గుప్పెడంతమనసు జూలై 4 ఎపిసోడ్ (Guppedanta Manasu July 4th Written Update)
వసుధార సేవలో మునిగితేలిన రిషి రూమ్ కి వెళ్లి కూర్చుని అవే విషయాలు పదే పదే గుర్తుచేసుకుంటాడు. బోర్ కొడుతోంది నాకు కంపెనీ ఇవ్వగలరా అని వసు మాటలు తలుచుకుంటాడు.
రిషి: ఎందుకు నాలో ఈ సంఘర్షణ, వద్దు వద్దు అనుకున్నా ఈ జ్ఞాపకాలు ఎందుకు వెంటాడుతున్నాయి, తను మళ్లీ కాలేజీలోకి నాజీవితంలోకి రావడం వల్లేనే ఇదంతా అసలు నేను ఇక్కడున్నానని తెలిసి కూడా ఎందుకొచ్చింది..నేను ఇక్కడ ఉండడం వేస్ట్ అనుకుంటూ కోపంగా లేచి కార్లో బయటకు వెళ్లిపోతాడు. రోడ్డుపక్కన కారు ఆపేసి నిల్చుని మళ్లీ వసు మాటలు తలుచుకుంటాడు. తప్పు చేసింది నువ్వు కాదుకదా మరెందుకు పారిపోతున్నావ్, అసలు నీ మనసులో ఏముంది తనపై కోపమా, ద్వేషమా ఏముంది, తన ప్రేమ నిన్ను మారుస్తుందని మళ్లీ రిషిధార బంధం నిలబడుతుందని భావిస్తున్నావా వాళ్లు నీ జీవితంలో లేరు తనని చూసి ఎందుకు పారిపోతున్నావ్, వసుధారని చూస్తే కరిగిపోతావా, తనే కాదు మా డాడ్ వచ్చినా కూడా నా మనసు మారదు, కొంతకాలం ఉండి వెళ్లిపోతుంది తనకోసం నేనెందుకు వెళ్లిపోవాలి, ఎవరికోసమో విశ్వనాథం - ఏంజెల్ ని బాధపెట్టకూడదు, నేను సాదా సీదా లెక్చరర్ ని మాత్రమే నాకంటూ బంధాలు గతం లేదు వాటిగురించి ఆలోచించకూడాదు అని తనలో తానే మాట్లాడుకుంటాడు. ఆ తర్వాత ఇంటికెళ్లిపోతాడు.
Also Read: మహేంద్ర వాళ్ళ చెంతకి చేరిన ఫణీంద్ర- దాచినా దాగని రిషి ప్రేమ, ఎంతైనా జెంటిల్మెన్ కదా!
వసుధార
రూమ్ లో ఒంటరిగా కూర్చున్న వసుధార రిషి పరిచయం అయినప్పటి నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటుంది. మీ మేలు కోసం నేను అబద్దం చెప్పాను కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. దానికి ప్రతిఫలంగా ఈ బాధను అనుభవిస్తూనే ఉన్నాను అనుకుంటూ రిషిసార్ ని చూడాలని అనిపిస్తోంది అనుకుంటూ రూమ్ నుంచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ రిషి రూమ్ కి వెళుతుంది. అక్కడ రిషి ఉండడు.. లైట్ వేసి చూసి ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లి ఉంటారు కాల్ చేసి కుక్కుంటాను అనుకుంటూ తన రూమ్ కి వెళ్లి కాల్ చేస్తుంది. కట్ చేస్తాడు రిషి. నువ్వెందుకు కాల్ చేశావో నాకు తెలుసు. నువ్వున్నచోట నేను ఉండలేనని భయపడుతున్నావు కానీ అవెప్పటికీ నిజాలుకావు అనుకుంటాడు.
