దివ్య విక్రమ్ కి డబ్బులు తిరిగి ఇద్దామని బయటకి వెళ్తుంది కానీ అప్పటికే వెళ్ళిపోతాడు. తర్వాత ఎలాగైనా తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అనుకుంటుంది. విక్రమ్ దివ్య ఊహాల్లోనే ఇంట్లోకి వెళతాడు. ఇంట్లో రాజ్యలక్ష్మి దిగాలుగా కూర్చోవడం చూసి కంగారుపడతాడు. ఏమైందని అడుగుతాడు. విక్రమ్ ఏదో తప్పు చేశాడని అన్నట్టు బసవయ్య మాట్లాడతాడు. విక్రమ్ ని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదని రాజ్యలక్ష్మి అంటుంది. ఏమి కాలేదని కొడుకు ముందు డ్రామా వేస్తుంది. క్యారేజ్ తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళావ్ మరి ఇచ్చావా అని బసవయ్య అడుగుతాడు. వెళ్ళాను కానీ ఇవ్వడం మర్చిపోయాను అనేసరికి అమ్మని కూడా మర్చిపోతావేమో అని ఎమోషనల్ గా బిస్కెట్స్ వేస్తుంది.


Also Read: 'నేను నీ భర్తనే కానీ నువ్వు నా భార్యవి కాదన్న' ఇగో మాస్టర్, లాజిక్ అదిరిపోయింది- దేవయానికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్


అమ్మ మీద ప్రేమ తగ్గిపోతుందని తను భయపడుతుందని బసవయ్య అంటాడు. అమ్మని కానీ అమ్మని కదా భయంగా ఉందని ఎక్కడ ఈ అమ్మని మర్చిపోతావేమోనని మాయమాటలు చెప్తూ విక్రమ్ ని తన చేజారిపోకుండా మాట్లాడుతుంది. తల్లి మాటలు నిజమని నమ్మిన విక్రమ్ తనకి క్షమాపణలు చెప్తాడు. ‘నువ్వు నా మనసుని పంచుకుని పుట్టిన బిడ్డవి. సంజయ్ కేవలం కడుపున మాత్రమే పుట్టాడు. నాకు నీ తర్వాతే వాడు. నీ ప్రేమలో అభిమానం కనిపిస్తుంది. వాడి ప్రేమలో పంతం కనిపిస్తుందని’ తిలోత్తమ అంటుంది. బాధపెట్టినందుకు క్షమించమని అడుగుతాడు. దివ్య వర్క్ చేసుకుంటూ విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరో ఆ పిచ్చోడు తను చేయని తప్పుకు నాతో మాటలు పడ్డాడు, పైగా రెండు లక్షలు ఇచ్చేసి వెళ్లిపోయాదని అనుకుంటుంది.


అప్పుడే తులసి దివ్య దగ్గరకి వస్తుంది. పొద్దున అంటే తప్పించుకున్నావ్ ఇప్పుడు ఎక్కడికి పొతావ్ దివ్య పెళ్లి గోల నుంచి ఎలా తప్పించుకోవాలని అనుకుంటుంది. లాస్య ఆంటీ పెళ్లి సంబంధం గురించి చెప్తుంటే మౌనంగా ఉన్నావ్ ఎందుకలా అని దివ్య అంటుంది. కూతురికి పెళ్లి చేసి పంపడం భారం దించుకోవడం అనుకోరు బాధ్యత అనుకుంటారని చెప్తుంది. చదువు లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో నీ లైఫ్ నాకు ఎగ్జాంపుల్ మరి నువ్వే నాకు పెళ్లి చేసుకోమని ఎందుకు తొందర పడుతున్నావని దివ్య అడుగుతుంది. పెళ్లి కోసం కాదు పెళ్లి చూపుల కోసం ఒప్పించడానికి వచ్చాను. పెళ్లి కొడుకు నాన్న ఫ్రెండ్ కొడుకు ఒప్పుకో నాన్న పరువు పోతుందని బతిమలాడుతుంది. నాన్న పరువు కాపాడతాలే అని దివ్య మాట ఇస్తుంది.


Also Read: రాజ్ పక్కన పెళ్ళికూతురిగా కావ్య- రుద్రాణి ప్లాన్ మామూలుగా లేదు


హాస్పిటల్ కి క్యారేజ్ తీసుకొచ్చి కూడా ఇవ్వకుండా మర్చిపోయాడంటే ఎవరో కనిపించారు, అమ్మని కూడా మర్చిపోయేలా చేశారు ఏం జరుగుతుంది. విక్రమ్ చేయి దాటి పోతే తన ప్లాన్స్ అన్నీ తలకిందులు అయిపోతాయని రాజ్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ అన్నం తీసుకుని తల్లి దగ్గరకి వస్తాడు. మళ్ళీ కాసేపు మాయమాటలు చెప్పి కొడుకుని తన చేతి నుంచి పోకుండా చేసుకుంటుంది.