నందు ఇంటికి తన ఫ్రెండ్ శరత్ కొడుకుని తీసుకుని పెళ్లి చూపులకు వస్తాడు. పెళ్లి కొడుకు ఎవరితో మాట్లాడకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే తులసి దివ్యని తీసుకుని వస్తుంది. అబ్బాయి అమ్మాయి మీద ఒక లుక్ వేసి మళ్ళీ ఫోన్లో మునిగిపోతాడు. వాళ్ళు ఒప్పుకుంటే వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందామని శరత్ తల్లి అంటుంది. దివ్య పెళ్లి కొడుకుని గమనిస్తూనే ఉంటుంది. లాస్య డబ్బా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. దివ్య, తను ఫ్రెండ్స్ లాగా ఉంటామని చెప్తుంది. అబ్బాయితో విడిగా మాట్లాడాలని దివ్య అంటుంది లాస్య ఎందుకు అందరి ముందే మాట్లాడొచ్చుగా అనేస్తుంది. నీకేమైన అభ్యంతరమా అని తులసి అనేసరికి మగాడిని నాకేం ఇబ్బందని అంటాడు. కానీ తులసికి మాత్రం అబ్బాయి ప్రవర్తన తేడాగానే అనిపిస్తుంది.


Also Read: తాళి కట్టే టైమ్‌కి ముసుగుతీసేసిన కావ్య - అప్పు నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిన స్వప్న


పెళ్లి తర్వాత భార్యకి ఇచ్చే స్థానం ఏంటని దివ్య అబ్బాయిని అడుగుతుంది. పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకుంటే చాలు భర్తగా సంపాదిస్తానని అంటాడు. అబ్బాయి అమ్మాయికి ఒకే చెప్తాడు. కానీ దివ్య మాత్రం తనకి ఒకే కాదని, ఈ సంబంధం తనకి ఇష్టం లేదని చెప్పేస్తుంది. లాస్య తను జోక్ గా అంటుందని కవర్ చేస్తుంది కానీ దివ్య మాత్రం చేసుకోనని చెప్పేస్తుంది. భార్యకి సరైన స్థానం ఇవ్వలేని వాడికి జీవితాన్ని తాకట్టు పెట్టలేనని, వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నా ఫోన్ నే ఎక్కువగా చూస్తూ ఉన్నాడు. అతనితో తన అభిప్రాయాలు మ్యాచ్ కావని వెళ్లిపొమ్మని చెప్తుంది. ఆ మాటకి శరత్ వాళ్ళు కోపంగా వెళ్లిపోతారు లాస్య మాట్లాడేందుకు ట్రై చేస్తున్న వినిపించుకోరు. అలా ఓపెన్ గా కామెంట్ చేయాల్సింది కాదేమోనని నందు అంటాడు. కావాలని తులసిని చెడగొట్టిందని లాస్య అరుస్తుంది.


ప్రతిదానికి తన మీద పడి ఎందుకు ఏడుస్తావ్ అని తులసి అంటుంది. సంబంధం నా ద్వారా వచ్చిందని కావాలని చెడగొట్టావ్, నువ్వు చెడగొట్టింది సంబంధాన్ని కాదు దివ్య జీవితాన్ని అని లాస్య అరుస్తుంది. ‘ఇక ఆపుతారా? నాకు ఇష్టం లేకపోయినా మీ మీద గౌరవంతో కూర్చున్నా నాకు ఆ అబ్బాయి అభిప్రాయాలు నచ్చలేదు అందుకే రిజెక్ట్ చేశాను నీ లిమిట్స్ లో నువ్వు ఉండు నువ్వు కేవలం మా నాన్నకి భార్యవి మాత్రమే నాకు తల్లివి కాదు అది నీ వల్ల కాదు అందుకు నేను ఒప్పుకోను’ అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రాజ్యలక్ష్మి కొత్త హాస్పిటల్ కట్టించే వ్యక్తిని ఇంటికి పిలిచి మాట్లాడుతుంది. ఇంట్లో అందరం కలిసి భోజనం చేసే అలవాటు ఉందని అతని ముందు విక్రమ్ గురించి గొప్పగా చెప్తుంది. విక్రమ్ తాతయ్య మాత్రం కొడుకు గురించి బాధపడతాడు. భార్య ఉన్న పట్టించుకోకుండా ఉంటుందని అతని ముందే తిడుతుంది. విక్రమ్ తినడానికి వచ్చి అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే తను మాత్రం నేల మీద కూర్చుంటాడు.


Also Read: ఏడిపించేసిన జ్ఞానంబ, తన కిడ్నీ ఇచ్చి భార్యను బతికించుకున్న గోవిందరాజులు


మీ నాన్న గురించి ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరు. నీకు మీ అమ్మ అంటే ప్రేమ ఉండవచ్చు కానీ గుడ్డి ప్రేమ కాదని పెద్దాయన అనేసరికి రాజ్యలక్ష్మి కావాలని అక్కడి నుంచి వెళ్లిపోతూ తాతయ్య మాటల గురించి ఆలోచించమని వెళ్ళిపోతుంది. తల్లి అలా వెళ్లిపోవడంతో విక్రమ్ బయట మనుషుల ముందు అమ్మని బాధపెడతావా అని తాతయ్య మీద కోప్పడతాడు. దివ్య వచ్చి తులసి సోరి చెప్తుంది. లాస్య మాటలు సీరియస్ గా తీసుకుంటే ఈ ఇంట్లో ఉండగలిగే దాన్ని కాదని తులసి నచ్చజెప్తుంది.