ముహూర్తాలు చూడకుండా ఈ ఏర్పాట్లు ఏంటని గోవిందరాజులు జ్ఞానంబని ప్రశ్నిస్తాడు. రోజులు దగ్గర పడే కొద్ది బాధ్యతలు తీర్చుకోవాలని జ్ఞానంబ అంటుంది. అసలు ఏమైంది ఉన్నట్టుండి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కంగారు పడతాడు. వెన్నెలకి పెళ్లి చేయాలని మంచి సంబంధం చూసినట్టు పెళ్లి చూపులకి వాళ్ళు వస్తున్నట్టు చెప్తుంది. జానకి పాల గ్లాసుతో శోభనం గదిలోకి అడుగుపెడుతుంది. ఎందుకు అమ్మ ఇలా చేస్తుందని రామ బాధపడతాడు. అమ్మ ప్రాణాలు పోతాయని తెలిసి మనం ఎలా ఆనందంగా ఉంటామని ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. గోవిందరాజులు జ్ఞానంబ మాటలు గుర్తుచేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. జ్ఞానంబ దేవుడి ముందు నిలబడి దణ్ణం పెట్టుకుంటూ ఉండగా నడుము నొప్పి వచ్చి కుప్పకూలిపోతుంది.


Also Read: పెళ్లివాళ్ళని వెళ్లిపొమ్మని చెప్పిన దివ్య - తులసి వల్లే ఇదంతా జరిగిందంటూ లాస్య గొడవ


అందరూ పరుగున వచ్చి జ్ఞానంబని చూసి కంగారుపడతారు. హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. ఇప్పటికే ఆలస్యం చేశారని వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలని డాక్టర్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయమని జానకి చెప్తుంది. ఆపరేషన్ ఏంటి కిడ్నీ ఏంటని గోవిందరాజులు అడుగుతాడు. అమ్మకి ఏమైందని విష్ణు, అఖిల్ కూడా బాధగా అడుగుతారు. అమ్మకి కిడ్నీ పాడైపోయింది, తనకి తెలిసినా మనకి చెప్పనివ్వలేదని రామ జరిగింది మొత్తం చెప్తాడు. అది విని గోవిందరాజులు గుండె పగిలేలా ఏడుస్తాడు. అమ్మని ఎలాగైనా కాపాడుకుందామని విష్ణు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ప్రాణం పోయే పరిస్థితిలో తన భార్య ఉందని అమ్మ దూరం అయితే నాన్న కూడా ఉండడని గోవిందరాజులు చాలా ఎమోషనల్ అవుతాడు. అత్తయ్యకి తన కిడ్నీ ఇచ్చి కాపాడుకుంటామని చెప్తుంది. డాక్టర్ వచ్చి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ జరగాలని డాక్టర్ చెప్పడంతో జానకి కిడ్నీ ఇస్తానని చెప్తుంది.


అత్తయ్య కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని గోవిందరాజులు అంటాడు. కుటుంబం కోసం నేను చేస్తానని జానకి అంటుంది. విష్ణు కూడా వద్దు కొడుకులం మేము ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నామని అంటాడు కానీ జానకి మాత్రం వినిపించుకోదు. తమ కోసం ఇంత త్యాగం చేయవద్దని గోవిందరాజులు అంటే మీకోసం కాదు మనకోసమని చెప్పి వెళ్ళిపోతుంది. డాక్టర్లు ఆపరేషన్ చేసి జానకి కిడ్నీ జ్ఞానంబకి పెడతారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పేసరికి అందరూ సంతోషిస్తారు. జ్ఞానంబ కళ్ళు తెరవగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. జానకి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది తన జీవితాన్ని త్యాగం చేసిందని ఎమోషనల్ అవుతుంది. జానకి వచ్చి కిడ్నీ ఇచ్చింది తను కాదని గోవిందరాజులు ఇచ్చాడని చెప్తుంది. తన కోసం ఇంత పని చేశారా అని జ్ఞానంబ ఎమోషనల్ అవుతుంది.


Also Read: మళ్ళీ మొదటికొచ్చిన రిషిధార ప్రేమ- జరిగింది తలుచుకుని రగిలిపోతున్న దేవయాని


జానకి తన ఐపీఎస్ లక్ష్యం కూడా వదులుకుని నీకోసం తన జీవితాన్ని త్యాగం చేయాలని అనుకుందని గోవిందరాజులు అంటాడు. ఎవరు ఏమనుకున్నా భర్తకి అండగా నిలిచి రాముడిని కష్టపడేలా చేసింది, కోపాన్ని కూడా ప్రేమగా చూసింది. నీ కోపాన్ని కూడా ప్రేమగా భావించింది. ఎదుటి వాళ్ళ కోపాన్ని కూడా అర్థం చేసుకునే సంస్కారం ఎంతమందికి ఉంటుంది. నిజంగా జానకి చాలా గొప్పదని అంటాడు. అత్తయ్యకి కదినీ ఇచ్చి కాపాడింది మీరు ఇందులో తన గొప్ప ఏమి లేదని జానకి అంటుంది.