వసుధార మెడలో తాళికి తనే కారణమని రిషి మీడియా ముందు ఒప్పుకుని దేవయానికి దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు. జగతి మేడమ్ చెప్పిన మాటలన్నీ నిజమే అంటాడు. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. వసు చాలా సంతోషిస్తుంది. రిషి ఏం మాట్లాడుతున్నావ్ అని దేవయాని అంటే అవును పెద్దమ్మ జగతి మేడమ్ చెప్పింది నిజమని చెప్తాడు. ఈ ప్రెస్ మీట్ పర్సనల్ విషయాల గురించి మాట్లాడటానికి కాదని అనేసరికి దేవయాని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి వసుధార వివరిస్తారని చెప్పేసి రిషి దేవయాని వెనుకే వెళతాడు.


దేవయాని: ఈ పెద్దమ్మ ఇంత క్రితమే చనిపోయింది, అసలు నువ్వు చేసింది ఏంటి నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి? నీకోసం నేను ఎంత కష్టపడ్డాను చిన్నప్పుడు నీ తల్లి వదిలేసి వెళ్తే నేను చూసుకున్నా కంటికి రెప్పలా కాపాడుకున్నా. నీ భవిష్యత్ కోసం పెళ్లి కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నా నాకు తెలియకుండా చెప్పకుండా నీ పెళ్లిని భవిష్యత్ ని నువ్వే నిర్ణయించుకున్నావ్ ఇది కరెక్ట్ కాదు. నీ భార్యని నువ్వు నిర్ణయించుకున్నాక ఈ పెద్దమ్మతో పనేముంది


రిషి: పెద్దమ్మ నా మాట వినండి ఏం జరిగిందో ఆ వివరాలు తర్వాత చెప్తాను


Also Read: రాజ్ పక్కన పెళ్ళికూతురిగా కావ్య- రుద్రాణి ప్లాన్ మామూలుగా లేదు


దేవయాని: చెప్పడానికి ఏమి లేదు అంతా అయిపోయింది నేను ఒక పిచ్చిదాన్ని నీ మీద అనవసరంగా ప్రేమ పెంచుకున్నా


రిషి: ఈ లోకంలో నాకు మీరు తప్ప ఎవరు లేరు నన్ను దూరం పెట్టకండి భరించలేను


ఫణీంద్ర రావడం గమనించి మాట మారుస్తుంది. ‘నీ నిర్ణయమే నా నిర్ణయం నీ సంతోషమే నా సంతోషమని’ అంటుంది. వసు సంతోషంగా రిషి క్యాబిన్ కి వస్తుంది. అక్కడ రిషి ఉండదు. రిషి సీట్లో కూర్చుని రిషి మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అక్కడ హార్ట్ సింబల్ మీద ఉన్న ఎండీ తీసుకుని నీ మీద తన ప్రేమని రాసుకున్నారు కదా అని తలుచుకుని మురిసిపోతుంది. వసు తనలో తనే మాట్లాడుకుంటూ ఉండగా రిషి వస్తాడు.


రిషి: ఏంటి ఈ హడావుడి ఏంటి ఈ గెంతులు


వసు: ఆనందం సర్ మన మధ్య ఉన్న సంఘర్షణకి ముగింపు ఇచ్చారు కదా


రిషి; ఈ ఆనందంలో ఒక విషయం మర్చిపోయావ్ నేను నీ భర్తనని మాత్రమే చెప్పాను నువ్వు నా భార్యవి అనలేదుగా


వసు: జగతి మేడమ్ చెప్పినవి ఒప్పుకున్నారుగా మళ్ళీ  ఇలా మాట్లాడుతున్నారు ఏంటి


రిషి: ఇప్పడు అదే చెప్తున్నా నేను నీ భర్తనే కానీ నువ్వు నా భార్యవి కాదు. నువ్వు చేసిన దానికి నేను నీ భర్తని అయ్యాను కానీ ఆ పని వల్ల నువ్వు నాకు భార్యవి కాలేవు కదా, ప్రశాంతంగా ఆలోచించు ఇందులో తప్పేముంది నీ చేతులతో నువ్వే తాళి వేసుకున్నావ్ అప్పుడు నువ్వు నేనే తాళిని కట్టాను అని భావించావ్


వసు: మీరు నన్ను తప్పు పడుతున్నారా?


Also Read: గూగుల్ లో వెతికి మరీ వేదకి ముద్దుపెట్టేసిన యష్- చిత్ర ప్లాన్ ఫెయిల్ చేసిన్ అభిమన్యు


రిషి: నీ ఊహల్లో భర్తని అయ్యాను. ఏదో పరిస్థితులు అన్నావ్ బెదిరింపులు అన్నావ్ తాళి వేసుకున్నావ్ ఆ విషయంలో నిన్ను కొంచెం కూడా తప్పు పట్టడం లేదు నీ ప్రేమని కూడా తప్పు పట్టడం లేదు


వసు: మీ భార్యని ఎందుకు కాను సర్


రిషి: నీ అంతట నువ్వే తాళి కట్టుకుంటే నీకు భర్తని ఎలా అవుతాను. అసలు పెళ్లి అంటే ఏదేదో ఊహించుకున్నా కానీ నువ్వు నా ప్రేమని అపహాస్యం చేశావేమో


వసు: తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని నన్ను నేను కాపాడుకోవడానికి ఈ తాళి మెడలో వేసుకున్నా


రిషి: సమాజం నిన్ను ప్రశ్నలు వేస్తుంటే ఆ బాధ్యతని నేను తీసుకున్నా అది నీ మీద ఉన్న ప్రేమ, గౌరవం. భర్త అంటే పదవి కాదు ఒక బాధ్యత నలుగురిలో నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చినట్టు నీ బాధని నా బాధగా భావించి ఒప్పుకున్నా


వసు: భార్యాభర్తల మధ్య కొత్త లాజిక్ చూపించారు. నేను మీ భార్యని కాదని టెక్నికల్ గా అంటున్నారు