ఇంకా రిషి రాలేదేంటని విశ్వనాథం, ఏంజెల్ ఇద్దరూ ఎదురచూస్తుంటారు. ఏంజెల్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసిన రిషి కాసేపట్లో ఇంటికి వచ్చేస్తానని చెబుతాడు. ఏదైనా సమస్యా అని ఏంజెల్ అడిగితే నిద్రపట్టడం లేదు బయటకు వచ్చానంటాడు. ఎక్కువగా ఏదో ఆలోచిస్తావ్ అందుకే నిద్రపట్టి ఉండదు త్వరగా రా అనేసి కాల్ కట్ చేస్తుంది. మీరు కంగారు పడొద్దు పడుకోండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇదంతా వసుధార వింటుంది మీరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ నా ప్రశ్నకు సమాధానం దొరికింది చాలు అనుకుంటుంది వసుధార. ఏంజెల్ వెళ్లి పోతుంది హాల్లో విశ్వనాథం ఒక్కడే కూర్చుని ఉంటాడు. వసుధార నెమ్మదిగా అడుగు వేసుకుంటూ అక్కడకు వెళుతుంది. ఇంకా నిద్రపోలేదా అని విశ్వనాథం అంటే నిద్రపట్టలేదని చెప్పి మీరు వెళ్లి నిద్రపోండి సార్ నేను ఇక్కడే ఉంటానని చెప్పి విశ్వనాథాన్ని పంపించేస్తుం
రిషి రానేవస్తాడు
వసు: నేనిక్కడ ఉండడం మీకు ఇబ్బంది కలిగిస్తోందా నావల్ల మీకు అసౌకర్యం కలిగి ఉంటే నేను భరించలేను సార్
రిషి: మీరు చాలా వింతగా మాట్లాడుతున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. కొందరు నా జీవితాన్ని నానుంచి లాగేసి గార్బేజ్ లో పడేశారు అలాంటి మీరు నా అవసరం, సౌకర్యం గురించి మాట్లాడుతున్నారా? అలాంటి సానుభూతి నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఎదుటివారు చూపించే సానుభూతి కాదు నమ్మకం, నమ్మిన వాళ్లని మోసం చేయకుండా ఉండడం
వసు: మేం మోసం చేయలేదు..మమ్మల్ని నమ్మిన వాళ్ల బాగుకోసం తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది
రిషి: పరిస్థితులకు భయపడి రిషి పారిపోడు..తను వద్దనుకుంటే మాత్రమే వెళ్లిపోతాడు..రిషి ఒంటరిగా బతకగలడు
వసు: మీ స్వభావం నాకు తెలుసు, అందుకే శూలాల్లాంటి మాటల్ని భరిస్తున్నాను . ఎందుకంటేనేను అబద్ధం చెప్పాను, మీకు నచ్చదని తెలిసినా చెప్పాను అది మీ మనసుకి గాయమై మిమ్మల్ని నాకు దూరం చేసింది. నాకు అర్థం చేసుకోగలను. మీ పొగరుని మీరు చిన్న మాట కూడా అననివ్వరు అలాంటిది మీరే నన్ను నిందిస్తున్నారంటే మీ మనసులో ఎంత మంటలు రేగాయో అర్థం చేసుకోగలను. మీరు కొట్టినా సహిస్తాను
రిషి: ఇక ఆపండి మేడం ఇలాంటి మాటలతో నన్ను మళ్లీ ఏమార్చకండి. దయచేసి రిషిని రిషిలానే ఉండనివ్వండి..వెళ్లిపడుకోండి అని చెప్పేసి రిషి వెళ్లిపోతాడు
మీకు నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నారు నిజం తెలిస్తే మమ్మల్ని అర్థం చేసుకుంటారు అనుకుంటూ బాధపడుతుంది వసుధార.. నా అంతట నేను తాళి వేసుకున్న విషయంలో నిజం తెలిసేవరకూ మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు, ఇది కూడా అంతే అనుకుంటుంది.
Also Read: జూలై 4 రాశిఫలాలు, ఈ రాశులవారి కెరీర్లో అద్భుతమైన ముందడుగు పడుతుంది!
మరోవైపు ఫణీంద్ర ఇంటికి రాకపోవడంతో దేవయాని-శైలేంద్ర ఆలోచనలో పడతారు. నువ్వు వాళ్ల దగ్గరకు వెళ్లి ఇంటికి తీసుకురాకపోతే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందని భయపడతారు. ఇప్పుడు మన ఆయుధం మీ నాన్న నువ్వు దూకుడుగా మాట్లాడితే ప్రయోజనం ఉండదు, నువ్వు చేసే ప్రతి పనికి మాటకి మీ నాన్న కరిగిపోవాలి లేదంటే అక్కడే ఉండి వర్క్ చేసుకుంటాం అంటారు. మీ నాన్న మాటని మహేంద్ర కాదనలేడు..జగతి మహేంద్రని ఫాలో అవుతుంది. మీ నాన్నకి మనపై అనుమానం వచ్చింది కొంచెం తడబడినా పసిగట్టేస్తారు అందుకే పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని ముగ్గుర్నీ ఇంటికి తీసుకురా అని చెబుతుంది దేవయాని. సరే అని గెస్ట్ హౌజ్ కి వెళతాడు శైలేంద్ర..
మర్నాడు పొద్దున్నే రిషి హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటాడు... హాల్లోకి వచ్చిన వసుధార ఏంజెల్ అని పిలుస్తుంది. ఏంటిది బ్యాగుతో రెడీగా ఉన్నావ్ ఎక్కడికి ప్రయాణం అని అడుగుతుంది. ఈ రోజు నుంచి కాలేజీకి వెళదాం అనుకుంటున్నాను ఏంజెల్ అట్నుంచి అటే మా ఇంటికి వెళ్లిపోతాను, ఇప్పుడు బాగానే ఉన్నాకదా అంటుంది వసుధార. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా అని క్వశ్చన్ చేస్తుంది ఏంజెల్.