బావగారు నర్స్ ని కాదు కిస్ చేయాలని అనుకోలేదు నిన్నే అని చిత్ర చెప్పేసరికి వేద నవ్వుతుంది. కాసేపు అందరూ కలిసి వేదని ఆట పట్టిస్తారు. యష్ కూడ హాస్పిటల్ లో జరిగిందే గుర్తు చేసుకుని తిట్టుకుంటాడు. ‘వేద అనుకుని సిస్టర్ కి ముద్దు పెట్టడం ఏంటి తప్పు కదా? తనేమీ పరాయిది కాదు కదా నా భార్యే కదా ఇంక ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నా. పెళ్లై ఇన్నాళ్ళూ అవుతుంటే ముద్దు కూడా పెట్టకపోవడం ఏంటని’ అనుకుంటూ ఉండగా ఖుషి వచ్చి ఏంటి టెన్షన్ లో ఉన్నారని అడుగుతుంది. తనకి ఎవరో కిస్ ఛాలెంజ్ చేశారని చెప్పి కూతురికి ముద్దు పెట్టి తర్వాత ఎవరికి పెట్టాలో వాళ్ళని తీసుకుని రా అని చెప్తుంది. ఖుషి వెళ్ళి వేదని తీసుకొస్తుంది అనుకుంటాడు కానీ కాంచనని తెస్తుంది. తనని చూసి బిక్కమొహం వేస్తాడు. ఏం చేయాలో తెలియక చైల్డ్ హుడ్ గుర్తుకు వచ్చింది అందుకే నువ్వు చాక్లెట్ ఇవ్వకపోయినా కిస్ పెట్టేస్తానని పెట్టేసరికి యష్ బాగానే ఉన్నావా ఏదో తేడాగా కనిపిస్తున్నావని అంటుంది.


Also Read: రామ, జానకికి ఫస్ట్ నైట్- జ్ఞానంబ ప్రవర్తనపై అనుమానపడిన గోవిందరాజులు


పెళ్ళానికి ముద్దు పెట్టడం కోసం తెగ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏ మొగుడు కూడా పెళ్ళానికి ముద్దు పెట్టడానికి ఇన్ని తిప్పలు పడడు  ఏమో పాపం యష్. ఖుషి వచ్చి వేదని తీసుకెళ్తుంది. ఎందుకు తీసుకొచ్చావ్ ఖుషి అని వేద అడిగేసరికి డాడీ ఇప్పుడు నిన్ను కిస్ చేస్తారని చెప్పేసరికి యష్ బిత్తరపోతాడు. డాడీ కిస్ ఛాలెంజ్ లో ఉన్నాడు అందరికీ కిస్ పెడుతున్నాడని ఇప్పుడు నీకు అని చెప్తుంది. అవసరమా ఇదంతా అని వేద అంటుంటే యష్ తల అడ్డదిడ్డంగా ఊపుతూ ఉంటాడు. డాడీ మమ్మీని కిస్ చేయాల్సిందేనని ఖుషి మొండిపట్టు పడుతుంది. ఇద్దరినీ దగ్గరకి లాగేస్తుంది. యష్ భార్యకి ప్రేమగా తనివితీరా ముద్దు పెట్టేస్తాడు. డాడీ మమ్మీని కిస్ చేశాడు ఈ విషయం అందరికీ చెప్పాలని ఖుషి సంతోషంగా వెళ్ళిపోతుంది. వేద తెగ సిగ్గుపడిపోతుంది.


సులోచన, మాలిని కుటుంబాలని ఒకచోట కూర్చోబెట్టి వసంత్, చిత్ర పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటునట్టు వసంత్ చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఇంతమంది ఉండగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని అంటారు. తను అనాథనే అని చిత్ర అంటుంది. ‘అమ్మానాన్న ఎవరో తెలియని అనాథని నేను. పెద్దమ్మ పెదనాన్న చేరదీసి వాళ్ళ కూతుర్లతో పాటు నాకు స్థానం ఇచ్చారు. మా చెల్లెలి బిడ్డ అని గౌరవం ఇచ్చి పెంచుకున్నారు. అందరూ ణను ఎంత ప్రేమగా చూసుకున్నారు అంటే నేను అనాథ అనే విషయం మర్చిపోయే విధంగా చూసుకున్నారు. నా పెళ్లికి చేసే ఖర్చు ఏదైనా అనాథ ఆశ్రమానికి డొనేట్ చేద్దామని’ అనుకుంటునట్టు చెప్పేసరికి ఇంట్లో అందరూ తనని మెచ్చుకుంటారు.


Also Read: రాజ్యలక్ష్మి మొసలి కన్నీరు నమ్మేసిన విక్రమ్- పెళ్లి చూపులకు రెడీ అయిపోయిన దివ్య


వసంత్ తన గురించి నిజం బయట పెట్టబోతుంటే యష్ కోపంగా అడ్డు పడతాడు. రిజిస్టర్ మ్యారేజ్ వరకు మీ ఇష్టం తర్వాత రిసెప్షన్ మా ఇష్టమని వేద చెప్తుంది. పెళ్లి బాజాలు పెట్టుకుని ఎగురుతూ డాన్స్ వేసుకుంటూ సంబరంగా పెళ్లి చేసుకోవడానికి వస్తారు. కానీ..