స్వప్న లెటర్ రాసి పెట్టి పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోతుంది. కావ్య స్వప్న గతంలో చేసిన పనులు గుర్తుచేసుకుని ఫోన్ ట్రై చేస్తుంది. కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. పెళ్లి పీటల దగ్గర పెళ్లి కూతురు స్వప్న కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రుద్రాణి ఎంత సేపు అని చిరాకు పడుతుంది. కాసేపు వాళ్ళ బుర్ర తింటుంది మీనాక్షి. రుద్రాణి కళ్యాణ్ ని పిలిచి వీడు మీలాగే కవి వాడి కవితలు వినమని అంటగడుతుంది. అది విని అందరూ నవ్వుతారు మీనాక్షి బిక్కమొహం వేస్తుంది. పొద్దున కళ్ళు తిరిగి పడిపోయిందని రుద్రాణి చెప్తుంది. ఎక్కువ డైట్ చేయడం వల్ల అలా అయి ఉంటుందని తనే వెళ్ళి తీసుకొస్తానని రుద్రాణి వెళ్తుంది. అప్పుడే కనకం స్వప్న ఎవడో కారు ఎక్కి వెళ్ళిపోవడం ఏంటని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ రుద్రాణి వింటుంది. కావ్య, అప్పు కూడా కనకం కూతుర్లని తెలుసుకుంటుంది.


ఏమి తెలియనట్టు లోపలికి వచ్చి స్వప్న ఏదని అడుగుతుంది. అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ కూర్చున్నారేంటి, వీళ్ళిద్దరూ ఎవరు మీ ఇద్దరి కూతుర్లా. ఇప్పుడు వస్తుందా తను అని అంటుంది. కనకం వస్తుందని అనేసరికి లేచిపోయిన కూతురు ఎలా వస్తుందని రుద్రాణి అడుగుతుంది.


రుద్రాణి: ఈ అమ్మాయిలు ఎవరో తెలియదు అన్నావ్, కుండలకు రంగులు వేసుకునే మీ ఆయన్ని తీసుకొచ్చి క్షణం తీరిక ఉండదని అన్నావ్ ఇన్ని అబద్ధాలకు సమాధానం చెప్పు


కావ్య: సడెన్ గా మా అక్క చేసిన పనికి అమ్మ ఊరేసుకోబోయింది


Also Read: గూగుల్ లో వెతికి మరీ వేదకి ముద్దుపెట్టేసిన యష్- చిత్ర ప్లాన్ ఫెయిల్ చేసిన్ అభిమన్యు


రుద్రాణి: అక్కడ అందరూ ఎదురుచూస్తున్నారు. మీడియా ఉంది దుగ్గిరాల ఇంటికి కాబోయే కోడలు లేచిపోయిందని తెలిస్తే మా పరువు పోతుంది. మా నాన్న వంశ గౌరవానికి చాలా విలువ ఇస్తారు. ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి. ఇన్ని మాయలు చేసిన దానివి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యి


అప్పు: నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను


రుద్రాణి: అప్పటి వరకు టైమ్ లేదు అక్కడ పెళ్లి కూతురి కోసం పంతులు గోల చేస్తున్నాడు


కనకం: ఏం చెయ్యను దాని బదులు కావ్యని తీసుకెళ్ళి కూర్చోబెట్టలేను కదా


రుద్రాణి: (నా ఆలోచన కూడా అదే రాజ్ అంటే క్షణం కూడా పడని కావ్యని తీసుకెళ్ళి రాజ్ కి ఇచ్చి పెళ్లి చేస్తే అనుకుని) కూర్చొబెట్టు స్వప్న బదులు ఈ పిల్లని తీసుకెళ్ళి కూర్చొబెట్టు తాళి కట్టేలోపు అప్పు వెళ్ళి స్వప్నని తీసుకుని రా


కనకం: స్వప్న అంటే రాజ్ ని నచ్చింది అందుకే పెళ్లి ఒప్పుకుంది కావ్యని ఎలా కూర్చోబెడతాను


రుద్రాణి: మరి గొడవ జరగకుండా ఎలా ఆపుతారు. పెదరికానికి నువ్వు రిచ్ ముసుగు వేశావ్, ఇప్పుడు నీ కూతురికి ముసుగువెయ్


Also Read: నగలతో స్వప్న జంప్, కనకం షాక్- రాజ్ పెళ్లి కావ్యతోనే జరుగుతుందా?


అక్కడ రాజ్ ఇంతసేపు ఎందుకు రాలేదు ఒకవేళ ఇష్టం లేదా అని అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న అమ్మలక్కలు పెళ్లికి ఏవి సక్రమంగా జరగలేదని నోటికొచ్చినట్టు మాట్లాడతారు.


మీరు ఏం మాట్లాడరు ఏంటి నేను వెళ్ళి పెళ్లి కూతురు లేచిపోయిందని మీడియా ముందు చెప్తాను అని రుద్రాణి అనేసరికి కనకం తనని ఆపి మీరు చెప్పినట్టే చేస్తానని అంటుంది. అన్ని పరిస్థితుల్లో నువ్వే నన్ను కాపాడావ్ ఇప్పుడు కాపాడు అని కనకం ఎమోషనల్ అవుతుంది. రాజ్ తో కావ్య పెళ్లి జరిగితే అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంటుంది, ఉప్పు నిప్పులాంటి వీళ్ళు రోజు చిటపటలాడుతూ ఉంటారు రాజ్ తల్లి బాధపడుతూ ఉంటారని రుద్రాణి మనసులో అనుకుంటుంది. పెళ్లి కూతురు ఎంతకీ రాకపోయేసరికి రాజ్ తండ్రి కృష్ణమూర్తిని నిలదీస్తారు. కాళ్ళ మీద పడతాను పెళ్లికి ఒప్పుకో అని కనకం కూతుర్ని బతిమలాడుతుంది. దీంతో కావ్య సరే అని ఒప్పుకుంటుంది. తాళి కట్టడానికి ముందే అక్కని తీసుకొస్తానని అప్పుని మాట ఇవ్వమని కావ్య అడుగుతుంది.