అషు రెడ్డి (Ashu Reddy) పేరును మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు 'బిగ్ బాస్' (Bigg Boss Telugu) కార్యక్రమం ద్వారా పాపులర్ అయ్యారు. అంతకు ముందు నితిన్ 'ఛల్ మోహన్ రంగ', 'హ్యాష్ ట్యాగ్ పీకే' సినిమాల్లో కూడా నటించారు. ఇక, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషు రెడ్డి ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానళ్లలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అషు రెడ్డిలో యాక్టింగ్ టాలెంట్ కంటే బ్యూటీని ఎక్కువ మంది అభిమానిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు అషు రెడ్డి గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు.
అషు రెడ్డి బికినీ బ్రాండ్ ఏమిటంటే?
అషు రెడ్డి సోషల్ మీడియా పేజీలు చూస్తే అప్పుడప్పుడూ బికినీ ఫోటోలు కూడా కనిపిస్తాయి. ఇంకొంచెం నిశితంగా గమనిస్తే... బికినీ స్ట్రిప్ మీద ఆ బ్రాండ్ పేరు ఉంటుంది. ఫేమస్ 'విక్టోరియా సీక్రెట్' బికినీలు, బ్రాలు అషు రెడ్డి ధరిస్తున్నారు. గతంలో హీరోయిన్లు హన్సిక, రాయ్ లక్ష్మి తదితరులు విదేశాలు వెళ్ళినప్పుడు 'విక్టోరియా సీక్రెట్' షాప్ ముందు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అషు రెడ్డి బికినీ రేటు ఎంత అంటే?
'విక్టోరియా సీక్రెట్'లో ఒకే తరహా బికినీలు అషు రెడ్డి తీసుకున్నారు. కలర్స్ వేర్వేరు గానీ మోడల్ ఒక్కటే. ఆ బికినీ రేటు ఆరున్నర వేలు. ఇంకా చెప్పాలంటే... రూ. 6,200 నుంచి రూ. 6,500 మధ్యలో ఉంటుంది. ఈ తరహా స్విమ్మింగ్ వేర్ అయితే సుమారు 10 వేల రూపాయలు. అషు రెడ్డి బికినీ ఫోటోలను మీరు కింద సోషల్ మీడియా పోస్టుల్లో చూడవచ్చు.
Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
ప్రస్తుతం అషు రెడ్డి ఎడారి దేశం దుబాయ్ (Ashu Reddy Bikini Cost) లో ఉన్నారు. స్నేహితులతో కలిసి టూర్ వేశారు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, ఆమె కలిసి ఉన్న ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అషు రెడ్డి టీవీ కార్యక్రమాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. సుక్కు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న 'ఎ మాస్టర్ పీస్' సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించనున్నారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.
Also Read : విలన్‌గా 'వెన్నెల' కిశోర్? - సారీ ఫ్యాన్స్, అది రాంగే!
ప్రేక్షకుల అభిమానంతో పాటు కొన్నిసార్లు ఆకతాయిలను కూడా అషు రెడ్డి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఆ మధ్య ఓ నెటిజన్ 'Are You Virgin?' అని ప్రశ్నించాడు. అంటే... ఆమె ఎవరితో అయినా శృంగారంలో పాల్గొన్నారా? లేదా? అనేది తెలుసుకోవాలని ప్రయత్నించాడు. అషు రెడ్డికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లికి ముందు శృంగారం చేశారా? లేదా? అని ఇలా ప్రశ్నించారు. అషు రెడ్డి చాలా హుందాగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ''Yess I'm Virgo'' (అవును... నేను కన్యనే) అని ఆమె చెప్పారు. సినిమా రంగంలో అమ్మాయిలకు ఈ విధమైన ప్రశ్నలు తప్పవేమో!?