఎస్ అయిపోయిన జానకి, పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్న కుటుంబం- మల్లిక కల నిజమయ్యేనా


పంతులు: ఈ ఇంట్లో నుంచి వెళ్ళడానికి మీరు సిద్ధపడ్డా సరే శాస్త్రం ప్రకారం మీ పుట్టింటి వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్లడానికి రావాలి. మీకు రక్తసంబంధీకులు ఎవరైనా ఉన్నారా?


భ్రమరాంబిక: అందరినీ వదులుకునే కదా వచ్చింది


మాళవిక: నాకు రక్తసంబంధీకులు ఉన్నారు నేను ఎవరూ లేని అనాథని కాదు


పంతులు: పెళ్లి అయ్యేదాక నిన్ను ఈ ఇంటి నుంచి అక్కడికి తీసుకెళ్లడానికి ఎవరైనా వస్తారా


మాళవిక వస్తారని చెప్పేసరికి అభి షాక్ అవుతాడు. రిజిస్ట్రార్ లీగల్ ఆబ్జెక్షన్స్ ఏమి లేవు కదా అని అంటారు లేవని చెప్పేసరికి ఇద్దరినీ సంతకాలు పెట్టమని చెప్తారు. ముందు దండలు మార్చుకోమని సులోచన వాటిని ఇస్తుంది. అప్పుడే ఒక లాయర్ వచ్చి పెళ్లి అపమని అంటాడు. ఈ పెళ్లికి లీగల్ అబ్జక్షన్ ఉందని లాయర్ చెప్తాడు. పేపర్స్ చూసిన రిజిస్టర్ ఈ పెళ్లి జరిపించలేనని చెప్తాడు. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. ఈ లాయర్ ఎవరి తరపు వచ్చాడు, ఎవరు ఈ పెళ్లి అడ్డుకుందని యష్ అంటుంటే నేనే అని మాళవిక ఎంట్రీ ఇస్తుంది.


Also Read: లాస్య కుట్ర తెలిసి తులసి ఉగ్రరూపం- లిమిట్స్ లో ఉండమంటూ దివ్య స్ట్రాంగ్ వార్నింగ్


ఈ పెళ్లిని అడ్డుపడతానికి నీకేం హక్కు ఉందని వేద మాళవికని ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ఆడగాల్సింది నన్ను కాదు యష్ ని అని తనని చూపిస్తుంది. ఏ చట్టం ప్రకారం నీ చెల్లి పెళ్లి చేస్తావో చూస్తాను చెయ్యి అని మాళవిక సవాలు విసురుతుంది. నేను ఇంత మాట్లాడుతున్నా ఎందుకు తను మాట్లాడటం లేదో అడుగు, ఈ పెళ్లి జరగకుండా ఎందుకు ఆపానో అడుగు అనేసరికి వసంత్ కోపంగా తన దగ్గరకి వెళ్తుంటే యష్ ఆపుతాడు. మాళవిక నవ్వుతూ వెళ్ళిపోతుంది. పెళ్లి ఆగిపోవడంతో చిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వసంత్ ఎందుకు ఇలా చేశాడు మాట్లాడకుండా మౌనంగా ఎందుకు ఉన్నాడని వేద వాళ్ళ అక్క అంటుంది. మాళవికకి ఈ పెళ్లికి సంబంధం ఏంటని వేద యష్ ని నిలదీస్తుంది.